అన్వేషించండి

Saindhav: వెంకటేష్ 'సైంధవ్' రిలీజ్‌కు రెడీ - ఆకట్టుకుంటున్న స్పెషల్ పోస్టర్

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'సైంధవ్' చిత్రం నుంచి వినాయక చవితి సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రద్ధ శ్రీనాథ్, ఓ పాపతో వెంకటేష్ బీచ్ ఒడ్డున సరదాగా నవ్వుతూ కనిపించారు.

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నుంచి హై వోల్టేజ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో 'నారప్ప', 'దృశ్యం 2' వంటి రీమేక్ సినిమాలతోనే ప్రేక్షకులు ముందుకు వచ్చాడు వెంకీ. అయితే ఇప్పుడు తన కెరియర్లో 75వ మైల్ స్టోన్ మూవీని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్నాడు. 'హిట్', 'హిట్ 2' వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శైలేష్. ఇక ఇప్పుడు వెంకటేష్ తో 'సైంధవ్'(Saindhav) అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసాయి.

ఎంతోకాలంగా వెంకీ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలియడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆ 'సైంధవ్' నుంచి అదిరిపోయే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మరోసారి రిలీజ్ డేట్ ను సైతం కన్ఫర్మ్ చేశారు. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ ఓ చిన్న పాపతో కలిసి వెంకటేష్ బీచ్ ఒడ్డున కూర్చుని నవ్వుతున్న పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు పోస్టర్లో స్పష్టం చేశారు. పోస్టర్ ని బట్టి చూస్తే సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్ కి భార్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తో పాటు కొంత టాకీ పార్ట్ ను కూడా చిత్రీకరిస్తున్నారట. వెంకటేష్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలా సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో బ్లాక్ మ్యాజిక్ ని మరింత హైలెట్ చేయబోతున్నారట. ఇదే కాన్సెప్ట్ కు బలమైన డాటర్ సెంటిమెంట్ ను జోడించి శైలేష్ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 'హిట్' సిరీస్ తో థ్రిల్లర్ సినిమాలను తీయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న శైలేష్ ఈ సినిమాతో అసలు సిసలైన థ్రిల్లర్ అంటే ఏంటో చూపించబోతున్నాడట.

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాలో నవాజుద్దీన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళ హీరో ఆర్య సైతం మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళతోపాటు రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రీసెంట్ గా 'దసరా' మూవీతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్గా సత్తా చాటిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ,మలయాళ భాషలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Also Read : 'యానిమల్' ఊరమాస్ టీజర్ లోడింగ్ - ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Review - విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?
విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget