ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సమీక్ష కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది.
8th Pay Commission Updates: 8వ వేతన సంఘం ముందు పే స్కేళ్ల విలీనానికి ప్రతిపాదన! కనీస వేతనం 69వేలకు పెరిగే అవకాశం!
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘానికి నేషనల్ కౌన్సిల్ కీలక ప్రతిపాదనలు సమర్పించింది. పే స్కేళ్ల విలీనంతోపాటు, 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలని కోరింది.

- 8వ వేతన సంఘం: పే స్కేళ్ల విలీనం ప్రతిపాదన సిద్ధమైంది.
- వివిధ లెవల్స్ విలీనం, అసమానతలు తొలగింపు లక్ష్యం.
- 3.833 ఫిట్‌మెంట్&zwnj ఫ్యాక్టర్&zwnjతో జీతాలు పెరుగుతాయని అంచనా.
- ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్&zwnj ఆధారపడి ఉంది.
8th Pay Commission Pay Scale Merger:కేంద్రప్రభుత్వ ఉద్యోగుల(Central Government Employees ) ఆర్థిక భవిష్యత్‌ను నిర్ణయించే 8వ వేతన సంఘం పని కీలక దశకు చేరుకుంది. ఉద్యోగుల ప్రతినిధి సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ - జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ(NC-JCM) స్టాఫ్ సైడ్(NC-JCM Memorandum) ఇటీవల కమిషన్‌ను తన మెమోరాండం సమర్పించింది. ఈ నివేదికలో కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా ఉన్న పే స్కేళ్ల నిర్ణాణాన్ని సమూలంగా మార్చే పే స్కేళ్ల విలీనం అనే వినూత్న ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లెవల్ 1 నుంచి లెవర్ 17 వరకు వేర్వేరు పే స్కేళ్లు ఉన్నాయి. అయితే ఎన్‌సీ-జేసీఎం ఈ నిర్మాణాన్ని సరళీకరించాలని సూచిస్తూ, కీలక మార్పులు ప్రతిపాదించింది. లెవల్ 2, లెవల్ 3 విలీనం చేయాలని ఒకే పే స్కేల్ కింద తీసుకురావాలని సూచించింది. లెవల్4 , లెవర్ కలపాలని, లెవరల్ 7, లెవల్ 8ను విలీనం చేయాలని సూచించింది. లెవల్ 9, లెవల్ 10ను కలిపేయాలని అభ్యర్థించింది. లెవల్ ఐదు ను, లెవల్ ఆరులో విలీనం చేయాలని కూడా ఒక ప్రత్యేక సూచన చేసింది.
ఉద్యోగుల జీతాల్లో ఉన్న అసమానతలను తొలగించడం, పాలనాపరమైన చిక్కులను తగ్గించడం ఈ విలీనం ప్రధాన ఉద్దేశం. ఒకే రకమైన బాధ్యతలు, స్వల్ప వ్యత్యాసాలు ఉన్న క్యాడర్‌ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ఉద్యోగులకు మెరుగైన ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని స్టాఫ్‌సైడ్ భావిస్తోంది. దీనివల్ల ప్రమోషన్ల సమయంలో వచ్చే టెక్నికల్ ఇబ్బందులు తగ్గే ఛాన్స్ ఉందని వివరించారు.
జీతాల లెక్కింపులో అత్యంత కీలకమైన అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఎన్‌సీ జేసీఎం తన మెమోరాండంలో 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor)అమలు చేయాలని కోరింది. ఈ సంఖ్యతో ప్రస్తుత బేసిక్ జీతాన్ని లెక్కించడం ద్వారా కొత్త వేతనాన్ని నిర్ణయిస్తారు. దీని వల్ల ప్రస్తుతం 18వేల ఉన్న కనిష్ట జీతం ఏకంగా 69వేలకు పెరుగుతుంది. పే స్కేళ్ల విలీనం తర్వాత లెవల్-2 లెవల్-3 కలిసి కొత్త స్కేల్ కనీసం వేతన 83 వేలకుపైగా ఉంటుంది. లెవల్7, 8 విలీనం తర్వాత కొత్త పే స్కేల్ కనీసం 1,82,500 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భారత్‌లో ప్రతి పది ఏళ్లకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సమీక్ష కోసం ఈ కమిషన్ ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం 8వ వేతన సంఘం వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నుంచి అభిప్రాయాలను, సూచనలు సేకరిస్తోంది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఇస్తున్న ప్రతిపాదనలను 8వ వేతన సంఘం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వాటి ఆధారంగా నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించనుంది. దీనికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
8వ వేతన సంఘం ముందున్న ప్రతిపాదనలు అమలు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో అనూహ్య మార్పులు వస్తాయి. ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడతాయి. అయితే ఇది ప్రభుత్వ ఖజానాపై చూపే ప్రభావం, ఆర్థిక సంస్కరణల దిశగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
8వ వేతన సంఘం ఎందుకు ఏర్పాటు చేయబడింది?
8వ వేతన సంఘానికి NC-JCM ఎలాంటి ప్రతిపాదనలు సమర్పించింది?
NC-JCM వేతనాల పెంపుతో పాటు, పే స్కేళ్ల విలీనం అనే ప్రతిపాదనను సమర్పించింది. లెవల్ 2, 3; లెవల్ 4, 5; లెవల్ 7, 8; లెవల్ 9, 10 లను విలీనం చేయాలని సూచించింది.
పే స్కేళ్ల విలీనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
ఉద్యోగుల జీతాల్లోని అసమానతలను తొలగించడం, పాలనాపరమైన చిక్కులను తగ్గించడం, మరియు ప్రమోషన్ల సమయంలో వచ్చే సాంకేతిక ఇబ్బందులను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
NC-JCM ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను కోరింది?
NC-JCM 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను అమలు చేయాలని కోరింది. దీనివల్ల కనిష్ట జీతం 18 వేల నుండి 69 వేలకు పెరుగుతుందని అంచనా.
8వ వేతన సంఘం ప్రతిపాదనలు అమలు అయితే ఎలాంటి మార్పులు వస్తాయి?
ప్రతిపాదనలు అమలు అయితే, ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడతాయి. అయితే, ప్రభుత్వ ఖజానాపై ప్రభావం మరియు ప్రభుత్వ నిర్ణయంపై ఇదంతా ఆధారపడి ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు






















