Sharwanand New Movie Update: శర్వానంద్ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు ప్రియమణి కూడా - అసలు కథ ఏంటంటే?
శర్వానంద్ సరసన రాశీ ఖన్నా నటించడం పక్కా. అయితే, ఆ సినిమాలో ప్రియమణి కూడా ఉన్నారు. అసలు, ఈ సినిమా కథ ఏంటో తెలుసా?
శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా గేయ రచయిత నుండి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా రాశీ ఖన్నా (Raashi Khanna) నటించనున్నారు.
తొలుత కీర్తీ సురేష్‌ను అనుకున్నప్పటికీ... చివరకు రాశీ దగ్గరకు వచ్చారు. ఇటీవల ఆమెకు దర్శకుడు కథ వివరించారు. విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేశారని తెలిసింది. ఇప్పటి వరకూ చేయనటువంటి పాత్ర కావడంతో మరో ఆలోచన లేకుండా అంగీకరించారని, సినిమాలో ఆమె లుక్ నుంచి నటన వరకూ ప్రతిదీ కొత్తగా ఉంటుందని తెలిసింది.
శర్వానంద్ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు ప్రియమణి (Priyamani) కూడా నటించనున్నారు. అయితే, ఆమెది హీరోయిన్ రోల్ కాదు. కీలక పాత్ర. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు కనిపిస్తారట. గోదావరి యాసలో మాట్లాడతారని సమాచారం.
ఇక, ఈ సినిమా కథకు వస్తే... రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న వినోదాత్మక చిత్రమిది. గోదావరి నేపథ్యంలో కథ సాగుతుంది. ఓ సాధారణ యువకుడు కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడనేది కాన్సెప్ట్. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్, రాజమండ్రి, కారైకుడి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు.
Also Read: 'హైపర్' ఆదిని అరెస్ట్ చేసిన పోలీసులు
'ఒకే ఒక జీవితం' షూటింగ్ కంప్లీట్ చేసిన శర్వానంద్, ప్రస్తుతం తన కాన్సంట్రేషన్ అంతా కృష్ణ చైతన్య సినిమాపై పెట్టారని సమాచారం. ఈ సినిమా కోసం ఆయన వెయిట్ తగ్గుతున్నారని టాక్. కొత్త లుక్‌లో కనిపిస్తారట.
View this post on Instagram