అన్వేషించండి

Suhas: ప్రశాంత్ నీల్ అసిస్టెంట్‌తో సుహాస్ సినిమా - గ్రాండ్‌గా లాంచ్ కార్యక్రమం

కంటెంట్ ఉన్న కథలను ఎంచుకొని, నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సుహాస్. తన తరువాతి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ దర్శకత్వంలో చేయనున్నాడు.

డిఫరెంట్ కాన్సెప్ట్, చిన్న హీరోలు, టాలెంట్ ఉన్న మేకర్స్‌ను ఎంకరేజ్ చేయడం కోసం పలువురు నిర్మాతలు.. ఒకటికంటే ఎక్కువగా ప్రొడక్షన్ హౌజ్‌లను మెయింటేయిన్ చేస్తున్నారు. అలాంటి వారిలో దిల్ రాజు కూడా ఒకరు. టాలీవుడ్‌లోనే మోస్ట్ పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజుకు ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ ఉంది. అయినా కూడా ఇటీవల ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే పేరుతో మరో బ్యానర్‌ను ప్రారంభించాడు. దానికి తన కూతురు హర్షిత రెడ్డి ఓనర్‌గా వ్యవహరిస్తుండగా.. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌజ్ నుండి నాలుగో చిత్రం లాంచ్ జరిగింది. సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లాంచ్‌కు బడా దర్శకులు గెస్ట్‌లుగా హాజరయ్యారు.

చీఫ్ గెస్ట్‌లు హాజరు..
కంటెంట్ ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు హీరో సుహాస్. ఇప్పటికే తన చేతిలో పలు సినిమాలు ఉండగా.. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో మరో చిత్రం లంచ్ అయ్యింది. ఇందులో సుహాస్‌కు జోడీగా మలయాళ భామ సంకీర్తన విపిన్ నటించనుంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. దీని లాంచ్ కోసం ప్రశాంత్ నీల్, అనిల్ రావిపూడితో పాటు ‘బలగం’ ఫేమ్ వేణు కూడా చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. ముందుగా ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. వేణు.. మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశాడు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్‌తో పాటు దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ప్రశాంత్ నీల్ అసిస్టెంట్..
దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో తెరకెక్కనున్న ఈ నాలుగో సినిమాతో సందీప్ బండ్లా అనే యంగ్ డైరెక్టర్ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. ఇప్పటికే సందీప్ బండ్ల.. ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నాడు. ఇప్పటికే ‘బేబీ’ సినిమాకు మ్యూజిక్ అందించి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న విజయ్ బుల్గానిన్.. ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా అని మూవీ టీమ్ ఇప్పటికే రివీల్ చేసింది. అయితే తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక కథ రాలేదని, కథలో కొత్తదనం ఉంటుందని మేకర్స్ బయటపెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ లాంచ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చివరి దశలో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’..
ప్రస్తుతం సుహాస్.. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ యూట్యూబ్‌లో విడుదలయ్యి పాజిటివ్ రెస్పాన్స్‌ను సాధించింది. ఇందులోని పాటలు కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకోవడంతో తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడు సుహాస్. అలా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటికే ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ లాంటి కథలతో ప్రేక్షకులకు దగ్గరయిన సుహాస్‌కు.. తన తరువాతి ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా బ్రేక్ ఇస్తుందని కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ భావిస్తున్నారు.

Also Read: వారసులు చేస్తే ఈ ప్రశ్న వేస్తారా? నాపై చిన్నచూపు ఎందుకు? - 'హనుమాన్' హీరో తేజా సజ్జ

టాప్ హెడ్ లైన్స్

Isakapatnam Trailer : ఇసకపట్నం ట్రైలర్ రివ్యూ - తండ్రీ కూతుళ్ల మధ్య పవర్ వార్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇసకపట్నం ట్రైలర్ రివ్యూ - తండ్రీ కూతుళ్ల మధ్య పవర్ వార్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
Vandemataram Srinivas : హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
Embed widget