Salaar Box Office collections: బాక్సాఫీస్ వద్ద కాటేరమ్మ కొడుకు ప్రభంజనం - రూ.650 కోట్ల దిశగా దూసుకుపోతున్న 'సలార్'
Salaar collections Day 11: డార్లింగ్ ప్రభాస్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. ఇటీవలే విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ 10 రోజుల్లోనే రూ. 600 కోట్ల క్లబ్ లో చేరింది.
Salaar Box Office collections: 'సలార్' సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియాకి చూపిస్తున్నాడు. కాటేరమ్మ కొడుకు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. 'ఎ' సెంటర్స్ నుంచి 'సి' సెంటర్స్ వరకు, హిందీ మార్కెట్స్ నుంచి ఓవర్సీస్ వరకు ప్రభంజనం సృష్టిస్తున్నాడు. డార్లింగ్ మాస్ అవతారాన్ని చూపించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ, రూ. 650 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. 'బాహుబలి' 'బాహుబలి 2' తర్వాత 600 కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
10 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్ లో చేరిన సలారోడు
ప్రభాస్ హీరోగా KGF ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్'. డిసెంబర్ 22న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన 'డుంకీ' సినిమాతో క్లాష్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఫస్ట్ డే రూ. 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ పాన్ ఇండియా చిత్రం.. 6 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత కూడా తన హవా కొనసాగిస్తూ 10 రోజుల్లోనే ప్రతిష్టాత్మక 600 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 625 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
𝑲𝒉𝒂𝒏𝒔𝒂𝒂𝒓… 𝑰’𝒎 𝑺𝒐𝒓𝒓𝒚!
— Salaar (@SalaarTheSaga) January 1, 2024
Unstoppable #SalaarCeaseFire has crossed a massive ₹ 𝟔𝟐𝟓 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 💥#SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/JFgqX99Ojv
'సలార్' 11వ రోజు కలెక్షన్స్
'సలార్' సినిమా న్యూ ఇయర్ లోనూ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. జనవరి 1న ఈ యాక్షన్ డ్రామా ఇండియాలో రూ. 15.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా 11 రోజుల్లో డొమెస్టిక్ బాక్సాఫీస్ వద్ద రూ. 360.77 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. జనవరి 1న ప్రభాస్ సినిమా 48.75 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ రోజుతో హాలిడేస్ ముగియడంతో జనవరి 2న భారీ డ్రాప్‌ను చూసే అవకాశం ఉంది. కాకపోతే సంక్రాంతి పండుగ వరకూ బాక్సాఫీస్ వద్ద పోటీగా మరే సినిమా లేదు కాబట్టి, రాబోయే రోజుల్లోనూ ఓ మోస్తరు వసూళ్లు నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' సినిమాలో ప్రభాస్ తో పాటుగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, మైమ్ గోపి, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, టిన్ను ఆనంద్, KGF గరుడ రామ్, ఈశ్వరీ రావు, సప్తగిరి, దేవరాజ్, బ్రహ్మాజీ, ఝాన్సీ, జాన్ విజయన్, రమణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ వర్క్ చేశారు. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. రెండవ భాగం 'సలార్: పార్ట్ 2 - శౌర్యంగ పర్వం' అనే పేరుతో రానుంది. సీక్వెల్ షూటింగ్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: టాలీవుడ్@2024 - ఈ ఏడాది రిలీజయ్యే క్రేజీ చిత్రాలివే!