అన్వేషించండి

LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా

LPG Cylinder Price New Rates: జూన్ 1న తొలి రోజే సామాన్య ప్రజలపై ధరల పెరుగుదల భారం పడింది. గ్యాస్ కంపెనీలు ఎల్‌పీజీ (LPG) కమర్షియల్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 42 పెరిగింది.
  • హైదరాబాద్, కోల్‌కతాలో కూడా ధరలు పెరిగాయి.
  • గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఉంది.
  • 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా పెరిగింది.

LPG Cylinder Prices Hiked | న్యూఢిల్లీ: కొత్త నెల తొలి రోజులనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచాయి. నేటి (జూన్ 1) నుంచి దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) వినియోగదారులపై అదనపు ఇంధన భారం పడనుంది. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 42 మేర పెరిగింది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price)లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం సామాన్యులకు ఊరట కలిగిస్తోంది.

హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర
సవరించిన ధరల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 42 పెరగడంతో రిటైల్ ధర సిలిండర్‌కు రూ. 3,113.50 కి చేరింది. అలాగే హైదరాబాద్‌లో రూ.52 మేర పెరగడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367 అయింది. కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 53.50 పెరగడంతో రిటైల్ ధర రూ. 3,255.50 కి చేరుకుంది.

ఈ తాజా ధరల పెంపు వల్ల కమర్షియల్ ఎల్‌పీజీపై ఎక్కువగా ఆధారపడే రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, చిన్న తరహా ఆహార వ్యాపార సంస్థలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగితే ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా సామాన్యుడికి భారంగా మారుతుంది. హోటల్, రెస్టారెంట్స్ లలో ఫుడ్ ఐటమ్స్ ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ సవరించిన ధరలు జూన్ 1 నుండి అమలులోకి వచ్చాయి.

Also Read: June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!

గ్యాస్ కంపెనీలు సరిగ్గా నెల రోజుల తర్వాత కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచాయి. అంతకుముందు మే 1న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచారు. మే నెలలో ఏకంగా రూ. 993 మేర పెంచారు. తాజాగా 42 మేర పెరిగింది. ఏప్రిల్ నెలలో 215 రూపాయలు, మార్చిలో 144 రూపాయల మేర 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం తెలిసిందే.

14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర

గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్‌పీజీ డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు చేయకపోవడం ప్రజలకు ఊరట కలిగించింది. రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 913 గానే ఉంది. హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.965 వద్ద ఉంది. ఇదివరకే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న లక్షలాది కుటుంబాలకు దీనివల్ల ఉపశమనం లభించింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర రూ. 357 వద్ద కొనసాగుతుండగా.. 47.5 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 130 మేర పెరగడంతో రూ.8,412 అయింది.

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ వార్తలు మిస్ అవ్వొద్దు

1

అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో

2 బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ ఎఫ్‌డీల కండీషన్లు మరిచిపోవద్దు
3

సరైన ITR ఫారమ్‌ ఎలా ఎంచుకోవాలి.. ఇంటి నుంచే మీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయండి

4

మీ ఇంట్లోని బంగారం ఇక ఆదాయ వనరు- కేంద్రం సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ! ఇవిగో ఫుల్ డీటైల్స్

5

బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!

పశ్చిమ ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ముడి చమురు ధరలతో పాటు ఎల్‌పీజీ ధరల భారీ పెంపునకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం భారత్‌కు దిగుమతులలో పెరిగిన ఖర్చుల వల్ల గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి పెరగడంతో ధరలు పెంచుతున్నారు.

5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ ధరలు పెరిగాయి
కమర్షియల్ సిలిండర్లతో పాటు, ఆయిల్ కంపెనీలు 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (FTL) సిలిండర్ల ధరలను కూడా పెంచాయి. ఢిల్లీలో 5 కిలోల ఎఫ్‌టిఎల్ (FTL) సిలిండర్ ధర రూ. 11 పెరగగా, ఇప్పుడు దీని రిటైల్ ధర రూ. 821.50 గా ఉంటుందని వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా చిన్న తరహా వ్యాపార సంస్థలు, సబ్సిడీ లేని ఎల్‌పీజీ సరఫరా అవసరమయ్యే వినియోగదారులు ఈ ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

Frequently Asked Questions

19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర ఎంత పెరిగింది?

19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ. 42 మేర పెరిగింది. ఈ ధరల పెరుగుదల జూన్ 1 నుండి అమల్లోకి వచ్చింది.

గృహ అవసరాల కోసం ఉపయోగించే LPG సిలిండర్ల ధరలలో మార్పు ఉందా?

లేదు, గృహ అవసరాల కోసం ఉపయోగించే డొమెస్టిక్ LPG సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది సామాన్యులకు ఊరటనిస్తుంది.

LPG ధరల పెంపు వల్ల ఎవరు ఎక్కువగా ప్రభావితం అవుతారు?

రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ సేవలు, చిన్న తరహా ఆహార వ్యాపార సంస్థలు వంటి కమర్షియల్ LPG పై ఆధారపడేవారు ఎక్కువగా ప్రభావితం అవుతారు.

5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG సిలిండర్ల ధరలు పెరిగాయా?

అవును, కమర్షియల్ సిలిండర్లతో పాటు 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీలో రూ. 11 పెరిగింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget