అన్వేషించండి

LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్

LPG Gas Cylinders | కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీ కోసం ఏటా ఈ-కేవైసీ తప్పనిసరి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. మార్చి 31లోపు ఉచితంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గ్యాస్ సబ్సిడీకి ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ తప్పనిసరి అని తెలిపాయి.
  • గ్యాస్ కంపెనీ యాప్, ఆఫీస్, డెలివరీ బాయ్ ద్వారా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.
  • మార్చి 31లోపు ఈ-కేవైసీతో సబ్సిడీ నిలిచిపోకుండా పొందవచ్చు.
  • ఈ-కేవైసీ ఉచితం, గ్యాస్ సరఫరాకు ఆటంకం ఉండదు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీని పొందేందుకు డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు ప్రతి ఏటా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారులు తాము వాడుతున్న గ్యాస్ కంపెనీ (ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం) మొబైల్ యాప్ ద్వారా లేదా నేరుగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లి తమ ఆధార్ ధ్రువీకరణను ఉచితంగా చేసుకోవచ్చు.

సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసే అవకాశం కల్పించినట్లు తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ http://www.pmuy.gov.in/e-kyc.html  ను సంప్రదించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఏడాదికి గరిష్ఠంగా తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీని అందిస్తోంది. అయితే, 8, 9 రీఫిల్‌కు సంబంధించిన సబ్సిడీని పొందాలంటే బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి చేశాయి. మార్చి 31వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటే నిలిపివేసిన సబ్సిడీ సొమ్ము తిరిగి చెల్లిస్తారు. లేనిపక్షంలో ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది. ఈ-కేవైసీ పూర్తి చేయకపోయినా గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని, కానీ సబ్సిడీ మాత్రం రాదని అధికారులు వివరించారు.

గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి ఉన్న అవకాశాలు
మొబైల్ యాప్: వినియోగదారులు తాము వాడుతున్న గ్యాస్ కంపెనీ (ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ లేదా భారత్ పెట్రోలియం) అధికారిక మొబైల్ యాప్ ద్వారా స్వయంగా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు.

డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు: నేరుగా మీ ఎల్పీజీకి సంబంధిత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కు వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

డెలివరీ బాయ్ ద్వారా: సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా సులభంగా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.

ఉచిత సేవ: ఈ ప్రక్రియ అంతా పూర్తిగా ఉచితం కాగా, వినియోగదారులు ఎలాంటి ఫీజు, నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.

కేంద్రం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కనెక్షన్‌పై గరిష్ఠంగా 9 సిలిండర్ల వరకు రాయితీని అందిస్తుంది. అయితే, సాధారణ వినియోగదారుల కంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ఈ రాయితీ ఎక్కువగా అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌పై 300 రాయితీని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. నేరుగా వినియోగదారుల ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. వార్షిక ఆదాయం ₹10 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ వర్తించదని కేంద్రం తెలిపింది. 

Frequently Asked Questions

గ్యాస్ సబ్సిడీ పొందడానికి ఈ-కేవైసీ తప్పనిసరి కాదా?

ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ పూర్తి చేయడం గ్యాస్ సబ్సిడీని పొందడానికి తప్పనిసరి. ఇది లేకుండా సబ్సిడీ రాదు.

ఈ-కేవైసీ ఎలా పూర్తి చేసుకోవచ్చు?

గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో లేదా సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఈ-కేవైసీ చేసుకోవచ్చు.

ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఏమైనా డబ్బు చెల్లించాలా?

ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిగా ఉచితం. వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

మార్చి 31 లోపు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే ఏమవుతుంది?

మార్చి 31 లోపు పూర్తి చేయకపోతే, నిలిపివేసిన సబ్సిడీ సొమ్ము తిరిగి చెల్లించబడదు మరియు ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget