అన్వేషించండి

Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Fish Prasadam | హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం నాడు సైతం చేప ప్రసాదం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది.
  • రెండురోజులు కొనసాగే ఈ కార్యక్రమానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
  • రద్దీ నియంత్రణకు కౌంటర్లు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
  • చేప పిల్లలకు ధరలు నిర్ణయించి, ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేశారు.

Hyderabad Fish Medicine | హైదరాబాద్‌: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. మంగళవారం సైతం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రద్దీని నియంత్రించేందుకు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఈసారి ప్రత్యేకంగా 35 కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ పంపిణీ సమయంలో వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా షెడ్ల పరిధిలోనే ప్రసాదం పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. 

చేప ప్రసాదానికి ఎవరు ఎంత చెల్లించాలి..
ఈ కార్యక్రమం కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో సుమారు 1.4 లక్షల చేప పిల్లలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చిన్నపిల్లలకు ఇచ్చే చిన్న చేపను రూ. 40 చొప్పున, పెద్ద చేపలను రూ. 50 చొప్పున విక్రయించనున్నారు. మొత్తం 1.5 లక్షల మంది భక్తులకు సరిపోయేలా దాదాపు 5 క్వింటాళ్ల ప్రసాదాన్ని తయారు చేసినట్లు బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. దాదాపు 180 ఏళ్ల నుంచి బత్తిని కుటుంబం ఉబ్బసం సమస్య ఉన్న వారి కోసం చేప మందు పంపిణీ చేస్తోంది. కొన్నాళ్లకు ఇది చేప ప్రసాదంగా మారింది. 

Also Read: Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు
వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం నాంపల్లి గాంధీభవన్‌ వెనుక ఉన్న వేర్‌ హౌసింగ్‌ గోదాముల గేటు వద్ద 1 నుండి 6వ నంబరు వరకు ప్రత్యేక కౌంటర్లను కేటాయించారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, కాచిగూడ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ (TSRTC) ఉచిత బస్సులను నడుపుతోంది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీస్, ట్రాఫిక్ సహా మొత్తం 14 ప్రభుత్వ శాఖలు ఈ చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లలో భాగస్వాములు అయ్యాయి.

చేప ప్రసాదం పంపిణీపై బత్తిని అనిరుధ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి మొదలయ్యే చేప ప్రసాదం పంణిణీ ఈ నెల 9వ తేదీ రాత్రి వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆ తర్వాత దూద్‌బౌలిలోని తమ నివాసంలో మరో 3 రోజుల పాటు ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. ప్రసాదం కోసం వచ్చే చివరి వ్యక్తి వరకు పంపిణీ జరిగేలా బత్తిని సోదరులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఫిషరీస్‌ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ వివరించారు.

హైదరాబాద్‌‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ప్రతి ఏడాది తరహాలో ఈసారి సైతం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు అమలులో ఉంటాయని తెలిపారు. బత్తిని కుటుంబం ఇచ్చే చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులు, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరారు.

చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి బస్సులు, కార్లలో వచ్చే వారు గాంధీభవన్‌ లేదా గృహకల్ప బస్టాప్‌ల వైపు నుంచి రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాగే ఆటోల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం షెజాన్‌ హోటల్‌ వద్ద ప్రత్యేకంగా ఆటోలు ఆగే స్థలం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాంపల్లి పరిసర రోడ్లలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Frequently Asked Questions

చేప ప్రసాదం పంపిణీ ఎక్కడ జరుగుతుంది?

చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. సోమవారం రాత్రి 9 గంటల నుండి పంపిణీ ప్రారంభమై, ఈ నెల 9వ తేదీ రాత్రి వరకు కొనసాగుతుంది.

చేప ప్రసాదం ధరలు ఎలా ఉన్నాయి, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయా?

చిన్న చేప ధర రూ.40, పెద్ద చేప ధర రూ.50. వృద్ధులు, దివ్యాంగుల కోసం గాంధీభవన్ వెనుక వేర్‌హౌసింగ్ గేట్ వద్ద 1 నుండి 6వ నంబర్ వరకు ప్రత్యేక కౌంటర్లు కేటాయించారు.

చేప ప్రసాదం పంపిణీకి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయా, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి?

సోమవారం ఉదయం 6 గంటల నుండి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. భక్తుల కోసం టీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సులను నడుపుతోంది.

నాంపల్లిలో పంపిణీ తర్వాత చేప ప్రసాదం ఎక్కడ లభిస్తుంది?

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 9వ తేదీ రాత్రి వరకు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. ఆ తర్వాత దూద్‌బౌలిలోని బత్తిని కుటుంబ నివాసంలో మరో మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?
హీరో ఎక్స్‌ట్రీమ్ 250R వర్సెస్‌ KTM 250 డ్యూక్ - 250ccలో ఏ స్ట్రీట్ బైక్ బెస్ట్? ఫుల్‌ కంపారిజన్‌
Breaking News: హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
Embed widget