అన్వేషించండి

Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?

Janasena Caste Politics AP: పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో 'కులాలను కలపడం' అనే వ్యూహాన్ని సీరియస్‌గా అమలు చేస్తున్నారు. ఒకే వర్గం ముద్ర పడకుండా, దీర్ఘకాల రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటున్నారు.

Pawan Kalyan Rajya Sabha Seat Decision:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త సోషల్ ఇంజనీరింగ్   ప్రయోగానికి జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. కేవలం ఒకే వర్గానికి పరిమితమైన పార్టీగా జనసేనపై ప్రత్యర్థులు వేస్తున్న ముద్రను చెరిపేస్తూ..  కులాలను కలపడం  అనే తన మూల సిద్ధాంతాన్ని ఆయన క్షేత్రస్థాయిలో సీరియస్ గా అమలు చేస్తున్నారు.  ఎన్నికల విజయం అనంతరం ఆయన తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను గమనిస్తే, రాష్ట్రంలో సుస్థిరమైన రాజకీయాలు, సామాజిక సమతుల్యతను సాధించడమే లక్ష్యంగా పవన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అండగా ఉండే వర్గానికి అత్యధిక ప్రాధాన్యం

జనసేన పార్టీకి కాపు సామాజికవర్గం ప్రధాన కోర్ ఓటు బ్యాంక్  అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆ వర్గానికి సముచిత ప్రాధాన్యత ఇస్తూనే, ఇతర సామాజికవర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా పవన్ కల్యాణ్ సమదృష్టిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జనసేన తరఫున గెలిచిన ఇద్దరు లోక్‌సభ ఎంపీలు కాపు సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో.. తాజాగా వచ్చిన రాజ్యసభ ఎంపీ స్థానాన్ని ఇతర వర్గానికి కేటాయించడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం. రాజకీయాల్లో కేవలం సమీకరణాలకే పరిమితం కాకుండా, పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందనే బలమైన భరోసాను ఆయన ఈ నిర్ణయం ద్వారా క్యాడర్‌కు పంపారు.

కష్టాల్లో నిలబడి ఉండే వారికే అవకాశం  

ఈ సామాజిక సమతుల్యతపై పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో పార్టీ కోసం పనిచేసి, ప్రస్తుతం పార్టీలో లేని జేడీ లక్ష్మినారాయణ లాంటి నేతలను ఆయన ప్రస్తావిస్తూ.. ఒకవేళ ఆయన ఇప్పుడు పార్టీలో ఉండి ఉంటే కచ్చితంగా ఈ రాజ్యసభ అవకాశం ఆయనకే ఇచ్చి ఉండేవాడినని ఓపెన్‌గా ప్రకటించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఒక్కటే.. పార్టీ కోసం నిలబడే వారి విషయంలో తాను కులమతాల పట్టింపులను అస్సలు చూడనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కేవలం ఒకే కులం ముద్ర పడకుండా, సర్వమానవ సమానత్వం అనే జనసేన ఆశయాలకు అనుగుణంగా ఆయన నడుచుకుంటున్న తీరు విశ్లేషకులను సైతం ఆకర్షిస్తోంది.

పదిహేనేళ్ల కూటమి పయనం కోసం 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి కేవలం ఐదేళ్ల పరిపాలనకే పరిమితం కాకూడదని, రాబోయే పదిహేనేళ్ల పాటు ఈ బంధం బలంగా కొనసాగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాధ్యం కావాలంటే కేవలం పార్టీ అగ్రనాయకత్వాలు కలిస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో విభిన్న కులాలు, వర్గాల మధ్య సఖ్యత ఏర్పడాలని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ 'కులాల కలయిక' అనే కాన్సెప్ట్ సక్సెస్ అయితేనే కూటమి సుస్థిరంగా ఉంటుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి సాధ్యమవుతాయని ఆయన ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

పక్కాప్లాన్‌తో సోషల్ ఇంజినీరింగ్

రాజకీయంగా ఈ విధమైన సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగాలు గతంలో చాలా తక్కువ మంది నేతలే చేశారు. ప్రాంతీయ పార్టీలు సాధారణంగా తమ కోర్ ఓటు బ్యాంక్‌ను దాటి బయటకు రావడానికి సాహసించవు. కానీ పవన్ కల్యాణ్ భవిష్యత్తు రాజకీయాల కోసం ఈ రిస్క్ తీసుకుంటున్నారు. పార్టీ అంతర్గత పదవుల నుంచి, ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వరకు అన్ని వర్గాలకు, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు  , మైనారిటీలకు తగిన ప్రాధాన్యత కల్పించేలా ఆయన ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఇది కేవలం ఎన్నికల లబ్ధి కోసం చేసిన తాత్కాలిక వ్యూహం కాదని, ఏపీ రాజకీయాల్లో ఒక శాశ్వత మార్పు కోసం వేస్తున్న పునాది అని చెప్పవచ్చు.

 పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న ఈ వైఖరి జనసేన పార్టీని ఒక సరికొత్త లీగ్‌లోకి తీసుకెళ్తోంది. "అధికారాన్ని పంచుతూ అందరినీ కలుపుకుపోతా" అనే స్థాయికి ఆయన ఎదిగారు. కులాల మధ్య ఉన్న అంతరాలను తొలగించి, రాజకీయంగా అందరికీ భాగస్వామ్యం కల్పించాలనే ఆయన ప్రయత్నం ఏ మేరకు సఫలీకృతమవుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.   

 

టాప్ హెడ్ లైన్స్

Botsa Anusha: బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
Telangana Graduates MLC Election : కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
Nara Lokesh: మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
YS Jagan AP Local Body Elections: సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?
సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget