అన్వేషించండి

Ayalaan Trailer: మనిషిలా మారిపోతానని బెదిరిస్తోన్న ఏలియన్ - ‘అయలాన్‌’ ట్రైలర్‌ అదుర్స్, మరి సంక్రాంతి వస్తుందా?

Ayalaan Trailer: శివ కార్తికేయన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘అయలాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

Ayalaan Trailer: వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో శివ కార్తికేయన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్‌’. ఆర్. రవి కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటించింది. చాలా ఏళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే బయటకు ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా, తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 

ట్రైలర్ లోకి వెళ్తే, 'ఈ భూమి అన్ని జీవరాశులకు సొంతమని నాన్న చెప్పిన మాటను నేను ఎప్పటికీ నమ్ముతాను అమ్మా' అనే డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. 2 నిమిషాల 19 సెకన్ల ఈ ట్రైలర్ తోనే కథేంటో చెప్పే ప్రయత్నం చేసారు. ఓ మారుమూల గ్రామంలో సంతోషంగా జీవనం సాగించే ఒక యువకుడి (శివ కార్తికేయన్) లైఫ్ లోకి ఓ ఏలియన్ అడుగుపెడుతుంది. అచ్చం మనిషిలా మాట్లాడే ఆ గ్రహాంతరవాసిని చూసి అతను ముందుగా భయపడినప్పటికీ, ఆ తర్వాత ఫ్రెండ్ షిప్ చేస్తాడు. తన ప్రయోగాలతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే ఓ దుర్మార్గుడి ఆట కట్టించడానికే గ్రహాంతరవాసి భూమి మీదకొచ్చిందని ఆ యువకుడు తెలుసుకుంటాడు. వీరిద్దరూ కలిసి భూ గ్రహాన్ని కాపాడటానికి ఏం చేసారు? తన లక్ష్యం కోసం ఆ ఏలియన్ సామాన్యుడైన శివ కార్తికేయన్ నే ఎందుకు ఎంచుకుంది? చివరికి ప్రపంచ వినాశనాన్ని అడ్డుకున్నారా లేదా? అనేదే 'అయలాన్' స్టోరీ అని తెలుస్తోంది. 

గ్రహాంతర వాసి నేపథ్యంతో గ్రహాలు, గ్రహాంతరవాసులు, భూమిని కాపాడే సూపర్ హీరో లాంటి ఎలిమెంట్స్ తో భారీ విజువల్స్‌తో 'అయలాన్' సినిమా తెరకెక్కింది. నిజానికి హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఇలాంటి చిత్రాలు కొత్తేమీ కాదు. ట్రైలర్ చూడగానే అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా' సినిమా గుర్తుకు రాకమానదు. అయినప్పటికీ ఇక్కడ సైన్స్ ఫిక్షన్ స్టోరీకి నేటివిటీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటోంది. సినిమాలో ఇంకా ఏదో ఉంది అనే భావన కలిగిస్తోంది. ఇందులో శివకార్తికేయన్‌ నటన, కామెడీ, డైలాగ్స్‌ సినీ ప్రియులను అలరిస్తాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో కొన్ని సినిమాల్లో నాసిరకం వీఎఫ్ఎక్స్ చూసిన ఆడియన్స్ కు ఇది మంచి అనుభూతినిస్తుంది. దీని కోసమే మేకర్స్ ఇన్నేళ్ల సమయం తీసుకున్నారేమో అనిపిస్తుంది. 

'అయలాన్' సినిమాలో శివకార్తికేయన్‌ తల్లిగా భాను ప్రియ నటించింది. శరద్ కేల్కర్ విలన్ గా నటించగా, ఇషా కొప్పికర్ కీలక పాత్రలో కనిపించింది. చాలా రోజుల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ స్క్రీన్ మీద మెరిసింది. యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేసారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేసారు. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాత కేజేఆర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. 

ఇకపోతే తెలుగులో 'అయలాన్' సినిమాని విడుదల చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి 'గుంటూరు కారం', 'హను-మాన్', 'సైన్ధవ్', 'నా సామిరంగా' వంటి నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికే సరిపడా థియేటర్లు సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడుతుంటే, మధ్యలో తమిళ డబ్బింగ్ సినిమాలు పోటీకి వస్తుండటం చర్చనీయంశంగా మారింది. మరి అనుకున్నట్లే జనవరి 12న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తారా? లేక తెలుగులో ఓ వారం వాయిదా వేసుకుంటారా అనేది వేచి చూడాలి. 

Also Read: ‘మీర్జాపూర్ 3' to 'ఫ్యామిలీ మ్యాన్ 3' - 2024లో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే!

టాప్ హెడ్ లైన్స్

Hide & Silk: రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
The Dirty Picture 2: విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget