అన్వేషించండి

రవిబాబు నన్ను నమ్మి ఆఫర్ ఇచ్చాడు, అక్కడే చెంప చెళ్లుమనిపించి వచ్చేశా - సీనియర్ నటి రక్ష

Senior Actress Raksha : సీనియర్ నటి రక్ష తాజా ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Senior Actress Raksha Interview : సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది సీనియర్ నటి రక్ష. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి 'నచ్చావులే', 'మేం వయసుకు వచ్చాం', 'నిప్పు', 'నాగవల్లి', 'బ్రదర్ అఫ్ బొమ్మాలి', 'దువ్వాడ జగన్నాథం' వంటి సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో వెండితెరపై అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్ష తన సినీ కెరియర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

నన్ను నమ్మి రవిబాబు ఆఫర్ ఇచ్చారు

అప్పట్లో నేను ఐటెం సాంగ్స్ చేసినప్పుడు నటిగా అవకాశాలు రావట్లేదని బాధపడలేదు. కానీ ఇప్పుడు ఫీలవుతున్నాను. అప్పుడు అలా చేయడం వల్ల ఇప్పుడు నాకు మదర్ క్యారెక్టర్స్ రావడం లేదు. నన్ను నమ్మి రవి బాబు గారు ‘నచ్చావులే’ మూవీలో మంచి రోల్ ఆఫర్ చేశారు. నిజానికి ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరూ ఆఫర్ ఇవ్వరు. కానీ ఆయన చాలా పెద్ద సాహసం చేశారు. నేను హీరోయిన్ గా చేస్తున్న టైంలోనే మదర్ క్యారెక్టర్ అనేసరికి కాస్త ఆలోచించాను. కానీ రవి బాబు గారు మీరు చేస్తే బాగుంటుందని నన్ను నమ్మి ఎంకరేజ్ చేయడంతో సరే, నాకు కూడా పెళ్ళై, పిల్లలు ఉన్నారు కదా! అని మదర్ రోల్ చేశాను. అలా ఫస్ట్ టైం మదర్ క్యారెక్టర్ చేశాను ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ కి నాకు నంది అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మదర్ క్యారెక్టర్స్ చేశాను. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు" అని తెలిపింది.

ఆ డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించి నీ సినిమా వద్దు, ఏమీ వద్దని చెప్పి వచ్చేసాను

రీసెంట్ టైమ్‌లో ఓ తమిళ డైరెక్టర్ నాకు ఒక రోల్ ఆఫర్ చేశాడు. నాకు పెళ్లయి ఓ పాప కూడా ఉంది. గతంలోలాగా స్లీవ్ లెస్ బ్లౌజులు వేసుకొని బోల్ట్ గా నటించాలంటే నావల్ల కాదు. మంచి పాత్ర అయితే చేస్తానని చెప్పాను. దానికి అతను అలాంటివి ఏం లేదు మంచి పాత్ర అని చెప్పాడు. తర్వాత సెట్ కి వెళ్ళాక బోల్డ్ గా నటించాలని అన్నాడు. అదేంటి, నేను చేయను అని ముందే చెప్పాను కదా? అని అడిగితే చేయమని ఇబ్బంది పెట్టడంతో అతని చెంప చెల్లుమనిపించి ఏంట్రా? ఏమనుకుంటున్నావ్? అసలు.. నీ సినిమా వద్దు ఏమీ వద్దని చెప్పి అక్కడ నుంచి వచ్చేసా" అని చెప్పింది.

'వినయ విధేయ రామ' లో ఆఫర్ వచ్చింది కానీ..? 

'వినయ విధేయ రామ' సినిమా కోసం బోయపాటి గారు నాకు ఒక రోల్ ఆఫర్ చేయాలని అనుకున్నారట. కానీ మధ్యలో ఉన్న కొంతమంది ఆమె బిజీగా ఉంది, చేయదు అని చెప్పడంతో ఆ ఆఫర్ నాదాక రాలేదు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. సో ఇండస్ట్రీలో కొన్ని ఇలా కూడా జరుగుతాయి. కొంతమంది మధ్యలో ఉన్నవాళ్లు వాళ్లకు నచ్చిన వాళ్ళకి క్యారెక్టర్స్ ఆఫర్స్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ల దాకా రానివ్వడం లేదు" అని చెప్పుకొచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget