అన్వేషించండి

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!

LPG Subsidy New Rules: వార్షిక ఆదాయం పది లక్షలు దాటిన పన్ను చెల్లింపుదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతోంది. వారికి ఎల్పీజీ సబ్సిడీ శాశ్వతంగా నిలిపివేసేందుకు చర్యలు చేపట్టింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పది లక్షల వార్షిక ఆదాయం దాటితే ఎల్పీజీ సబ్సిడీ రద్దు.
  • ఆదాయపు పన్ను రికార్డులతో చమురు సంస్థల అనుసంధానం.
  • అర్హులైన వారికే గ్యాస్ సబ్సిడీ కొనసాగింపు.
  • సబ్సిడీ నిలిపేస్తే మార్కెట్ ధరకే సిలిండర్లు కొనాలి.

LPG Subsidy New Rules: భారత్‌లో ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, చమురు విక్రయ సంస్థలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. మీరు గ్యాస్ సబ్సిడీ పొందుతున్నట్టు అయితే వెంటనే మీ మొబైల్‌ ఫోన్‌ మెసేజ్‌లను ఒకసారి చెక్ చేసుకోండి. వార్షిక ఆదాయం పది లక్షల పరిమితిని దాటిన వారిని గుర్తించి, వారి సబ్సిడీ తొలగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వం రంగ చమురు సంస్థలు ఇప్పుడు వినియోగదారుల డేటాను ఆదాయపు పన్ను విభాగం రికార్డులతో నేరుగా అనుసంధానిస్తున్నాయి. ఈ ఆటోమేటెడ్‌ డేటా మ్యాచింగ్ ప్రక్రియ ద్వారా, ఏ కుటుంబాల వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పది లక్షల కంటే ఎక్కువగా ఉందో వారిని గుర్తిస్తున్నారు. 

గతంలో సబ్సిడీని వదులుకోవాలని కోరుతూ గివ్‌ ఇట్‌ అప్‌ వంటి స్వచ్ఛంద ప్రచారాలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రూల్స్ అమలులో కఠినంగా వ్యవహరిస్తోంది. అర్హత లేని వారు సబ్సిడీ పొందకుండా ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ నిబంధన కేవలం గ్యాస్‌ కనెక్షన్ కలిగిన వ్యక్తి ఆదాయంపైనే కాకుండా, ఆ కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయంపై కూడా ఆధారపడి ఉంటుంది. సదరు వినియోగదారుడి వార్షిక ఆదాయం పది లక్షలు దాటినా, గ్యాస్‌ కనెక్షన్‌తో లింక్ అయి ఉన్న భార్య, లేదా భర్త వంటి కుటుంబ సభ్యుల ఆదాయం పది లక్షల పరిమితిని మించినా సబ్సిడీ నిలిపేస్తారు. 

గత ఆర్థిక సంవత్సరంలో మీ స్థూల పన్ను పరిధిలోకి వచ్చే ాదాయం ఈ పరిమితిని దాటినట్టు ఐటీ రికార్డుల్లో ఉంటే మీరు అనర్హులుగా మారిపోతారు. 

ఏడు రోజుల గడవు 

రికార్డులతో మ్యాచ్ అయిన వినియోగదారులకు చమురు సంస్థల నుంచి అధికారిక ఎస్‌ఎంఎస్ వస్తుంది. అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను రికార్డుల ప్రకారం మీ లేదా మీ కుటుంబ సభ్యుడి ఆదాయం పది లక్షల పరిమితిని మించింది. నిర్ణీత సమయంలోగా స్పందించకుంటే సబ్సిడీ నిలిపోతుంది. అని ఆ మెసేజ్ సారాంశం. 

మీకు ఈ మెసేజ్ వచ్చినట్టు అయితే కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఒక వేళ ప్రభుత్వ రికార్డుల్లో తప్పు ఉందని, మీరు భావిస్తే వెంటనే సంబంధిత చమురు సంస్థ డిజిటల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు జాతీయ టోల్ ఫ్రీ నెంబర్‌ 1800-2333-555కు కాల్ చేసి తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. 

ఒకవేళ మీరు నిర్ణీత సమయంలోపు స్పందించకపోతే, పహల్ పథకం కింద మీ ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలో జమ అయ్యే సబ్సిడీ శాశ్వతంగా నిలిపేస్తారు. అటువంటి వినియోగదారులు భవిష్యత్‌లో మార్కెట్ ధరకే సిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

ఎప్పటి నుంచి అమల్లో ఉంది? 

గ్యాస్ సబ్సిడీపై పది లక్షల ఆదాయ పరిమితిని ప్రభుత్వం తొలిసారిగా డిసెంబర్‌ 2015లో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో ఇది స్వచ్ఛందంగా ఉండేది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఇంధన పొదుపు, ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తున్న తరుణంలో మే 11న వడోదరలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విలువై విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ఆయన కోరారు. ప్రజా రవాణా వాడటం, కార్ పూలింగ్‌ చేయడం, సాధ్యమైనంత వరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పని చేయాలని సూచించారు.

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

వార్షిక ఆదాయం ఎంత మించితే గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుంది?

మీ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు మించితే లేదా మీ కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుంది.

ఆదాయపు పన్ను రికార్డులతో గ్యాస్ కనెక్షన్ డేటాను ఎందుకు అనుసంధానిస్తున్నారు?

అర్హత లేని వినియోగదారులకు సబ్సిడీ అందకుండా నిరోధించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు.

సబ్సిడీ నిలిపివేతపై సందేశం వస్తే ఏం చేయాలి?

మీ ఆదాయం గురించి మీకు ఏమైనా సందేహాలుంటే, వెంటనే చమురు సంస్థ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-2333-555 కి కాల్ చేయవచ్చు.

సబ్సిడీ ఆగిపోతే భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్లను ఎలా కొనుగోలు చేయాలి?

సబ్సిడీ నిలిచిపోయిన వినియోగదారులు భవిష్యత్తులో మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget