అన్వేషించండి

మెగా ప్రిన్సెస్ క్లింకారాపై స్పెషల్ సాంగ్ - ఎంత బాగుందో, మీరు విన్నారా?

Klinkaara : రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లింకారా పై మెగా అభిమానులు ప్రత్యేక పాటని రిలీజ్ చేశారు.

Sankranthi Special A Mega Melody for Mega Princess KlinKaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఈ జంటకు ఆడపిల్ల జన్మించింది. గత ఎడాది జూన్ 20న ఉపాసన పాపకి జన్మనిచ్చింది. మెగా ఇంటికి మహాలక్ష్మి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకి 'క్లింకారా' అని నామకరణం చేశారు. మెగాస్టార్ కుటుంబానికి ఇష్టమైన మంగళవారం రోజున ఆడపిల్ల పుట్టడంతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెళ్లి విరిసాయి. 'క్లింకారా' అంటే లలిత సహస్రనామాల్లో బీజాక్షరం. ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అని అర్థం.

మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని ఈ పేరు సూచిస్తుంది. ఇక చరణ్, ఉపాసన దంపతులు కూతురితో ఈ సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి అల్లు ఫ్యామిలీ కూడా తోడైంది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ వస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా, అల్లు కుటుంబాలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫోటో ఫ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే చరణ్ - ఉపాసన గారాలపట్టి క్లింకారపై ఓ పాటను సిద్ధం చేశారు. మెగా అభిమానులు సంక్రాంతి కానుకగా ఈ పాటను ఉపాసన స్వయంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహావీర్ ఎల్లంధర్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ కు తగ్గట్టుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ అందించారు. సింగర్ ధనుంజయ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించాడు. కాగా ఈ సాంగ్లో క్లింకారా పుట్టినప్పుడు హాస్పిటల్ లోని క్షణాల నుంచి మొన్నటి బారసాల వరకు ప్రతి మూమెంట్ కవర్ చేసి చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

గతంలో సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ కూడా క్లింకారా కోసం ఓ ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు. ఇక ఇప్పుడు స్వయంగా మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ కూతురి కోసం మరో సాంగ్ చేయడం విశేషం. కాగా ఇప్పటివరకు క్లింకారా ముఖాన్ని చూపించకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్త పడుతోంది. నిన్న సంక్రాంతి సందర్భంగా దిగిన ఫోటోల్లోనూ ముఖం కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. మరి ఆమె ముఖాన్ని అభిమానులకు ఎప్పుడు పరిచయం చేస్తారో చూడాలి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : సమ్మర్‌కి షిఫ్ట్ అయిన విక్రమ్ 'తంగలాన్' - రిలీజ్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
PM Modi: నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?
మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Supreme Court | కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ | ABP DesamSandeep Reddy Vanga Kite Flying | సంక్రాంతి  సెలబ్రేషన్స్ గట్టిగా చేసిన సందీప్ రెడ్డి వంగా | ABP DesamMahakumbh 2025 Day 2 | హెలికాఫ్టర్లతో భక్తులపై పూలవర్షం | ABP DesamFlyover Iron Rods Theft | హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ పైనుంచి దూకేసిన వ్యక్తి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
PM Modi: నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?
మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?
Crime News: పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసు - మృతులను గుర్తించిన పోలీసులు, దారుణ హత్యలకు కారణం అదేనా?
పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసు - మృతులను గుర్తించిన పోలీసులు, దారుణ హత్యలకు కారణం అదేనా?
Car Parking: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? - కచ్చితంగా పార్కింగ్ స్థలం ఉండాల్సిందే!, మహారాష్ట్ర ప్రభుత్వం న్యూ రూల్
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? - కచ్చితంగా పార్కింగ్ స్థలం ఉండాల్సిందే!, మహారాష్ట్ర ప్రభుత్వం న్యూ రూల్
Kallakkadal Warning: 2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
Crime News: కాశీ యాత్రలో తీవ్ర విషాదం - మంటల్లో దగ్ధమైన బస్సు, నిర్మల్ వాసి సజీవదహనం
కాశీ యాత్రలో తీవ్ర విషాదం - మంటల్లో దగ్ధమైన బస్సు, నిర్మల్ వాసి సజీవదహనం
Embed widget