అన్వేషించండి

Home Loan Tips: హోం లోన్ గడువు ఎంచుకునేటప్పుడు ఈ పొరపాటు చేయవద్దు..

Home Loan Tenure: హోం లోన్ కాలపరిమితిని 10 నుండి 25 సంవత్సరాలకు మార్చడంతో వడ్డీ చెల్లింపులలో భారీగా వ్యత్యాసం ఏర్పడవచ్చు. సరైన ప్రణాళికతో, EMI, చెల్లించే మొత్తం వడ్డీలో బాగా పొదుపు చేయవచ్చు.

Home Loan Tenure Tips: సొంత ఇల్లు అనేది చాలా మందికి ఉంటే కల. కానీ ఇల్లు కొనుక్కోవడం కోసం చాలా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా రోజురోజుకూ పెరుగుతున్న ధరల కారణంగా తమ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ప్రజలు బ్యాంకుల నుండి హోమ్ లోన్ (Home Loan) తీసుకుంటారు. అయితే, హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఒక విషయంపై ఫోకస్ చేయడం చాలా ముఖ్యం. అదే హోం లోన్ తిరిగి చెల్లించేందుకు సరైన కాలపరిమితిని (టెన్యూర్) ఎంచుకోవడం. మీ ఖర్చులు, ఆదాయాన్ని బట్టి హోం లోన్ కాలపరిమితిని ఎంచుకోవాలి. తక్కువ సంవత్సరాలకు లోన్ తిరిగి చెల్లిస్తే మీపై ఎక్కువ వడ్డీ భారం పడదు.

చాలామంది ఈఎంఐ (EMI) తక్కువగా ఉండాలా లేదా లోన్ త్వరగా పూర్తి చేయాలా అనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. నిజానికి మీరు తీసుకునే ఈ నిర్ణయం వడ్డీ రూపంలో చెల్లించే మనీపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. అంటే మీరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారు. అందుకే సరైన బ్యాలెన్స్ పాటిస్తూ కాలపరిమితిని ఎంచుకోవడమే తెలివైన పనిగా చెప్పవచ్చు. కనుక హోం లోన్ కాలపరిమితి, వడ్డీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కాలపరిమితి వల్ల కలిగే భారీ వ్యత్యాసం
ఒక వ్యక్తి రూ. 2 కోట్ల హోమ్ లోన్‌ను సుమారు 8.5 శాతం వడ్డీ రేటుతో తీసుకున్నారు అనుకుందాం. ఒకవేళ ఈ లోన్ కాలపరిమితిని 20 ఏళ్లకు ఫిక్స్ చేస్తే, వడ్డీ మాత్రమే సుమారు రూ. 2.15 కోట్లు అవుతుంది. అప్పుడు మొత్తం చెల్లించే నగదు సుమారు రూ. 4.15 కోట్లకు చేరుకుంటుంది.

అదే లోన్‌ను 25 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంటే, వడ్డీ పెరిగి సుమారు రూ. 2.86 కోట్లు అవుతుంది. మొత్తం చెల్లింపులు రూ. 4.86 కోట్లకు చేరుతుంది. అంటే కేవలం 5 ఏళ్ల తేడాతో వడ్డీలో ఎంతటి భారీ వ్యత్యాసం ఉందో ఇది స్పష్టం చేస్తుంది. 

తక్కువ కాలపరిమితితో ప్రయోజనం
ఒకవేళ ఇదే లోన్‌ను మీరు కనుక 10 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంటే, మొత్తం వడ్డీ సుమారు రూ. 98 లక్షలకు తగ్గుతుంది. అప్పుడు మొత్తం చెల్లింపు కూడా తగ్గి సుమారు రూ. 2.98 కోట్లు అవుతుంది. అంటే మీరు ఎంచుకునే కేవలం కాలపరిమితిని మార్చడం వల్ల వడ్డీలో భారీ మార్పు వస్తుంది. సుదీర్ఘ కాలపరిమితి ఎంచుకుంటే మీరు చాలా డబ్బును వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

10 ఏళ్లు, 25 ఏళ్ల కాలపరిమితుల మధ్య కేవలం వడ్డీలోనే సుమారు రూ. 1.9 కోట్ల వరకు వ్యత్యాసం ఉంది. దీన్ని బట్టి చూస్తే సుదీర్ఘ కాలపరిమితి లోన్ సౌకర్యవంతంగా అనిపించినా, అందులో వడ్డీ భారం చాలా ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. 

హోం లోన్‌పై నిపుణుల సలహా
ఒక నివేదిక ప్రకారం హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ప్రారంభంలో 20 నుంచి 25 ఏళ్ల వంటి సుదీర్ఘ కాలపరిమితిని ఎంచుకోవడం బెటరని  ఆర్థిక నిపుణులు తరచుగా సూచిస్తుంటారు. దీనివల్ల ఈఎంఐ భారం ఎక్కువ అనిపించదు. అయితే, భవిష్యత్తులో మీ ఆదాయం పెరిగే కొద్దీ, అప్పుడప్పుడు ముందస్తు చెల్లింపులు చేస్తూ లోన్ కాలపరిమితిని కొంతమేర తగ్గించుకోవచ్చు. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు దాన్ని హోం లోన్ తీర్చడానికి ఉపయోగించడం వల్ల వడ్డీ భారం తగ్గి మీకు ఉపశమనం లభిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget