Teja Sajja: వారసులు చేస్తే ఈ ప్రశ్న వేస్తారా? నాపై చిన్నచూపు ఎందుకు? - 'హనుమాన్' హీరో తేజా సజ్జ
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అందులో మీడియా వేసిన కొన్ని ప్రశ్నలపై తేజ సీరియస్ అయ్యాడు.
సంక్రాంతికి ఎన్నో సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలతో పాటు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘హనుమాన్’ కూడా సంక్రాంతి రేసులో నిలబడింది. ఇప్పటికే టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు లిస్ట్‌లో తన పేరును చేర్చుకోగలిగాడు ప్రశాంత్ వర్మ. అందుకే తన అప్‌కమింగ్ మూవీ ‘హనుమాన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు అందుకునే విధంగా ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. అయితే తనను, తన సినిమాను తక్కువ చేసి చూస్తున్నవారికి, మాట్లాడుతున్నవారికి ఘాటు రిప్లై ఇచ్చాడు హీరో తేజ సజ్జా.
సమాధానం చెప్తాను.. ఏం అనుకోకూడదు!
ప్రశాంత్ వర్మ డైరెక్టర్ చేసిన ‘హనుమాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఇదొక విజువల్ వండర్ అని ట్రైలర్ చూసినవారంతా అనుకుంటున్నారు. ఇక ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది మూవీ టీమ్. ఆ సందర్భంగా కాన్వాస్ గ్రాండ్‌గా ఉంది. అందులో హీరో తేజ సజ్జా చాలా చిన్నగా కనిపిస్తున్నాడంటూ ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశారు. దానికి తేజ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఆ ప్రశ్న అడగగానే.. దానికి తాను సమాధానం చెప్తానని, కానీ ఎవరూ ఏమీ అనుకోకడదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు తేజ. దీనిని తాను చాలా వినమ్రతతో చెప్తున్నానని అన్నాడు.
వాళ్లని ఈ ప్రశ్న అడగడం లేదు..
‘‘సెకండ్ జెనరేషన్ యాక్టర్స్‌లో ఎవరైనా వచ్చారనుకోండి.. వాళ్ల ఫస్ట్ సినిమాలుగా.. ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి మీరు ఎవ్వరూ ఇలాంటి ప్రశ్న అడగడం లేదు. నాలాంటి వాళ్లు చిన్నప్పటి నుండి ఇక్కడ ఉండి.. ఇన్ని సినిమాలు చేసి, ఓ బేబిలో క్యారెక్టర్ చేసి, ప్రశాంత్ వర్మతో సినిమా చేసి, బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకొని, ఏదో నిలబెట్టుకొని.. ఇక్కడ బ్రతకాలి అని కష్టపడి సినిమాలు చేస్తుంటే ఏదో చిన్నచూపు చూసినట్టు అనిపిస్తోంది సరిపోతారా అని అడుగుతుంటే. నా ఉద్దేశ్యం ఏంటంటే.. నేను ఎవ్వరితో పోల్చుకోవడం లేదు. వాళ్లు, నేను ఒకటే అని కూడా నేను అనను. వాళ్లందరకి ఆ అవకాశం వచ్చింది. అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది. సినిమా నాకేం ఇచ్చింది అందరికీ కనిపిస్తుంది. కానీ సినిమాకు నేనేం ఇచ్చాను అన్నది నాకు, డైరెక్టర్‌కు తెలుసు. నేను 100 శాతం ఎఫర్ట్ పెట్టినందుకే నాకు ఈ అవాకశం వచ్చిందేమో. నేను హీరోగా ఉండడం వల్లే మీరు సర్‌ప్రైజ్ అయ్యారేమో. ఇది దేవుడు నాకు ఇచ్చాడు. నా దగ్గర నుండి ఎవరూ లాక్కోలేరు’’ అంటూ తన మనసులోని మాటలన్నీ బయటపెట్టేశాడు తేజ.
ఎవ్వరితో పోటీ కాదు..
సంక్రాంతి రేసులో ఎన్నో కమర్షియల్ సినిమాల మధ్య, ‘గుంటూరు కారం’ లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి పోటీగా ‘హనుమాన్’ విడుదల చేస్తున్నందుకు కూడా మూవీ టీమ్‌పై విమర్శలు మొదలయ్యాయి. దానిపై కూడా తేజ సజ్జా స్పందించాడు. ‘‘సంక్రాంతికి అలాంటి సినిమాలే రావాలి. ఇలాంటి సినిమాలు రాకూడదు అని ఎవరు చెప్పారు. కొత్తవాళ్లు పైకి రావాలి, డిఫరెంట్ సినిమాలు చేయాలి అని చెప్తూ ఉంటారు. అలాంటి సినిమా చేస్తేనేమో మీరు ఇలా అడుగుతున్నారు. ఇంతవరకు నడిపించిన హనుమంతుడు ఇకపై కూడా నడిపిస్తాడు. నిజాయితీగా సినిమా చేశాం. అన్నీ సక్రమంగా జరిగిపోతాయి’’ అని ‘హనుమాన్’పై నమ్మకాన్ని బయటపెట్టాడు. ‘గుంటూరు కారం’తో పోటీపై స్పందిస్తూ.. ‘‘ఏ సినిమాకు మేము పోటీ కాదు. ఎప్పుడూ అలా అనుకోలేదు’’ అని చెప్పాడు తేజ.
Also Read: హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం, ‘హనుమాన్’ ట్రైలర్‌తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్!