By: ABP Desam | Updated at : 07 Jun 2022 09:08 AM (IST)
'హైపర్' ఆదిని అరెస్ట్ చేసిన పోలీసులు (Image courtesy - @Mallemalatvl/Youtube)
'హైపర్' ఆది గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగు టీవీ ఛానల్స్, టీవీల్లో కామెడీ రియాలిటీ షోలు, ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకు అతడు సుపరిచితుడు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అతడు చేసిన నేరం నేరం ఏంటో చెప్పారు. కానీ, ఎప్పుడు చేశాడు? ఎవరు కంప్లైంట్ చేశారు? అనే వివరాలు చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచారు.
అవును... 'హైపర్' ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్‌లోకి ప్రవేశించిన పోలీసులు... 'ఆది ఎవరు? ఆది ఎక్కడ?' అంటూ హంగామా చేశారు. 'కెమెరాలతో షూటింగ్ చేయడం ఆపండి' అంటూ ఆర్డర్స్ ఇచ్చారు. షూటింగుకు వచ్చే ముందు కారుతో ఆది యాక్సిడెంట్ చేయడం వల్ల ఒకరు చావు బతుకుల మధ్యలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. దాంతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' సెట్స్‌లో అందరూ షాక్ అయ్యారు.
ఆదిని వెళ్లి పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పారు. పోలీసులతో వెళ్ళడానికి ఆది రెడీ అయ్యారు. పోలీసులకు 'ఆటో' రామ్ ప్రసాద్, మిగతా వాళ్ళు మాట్లాడానికి ట్రై చేస్తుంటే... 'అతను వస్తానంటే మధ్యలో మీరు ఎవరు?' అంటూ ఫైర్ అయ్యారు. అక్కడితో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమోకి ఎండ్ కార్డు వేశారు.
'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఈ మధ్య టీఆర్పీ స్కిట్స్ అని కొత్తగా ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేశారు. లాస్ట్ సండే ఎపిసోడ్ చూస్తే... రష్మీ గౌతమ్ స్పృహ తప్పి పడిపోయినట్టు నటించడం, ఇమ్మాన్యుయేల్ తన మీద చెయ్యి వేశాడని పూర్ణ ఫైర్ అవ్వడం వంటివి టీఆర్పీ స్కిట్ అన్నమాట. ఈ అరెస్ట్ కూడా టీఆర్పీ స్కిట్ అనేది కొంత మంది చెప్పే మాట.
Also Read: విజయ్ దేవరకొండ 'ఖుషి' తర్వాత మరో తెలుగు సినిమా అంగీకరించిన మలయాళ 'హృదయం' సంగీత దర్శకుడు
Gufi Paintal Death: శకుని మామా ఇకలేరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్తమించిన గుఫీ పెయింటల్!
Gruhalakshmi June 5th: దివ్యని ఇంటి పనిమనిషిని చేస్తానన్న రాజ్యలక్ష్మి- కూతురికి వార్నింగ్ ఇచ్చిన తులసి
Krishna Mukunda Murari June 5th: తనకి అర్జెంట్ గా మనవడిని కనివ్వాలని కోడలికి కండిషన్ పెట్టిన రేవతి- బిత్తరపోయిన ముకుంద
Guppedanta Manasu June 5th: మూడేళ్ళ తర్వాత రిషి రీ ఎంట్రీ- ఎన్ని చెప్పినా జగతిని క్షమించలేనన్న మహేంద్ర
Brahmamudi June 5th: రుద్రాణి మీద చీటింగ్ కేసు పెడతానన్న రాజ్- భర్తని ప్రేమలో పడేసేందుకు కావ్య ప్రయత్నాలు
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!
MacBook Air: ఇంటెల్ ల్యాప్‌టాప్‌ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్‌బుక్ లాంచ్ చేసిన యాపిల్!