Krishnamma Trailer: ‘కథ నడకకైనా.. నది నడకకైనా మలుపులే అందం’ - ఆకట్టుకుంటున్న 'కృష్ణమ్మ' ట్రైలర్
Krishnamma Trailer: హీరో సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్, పోలీసు కేసు చూట్టు తిరిగిన ఈ ట్రైలర్ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది.
Satyadev Krishnamma Movie Trailer Out: హీరో సత్యదేవ్ (Satya Dev) గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. వైవిధ్యమైన కథలు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ అలరిస్తున్నారు. ఓ పక్క హీరోగా నటిస్తూనే వీలుచిక్కినప్పుడల్లా ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. హీరోగా, విలన్, సహానటుడి పాత్రలు ఇలా తనదైన విలక్షణ నటనతో దసుకుపోతున్నారు. చివరి సారిగా 'గుర్తుందా శీతాకాలం' మూవీతో నటించిన ఆయన కాస్తా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలు ఉండగా అందులో 'కృష్ణమ్మ' (Krishnamma Movie)చిత్రం ఒకటి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయ్యింది. మే 10న వరల్డ్ వైడ్ థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన ఈ ట్రైలర్ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. మొత్తం కోర్టు, కేసు చూట్టు తిరిగి ఈ ట్రైలర్ సత్యదేవ్‌ను ఖైదీగా చూపించారు. కోర్టు ముందుకు సత్యదేవ్‌ను తీసుకువస్తున్న సీన్‌తో ట్రైలర్ మొదలైంది.
ట్రైలర్ ఎలా ఉందంటే
ఈ క్రమంలో మూడు రోజులుగా ముద్దాయుల మొహలు కూడా చూపించని పోలీసులు డైరెక్టర్ ఈ రోజే నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నారు అనే బ్యాగ్రౌండ్ వాయిస్ వినిపించింది. ఆ తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్ చూపించారు. అక్కడ ముగ్గురు స్నేహితులు హ్యాపీ జీవితం సాగిస్తుండగా వారి జీవితంలో ఊహించని సంఘటలను ఎదురవుతాయి. ఈ క్రమంలో సత్యదేవ్ చెప్పిన ఓ డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్ అని చెప్పాలి. “కథ నడకకైనా.. నది నడకకైనా మలుపులే అందం. కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయ్” అనే డైలాగ్ ఆకట్టుకుంది.
The Riveting and Intense trailer of #Krishnamma out now 💥
— Saregama South (@saregamasouth) May 1, 2024
▶️https://t.co/dFZjTlU3Ex#Krishnamma GRAND RELEASE ON 𝐌𝐀𝐘 𝟏𝟎𝐭𝐡 by @mythrireleases & @Primeshowtweets 💥
⭐️ing @ActorSatyaDev #VVGopalakrishna @kaalabhairava7 #KoratalaSiva @ArunachalaCOffl pic.twitter.com/1r7L2wR02n
ఆ తర్వాత జైల్లో ఉన్న ఆ ముగ్గురిపై గుర్తు తెలియని వారు దాడు చేయడం, వారిని ఎవరో చంపేందుకు ప్రయత్నించని వంటి సీన్స్ చూపించారు. అసలు వారు ఏ కేసులో జైలు వచ్చారని, వారిని ఎవరు చంపాలని చూస్తున్నారనేది తెలియకపోవడమే ఇక్కడో ఓ ట్విస్ట్. ఈ క్రమంలో "ఇన్నాళ్లు ఎప్పుడు పుట్టాము, ఎవరికి పుట్టామో తెలియక పోవడమే బాధ అనుకున్నాం.. కానీచ, ఎందుకు చనిపోతున్నామో, ఎవడి చేతుల్లో చనిపోతున్నామో తెలియకపోవడమే అసలైన బాధ" అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్ ఆసక్తి పెంచుతుంది. ఇలా ట్రైలర్ మొత్తం ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. కాగా వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ నిర్మిస్తుండటం విశేషం.
Also Read: ఔను, అలా చేశా - లైఫ్‌లో అన్నీ ఎక్స్‌పీరియెన్స్ చెయ్యాలి: నాగ చైతన్య బోల్డ్ కామెంట్స్ వైరల్