అన్వేషించండి

Sankranthiki Vasthunam Vs Game Changer: సంక్రాంతికి వస్తున్న వెంకీ మామ... 'గేమ్ చేంజర్'తో ఇష్యూ లేకుండా రిలీజ్ డేట్ ఫిక్స్

Sankranthiki Vasthunam Release Date: వెంకీ మామ సంక్రాంతికి రావడం కన్ఫర్మ్ అయ్యింది. అయితే... రామ్ చరణ్ సినిమాతో ఇష్యూ లేకుండా రిలీజ్ డేట్ విషయంలో గ్యాప్ మైంటైన్ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్న హీరోలలో విక్టరీ వెంకటేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటు నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా వస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... చరణ్, వెంకీ మామతో సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత ఒక్కరే - 'దిల్' రాజు. తన సినిమాకు తన సినిమానే పోటీ దింపుతున్నారా? అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే...‌‌ చరణ్ సినిమాతో ఎటువంటి ఇష్యూ లేకుండా గ్యాప్ మైంటైన్ చేస్తున్నారు వెంకీ మామ. 

సంక్రాంతి బరిలో వెంకీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా ఆయనకు 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు విడుదల గురించి కూడా ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer) తొలుత క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేస్తూ డిసెంబర్ 20న విడుదల చేయాలని ప్లాన్ చేసినా... చివరకు సంక్రాంతికి వాయిదా వేయడంతో వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అటువంటిది ఏమీ లేదని స్పష్టత ఇచ్చేశారు. ఆ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉందని చెప్పేశారు. అయితే... రామ్ చరణ్ (Ram Charan) సినిమాతో ఎటువంటి ఇష్యూ లేకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు వెంకీ మామ. 

జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను థియేటర్లలోకి తీసుకు రావడానికి డిసైడ్ అయ్యారు. అంటే... చరణ్ సినిమా వచ్చిన నాలుగు రోజులకు వెంకీ సినిమా వస్తుంది అన్నమాట. 'గేమ్ చేంజర్' జనవరి 10న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. సో... ఆ సినిమా ఓపెనింగ్స్ వరకు వెంకీ మామ సినిమా నుంచి ఎటువంటి కాంపిటీషన్ ఉండదు. మరి బాలకృష్ణ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

Also Read: కేతికా శర్మలో మరీ ఇంత అందమా... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ ఫొటోస్ చూశావా మామా


'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ భార్య పాత్రలో నటించగా... హీరో మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనుంది. గేమ్ చేంజెస్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించగా... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు తెలుగు అమ్మాయి అంజలి సందడి చేయనుంది. తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా థియేటర్లలోకి వస్తుండగా... పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ 'గేమ్ చేంజర్' బరిలో దిగుతుంది. ఆ సినిమా టీజర్ ఈ నెల 9వ తేదీన ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో విడుదల చేయనున్నారు. సో తెలుగు మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మాత్రమే 'గేమ్ చేంజర్' సినిమాకు ముఖ్యం కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు రావాల్సిన అవసరం ఉంది.

Also Read: రెండు పార్టులుగా సాయి పల్లవి - రణబీర్ రామాయణం... దీపావళికి థియేటర్లలో రావణాసుర వధ

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget