Prabhas: ఊర మాస్ డైరెక్టర్‌తో ప్రభాస్ సినిమా
పాన్ ఇండియా హీరో ప్రభాస్ 'దసరా' మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు కమిట్ అయిన సినిమా షూటింగ్స్ పూర్తిచేస్తూనే మరోవైపు ఇతర దర్శకులతో సినిమాలను లైన్ లో పెడుతున్నాడు డార్లింగ్. త్వరలోనే 'సలార్' తో థియేటర్స్ లో సందడి చేయనున్న ప్రభాస్ ఆ తర్వాత 'కల్కి 2898AD', 'స్పిరిట్', మారుతి సినిమాలను లైన్లో పెట్టగా రీసెంట్ గా సీతారామ్ డైరెక్టర్ హను రాఘవపూడి తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో టాలెంటెడ్ డైరెక్టర్ కి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..
'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ తో సినిమా చేయాలని ఎంతో మంది డైరెక్టర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్ తో సినిమా అంటే కచ్చితంగా కథలో కంటెంట్ తో పాటు ఆ కంటెంట్ ని సరిగ్గా డీల్ చేసే టాలెంట్ ఉండే డైరెక్టర్ అయి ఉండాలి. దానికి తోడు భారీ నిర్మాత కూడా ఉండాల్సిందే. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి లేనన్ని కమిట్మెంట్స్ ప్రభాస్ కు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే కమిట్ అయిన మూవీస్ ని పూర్తి చేసే పనిలో ఉన్న డార్లింగ్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఆ ప్రాజెక్ట్ మరెవరితోనో కాదు గత ఏడాది 'దసరా' సినిమాతో పాన్ ఇండియా డెబ్యూ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో అని సమాచారం. నాచురల్ స్టార్ నాని లో మాస్ యాంగిల్ ని బయట పెడుతూ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన 'దసరా' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల 'దసరా' మూవీతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే తన ప్రతిభను కనబరిచాడు. నానిని ఎప్పుడూ చూడని విధంగా ఊర మాస్ లెవెల్లో చూపించి ప్రశంసలు అందుకున్నాడు. 'దసరా' వచ్చి ఏడాదికి పైగా దాటినా ఇప్పటివరకు తన తదుపరిచిత్రాన్ని ప్రకటించలేదు శ్రీకాంత్ ఓదెల. అయితే గత కొద్ది నెలలుగా ప్రభాస్ కోసం శ్రీకాంత్ ఓ కథను సిద్ధం చేస్తున్నారట.
పాన్ ఇండియా లెవెల్ లో సూట్ అయ్యే ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టోరీని కంప్లీట్ చేసి ప్రభాస్ ని అప్రోచ్ అవ్వబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది. ప్రభాస్ కి కనుక కథ నచ్చితే ఆలస్యం చేయకుండా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు కచ్చితంగా ప్రభాస్ కి ఈ కథ నచ్చుతుందని నమ్మకంతో ఈ డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే ప్రభాస్ నుండి మరో ఊర మాస్ సినిమా ఖాయం అని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ తాజాగా నటిస్తున్న 'సలార్' విడుదలకు ముస్తాబవుతోంది. 'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Also Read : దీపావళికి కాజల్ ఖాకీ అవతార్ - 'సత్యభామ' టీజర్ రెడీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial