రామచందర్ తో పరిచయం ఉన్న మాట వాస్తవమే - కానీ నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు : నవదీప్
మాదాపూర్ డ్రగ్స్ కేసులో భాగంగా హీరో నవదీప్ ని తాజాగా నార్కోటిక్ అధికారులు విచారించారు. సుమారు 6 గంటల పాటు నవదీప్ ని విచారించగా, ఈ విచారణలో నవదీప్ ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.
డ్రగ్స్ కేసులో భాగంగా టాలీవుడ్ హీరో నవదీప్ ని నార్కోటిక్ అధికారులు తాజాగా విచారించారు. దాదాపు 6 గంటల పాటు ఈ విచారణ జరిగినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధం లేదంటూనే కొత్త విషయాన్ని బయట పెట్టాడు. నవదీప్ ఈ విచారణలో ఏం చెప్పాడు? అసలు ఏం జరిగింది? అనే వివరాలకు వెళ్తే.. సెప్టెంబర్ 14న తెలంగాణలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
వీళ్ళందరిని విచారించగా వీళ్ళతో హీరో నవదీప్ సంప్రదింపులు జరిపినట్టు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. అయితే ఈ డ్రెస్ కేసులో నవదీప్ ని నిందితుడిగా చేర్చిన పోలీసులు, తాజాగా అతన్ని విచారించారు. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 6 గంటలకు పైగా ఈ విచారణ సాగినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
" డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకు నేను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయమున్న మాట వాస్తవమే. కానీ అది పదేళ్ల క్రితం విషయం. ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నేను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్ ని నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడి విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామని అన్నారు. అలానే ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులను కూడా పరిశీలించి దర్యాప్తు చేశారు. డ్రగ్స్ కేసులో సీపీ సివి ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తుంది. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాను" అని నవదీప్ మీడియాతో చెప్పారు.
అంతేకాకుండా 'జరిగింది జరిగినట్టుగా రాయండి. కానీ మీ ఊహందినదిగా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయకండి. ఓ బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని చూపించండి' అంటూ నవదీప్ మీడియాని ఉద్దేశించి చెప్పారు. దీంతో విచారణ తర్వాత మీడియాతో నవదీప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను సుదీర్ఘంగా విచారించినట్లు టీఎస్ న్యాబ్ ఎస్పి సునీత రెడ్డి తెలిపారు. కేసులో 81 లింకులను గుర్తించామని, వాటిలో నవదీప్ 41 యొక్క లింకులకు వివరాలు అందించినట్లు వెల్లడించారు. సీట్, టీడీ విచారణలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఫోన్ లోని డేటాను నవదీప్ పూర్తిగా తొలగించారని, ఆ సమాచారం తిరిగి సేకరించాకా మరోసారి విచారిస్తామని సునీత రెడ్డి వివరించారు.
Also Read : అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial