Salaar Latest Update : పది రోజుల్లో సలార్ ట్రైలర్ - అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్, బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
Salaar : సలార్ నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్ అయినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
![Salaar Latest Update : పది రోజుల్లో సలార్ ట్రైలర్ - అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్, బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్! salaar makers drops a new update Salaar Latest Update : పది రోజుల్లో సలార్ ట్రైలర్ - అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్, బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/0f4593b7f44fca133e4006d8bcc8662f1700578198034753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salaar Latest Update : సౌత్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'సలార్'(Salaar) మూవీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. మూవీ ట్రైలర్ కు సంబంధించి మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు వెల్లడించారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో రావలసిన ఈ మూవీ పలు అనివార్య కారణాలతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 కు షిఫ్ట్ అయింది.
ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ప్రశాంత్ నీల్ భార్య ట్రైలర్ కట్ పనులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. దాంతో సిని ఫ్యాన్స్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మేకర్స్ మరో ఆసక్తికర అప్డేట్ అందించారు.' సలార్ ర్యాంపేజ్ కి కేవలం నెల రోజులు మాత్రమే ఉందని తెలియజేసిన మూవీ టీం సలార్ ట్రైలర్ కోసం రెడీగా ఉండండి అని, డిసెంబర్ 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రాబోతుందని తెలిపారు.
Get ready for the explosive #SalaarCeaseFire Trailer releasing on Dec 1st @ 19:19 IST 💣#Salaar North America bookings open from today! 🎟️
— Salaar (@SalaarTheSaga) November 21, 2023
SALAAR RAMPAGE IN A MONTH#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/HcfFnymhSe
అంతేకాకుండా సలార్ నార్త్ అమెరికా బుకింగ్స్ ఈరోజు(నవంబర్ 21) నుంచి ఓపెన్ అయినట్లు పేర్కొన్నారు. ఫార్స్ ఫిల్మ్, ప్రత్యంగిరా సినిమాస్, మోక్ష మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సలార్ మూవీ ని ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ అప్డేట్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇండియాలో కంటే అమెరికాలో ఒకరోజు ముందు నుంచే సలార్ ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉన్నప్పటికీ సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్మడవుతున్నాయి. ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 25K డాలర్స్ రాబడినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా నార్త్ అమెరికాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో అక్కడ కూడా సాలిడ్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఓవర్సీస్ లోనూ సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్ దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నాడు. ఈశ్వరి రావు, టీనూ ఆనంద్, సప్తగిరి, శ్రీయ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : త్రిషకు క్షమాపణ చెప్పను - నడిగర్ సంఘానికి మన్సూర్ అలీ కౌంటర్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)