అన్వేషించండి

సిమ్రాన్ నా క్లాస్‌మేట్, వడ్డే నవీన్ అలా ఎందుకు చేశాడో అర్ధం కాలేదు: వేణు తొట్టెంపూడి

ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో వడ్డే నవీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి. 1999 లో వచ్చిన 'స్వయంవరం' అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన వేణు, ఆ తర్వాత 'చిరునవ్వుతో', 'పెళ్ళాం ఊరెళితే', 'చెప్పవే చిరుగాలి', 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాంతో పనేంటి', ఖుషి ఖుషీగా వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఆ తర్వాత కొంత కాలానికి సినిమాలు చేయడం మానేశాడు.

దానికి కారణాలేంటో తెలియకపోయినా మళ్ళీ అప్పుడెప్పుడో ఎన్టీఆర్ 'దమ్ము' సినిమాలో కీలక పాత్ర పోషించి మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఆ సినిమా ప్లాప్ అయినా వేణు క్యారెక్టర్ కి మంచి మార్పులే పడ్డాయి. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన తోటి హీరో వడ్డే నవీన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మీ సినీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అని అడిగిన ప్రశ్నకు వేణు బదులిస్తూ. "నేను, వడ్డే నవీన్, సిమ్రాన్, సింగర్ సునీత భర్త మ్యాంగో రామ్ ముంబైలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో క్లాస్ మేట్స్. మ్యాంగో రామ్ మాత్రం మొదట్లో మాతో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకు తను సూట్ అవ్వనని తెలుసుకొని వేరే ప్రొఫెషన్ ఎంచుకున్నాడు. ఆ ప్రొఫెషన్ లో ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆ విషయంలో రామ్ ని మెచ్చుకోవాలి. ఇక ఇన్సిట్యూట్ లో నేను అందరితో చాలా కలివిడిగా, సరదాగా ఉండేవాడిని. కానీ వడ్డే నవీన్ మాత్రం అలా కాదు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. నేను తెలుగు వాడినైనా నాతో ఎందుకు మాట్లాడట్లేదు? అని నేను అనుకునేవాడిని. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కానీ తెలుగు వాడ్ని అయ్యుండి నాతోని ఎందుకు మాట్లాడట్లేదు అనే సందేహం మాత్రం నాకు వచ్చింది. మనం మాట్లాడితే మాట్లాడుతాడు, కానీ తనే వచ్చి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. నాకంటే వడ్డే నవీన్ రెండు నెలలు సీనియర్. నాకన్నా ముందే ముంబై ఇన్సిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. అలా వడ్డే నవీన్ నాకు పరిచయం" అంటూ తెలిపారు.

ఆ తర్వాత సిమ్రాన్ గురించి మాట్లాడుతూ.. "సిమ్రాన్ అసలు పేరు రిషిబాల. ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. చాలా మంచి అమ్మాయి. మేము ముగ్గురం ముంబై ఇన్సిట్యూట్ లో ఫ్రెండ్స్ అయ్యాం. ట్రైనింగ్ అయిపోయాక ఓ నాలుగు నెలలు నేను అక్కడే ఉన్నాను. ముంబై సిటీ చూడాలి, ముంబైలో ఉండాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అలా నాలుగు నెలలు ఉన్న తర్వాత చెన్నైకి వెళ్లడం సినిమా ప్రయత్నాలు చేయడం, ఆ తర్వాత అలా 'స్వయంవరం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగాయి" అంటూ  తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వేణు.

Also Read : వెంకటేష్ 'సైంధవ్' రిలీజ్‌కు రెడీ - ఆకట్టుకుంటున్న స్పెషల్ పోస్టర్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 8 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 8 మంది మృతి
Chandrababu with Bloomberg: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
Hydra Vs Danam : హైడ్రాపై మరోసారి దానం గరం గరం - సీఎం రాగానే సంగతి చూస్తానంటూ హెచ్చరికలు
హైడ్రాపై మరోసారి దానం గరం గరం - సీఎం రాగానే సంగతి చూస్తానంటూ హెచ్చరికలు
Tollywood IT Raids: టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 8 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 8 మంది మృతి
Chandrababu with Bloomberg: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
Hydra Vs Danam : హైడ్రాపై మరోసారి దానం గరం గరం - సీఎం రాగానే సంగతి చూస్తానంటూ హెచ్చరికలు
హైడ్రాపై మరోసారి దానం గరం గరం - సీఎం రాగానే సంగతి చూస్తానంటూ హెచ్చరికలు
Tollywood IT Raids: టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
Viral News: అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
Viral Video: కాస్త చూసుకోవాలి కదా బాసూ! - కారు పార్క్ చేస్తూ రివర్స్ గేర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ వాహనం, వైరల్ వీడియో
కాస్త చూసుకోవాలి కదా బాసూ! - కారు పార్క్ చేస్తూ రివర్స్ గేర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ వాహనం, వైరల్ వీడియో
New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!
కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!
Monalisa: మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
Embed widget