అన్వేషించండి

Web Series in 2024: ‘మీర్జాపూర్ 3' to 'ఫ్యామిలీ మ్యాన్ 3' - 2024లో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే!

OTT: 2024లో 'ఫ్యామిలీ మ్యాన్' 'మీర్జాపూర్' 'కోటా ఫ్యాక్టరీ' ' 'పంచాయత్' వంటి మరికొన్ని పాపులర్ వెబ్ సిరీసులకు సీక్వెల్స్ రాబోతున్నాయి.

OTT: డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలైన తర్వాత, ఇండియాలోనూ ఓటీటీ కంటెంట్ కు విశేష ఆదరణ లభిస్తోంది. అందుకే మన ఫిలిం మేకర్స్ అంతా బిగ్ స్క్రీన్ మీద చెప్పలేని కథలను వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీల రూపంలో ఓటీటీ వేదికల మీదకు తీసుకొస్తున్నారు. 2023లో ఎన్నో క్రైమ్ డ్రామాలు, రొమాంటిక్ కామెడీ షోలు ఆడియన్స్ ను అలరించాయి. అయితే 2024లో పలు క్రేజీ సీక్వెల్స్ రాబోతున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ పాపులర్ వెబ్ సిరీసులు, అవి స్ట్రీమింగ్ చేయబడే ఫ్లాట్ ఫార్మ్స్ ఏంటో తెలుసుకుందాం!

మీర్జాపూర్ 3:
తెలుగు ప్రేక్షకులకు అసలైన మజాని పరిచయం చేసిన వెబ్ సిరీస్ అంటే 'మీర్జాపూర్' అని చెప్పాలి. అశ్లీల కంటెంట్ డోస్ కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ, ఈ క్రైమ్ డ్రామాకి అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేన్దు శర్మ, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు. గుడ్డు పండిట్, అఖండానంద త్రిపాఠి అకా ఖాలీన్ భయ్యా, మున్నా పాత్రలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే అంతా ఇప్పుడు సీజన్ 3 కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. రాబోయే సీజన్ గ్రిప్పింగ్ స్టోరీ, ఇంటెన్స్ యాక్షన్, ఊహించని ట్విస్ట్ లతో మరింత క్రూరంగా ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న 'మీర్జాపూర్ 3'.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 3:
బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ "ది ఫ్యామిలీ మ్యాన్". తెలుగు దర్శక ద్వయం రాజ్ & డీకే ఈ షోని క్రియేట్ చేసారు. సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. త్వరలో మూడో సీజన్ తో రాబోతోంది. శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ తిరిగి రాబోతున్నాడు. ఈ సీజన్ యాక్షన్, సస్పెన్స్ తో పాటుగా ట్రేడ్‌ మార్క్ హ్యూమర్ సమ్మేళనంగా ఉండబోతోంది. గత రెండు సీజన్స్ ను పాకిస్థాన్, శ్రీలంకలలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందించగా.. 'ఫ్యామిలీ మ్యాన్ 3' లో చైనాతో పొంచివున్న ప్రమాదం నేపధ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సీజన్ లో టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటించగా.. సీజన్ 2లో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కీలక పాత్ర పోషించింది. రాబోయే సీజన్ లో ఏ సౌత్ స్టార్ ని భాగం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Also Read: బాక్సాఫీస్ వద్ద కాటేరమ్మ కొడుకు ప్రభంజనం - రూ.650 కోట్ల దిశగా దూసుకుపోతున్న 'సలార్'

కోటా ఫ్యాక్టరీ 3:
ఓటీటీ ప్రియులను విశేషంగా అలరించిన వెబ్ సిరీస్ లలో 'కోటా ఫ్యాక్టరీ' ఒకటి. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 2024లో జితేంద్ర కుమార్ మూడో సీజన్ తో తిరిగి వస్తుండటంతో 'జీతు భయ్యా' ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లోని కోటా నగరంలో ఈ సిరీస్ సెట్ చేయబడింది. IIT ప్రవేశానికి సిద్ధమయ్యే విద్యార్థుల జీవితాలను, పోటీ విద్యా వాతావరణంలో విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను 'కోటా ఫ్యాక్టరీ 3' లో మరింత లోతుగా చూపించనున్నారు.

పంచాయత్ 3:
జితేంద్ర కుమార్ నటించిన మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ 'పంచాయత్'. అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకొచ్చిన ఈ రూరల్ కామెడీ డ్రామా గత రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు 'పంచాయత్ 3' ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రెండు సీజన్లకు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని, రాబోయే సీజన్ స్క్రిప్టు విషయంలో మేకర్స్ ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. త్వరలో మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ఫర్జీ 2:
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఓటీటీ డెబ్యూ సిరీస్ 'ఫర్జీ'. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ & డీకే ఈ క్రైమ్ డ్రామా సిరీస్ ని రూపొందించారు. ఇందులో విజయ్ సేతుపతి - రాశీ ఖన్నా - రెజీనా కసాండ్రా, కె కె మేనన్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ షో ప్రేక్షకులని ఆకట్టుకుంది. దొంగ నోట్లు ముద్రించే స్కెచ్ ఆర్టిస్టు సన్నీగా షాహిద్, దొంగనోట్ల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేసే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్  మైఖేల్ గా విజయ్ సేతుపతి అలరించారు. ఇప్పుడు వీరు 'ఫర్జీ 2' తో తిరిగి రానున్నారు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడికానున్నాయి.

మిస్ మ్యాచ్డ్ 3 & అఫహరన్ 3:
సంధ్యా మీనన్ నవల ఆధారంగా రూపొందిన సిరీస్ 'మిస్ మ్యాచ్డ్'. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ డ్రామా త్వరలోనే సీజన్ 3తో రాబోతుంది. అలానే వూట్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న 'అఫహరన్' సిరీస్ కూడా మూడో సీజన్ తో రానుంది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సిరీస్ లో అరుణోదయ్ సింగ్, మహి గిల్ మరియు నిధి సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: వాళ్లను భయపెడుతోన్న ‘పుష్ప 2’ - 'సలార్'ను మించి డిమాండ్?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Embed widget