అన్వేషించండి

Chiranjeevi's Vishwambhara: 'విశ్వంభర'లో సిస్టర్ సెంటిమెంట్.. చిరుకి ఐదుగురు చెల్లెళ్లు? హిట్లర్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా?

Chiranjeevi's Vishwambhara: చిరంజీవి - వశిష్ట కాంబినేషన్ లో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Chiranjeevi's Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'విశ్వంభర'. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ కాన్సెప్ట్ వీడియో విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉంటుందని, ఇందులో చిరుకి ఐదుగురు చెల్లెల్లు ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

'విశ్వంభర' అనేది పంచభూతాల కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. టైటిల్ పోస్టర్ తో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇందులో అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ కూడా మిళితమై ఉంటుందట. ఈ సినిమాలో పూలరంగడు ఫేమ్ ఈషా చావ్లా, ఎక్స్ ప్రెస్ రాజా ఫేమ్ సురభి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ హీరోయిన్లను తీసుకుందని చిరంజీవి చెల్లెళ్ళ పాత్రల కోసమే అని అంటున్నారు. వీరితో పాటుగా మరో ముగ్గురు కథానాయికలు కూడా సిస్టర్ రోల్స్ కనిపిస్తారని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. 

గతంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'హిట్లర్' సినిమాలో ఐదుగురు చెల్లెల్లు ఉంటారనే సంగతి తెలిసిందే. 1997లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు 'విశ్వంభ‌ర‌' మూవీలో మెగాస్టార్ కు 5గురు సిస్టర్స్ ఉంటారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్ర పోషించనుందని సమాచారం. అలానే మాంత్రికుడి రోల్ లో రావు రమేశ్ కనిపిస్తారని టాక్ వచ్చింది. 

'భోళా శంకర్' డిజాస్టర్ తర్వాత రాబోతున్న 'విశ్వంభ‌ర‌' సినిమాతో చిరంజీవి సాలిడ్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 'బింబిసార' తర్వాత వసిష్ఠ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. చిరు సెట్స్ లో అడుగుపెట్టకముందే ఈ మూవీ ఓవర్ సీస్ హక్కులు భారీ రేటుకి అమ్ముడయ్యాయి. సరిగమ సంస్థ దాదాపు 18 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

'విశ్వంభ‌ర‌' సోషియో ఫాంటసీ కథ కాబట్టి సినిమాలో వీఎఫ్ఎక్స్ స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే భారీగా ఖర్చు చేసి హైదరాబాద్ లో పెద్ద పెద్ద సెట్లు నిర్మించారు. నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతున్నట్లుగా టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ కృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. 

సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న 'విశ్వంభ‌ర‌' సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే షూటింగ్ జరుపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్లు రాబోతున్నాయి.

Also Read: ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాలు, ఈసారి విజయ దశమికి దబిడి దిబిడే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget