అన్వేషించండి

Mansoor Ali Khan : త్రిషకు క్షమాపణ చెప్పను - నడిగర్ సంఘానికి మన్సూర్ అలీ కౌంటర్!

Mansoor Ali Khan : మన్సూర్ అలీ ఖాన్ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో త్రిషకు క్షమాపణలు చెప్పేది లేదని, ఎందుకంటే తాను తప్పుగా ఏం మాట్లాడలేదని స్పష్టం చేశారు.

Mansoor Trisha Controversy : మన్సూర్ అలీ ఖాన్ ప్రస్తుతం ఈ పేరు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. తమిళంలో పలు విలక్షణ పాత్రలతో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన రీసెంట్ గా 'లియో'(Leo) మూవీలో నటించాడు. ఇదే సినిమాలో హీరోయిన్ నటించిన త్రిష పై పలు అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. గతంలోనూ కొన్ని వివాదాల్లో చిక్కుకున్న మన్సూర్ అలీ ఖాన్ ఈసారి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన త్రిష గురించి మాట్లాడుతూ.. 'లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకున్నా. నేను గతంలో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. కానీ త్రిషతో బెడ్ రూమ్ సీన్ మిస్ అయిపోయాను" అంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు. ఇక  మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష వెంటనే స్పందిస్తూ.." ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉంది. ఇకపై జీవితంలో అతనితో నటించను. మానవజాతికి మన్సూర్ అలీ ఖాన్ అవమానం" అంటూ ట్వీట్ చేసింది. ఇక మన్సూర్ అలీ కామెంట్స్  పై ఇండస్ట్రీ పెద్దలంతా స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

ఇప్పటికే కోలీవుడ్ నుంచి లోకేష్ కనగరాజ్, కుష్బూ సుందర్, చిన్మయి, హీరోయిన్ మాళవిక, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తదితరులు మన్సూర్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ త్రిషకి అండగా నిలిచారు. అలాగే తాజాగా  మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఇష్యూ పై రియాక్ట్ అవుతూ మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఇలాంటి కామెంట్స్ ఏ అమ్మాయికి వచ్చిన తాను అండగా ఉంటానని అన్నారు. మరోవైపు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం అతనిపై తాత్కాలికంగా నిషేధం విధించింది. దీంతో మన్సూర్ అలీ క్షమాపణ చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్ చేస్తుండగా.. తాను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేది లేదని, తాను తప్పుగా మాట్లాడలేదని తెగేసి చెప్పారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మన్సూర్ అలీ మాట్లాడుతూ..

" నడిగర్ సంఘం నాపై నిషేధం విధించి చాలా తప్పు చేసింది. నా నుంచి వివరణ కోరితే బాగుండు. అలాగే నడిగర్ సంగం నిషేధాన్ని వెనక్కి తీసుకోవడానికి మీకే టైం ఇస్తున్నా. సోషల్ మీడియాలో వార్తలు ఎలా అయినా రాయవచ్చు. కానీ తమిళ ప్రజలకు నేనేంటనేది తెలుసు. సినిమాల్లో రేప్ సీన్ ఉంటే నిజంగా ఎవరైనా రేప్ చేస్తారా? అసలు బుద్ధుందా? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిషకు క్షమాపణలు చెప్పను" అంటూ స్పష్టం చేశారు.దీంతో మల్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై అటు ఇండస్ట్రీ పెద్దలు, నడిగర్ సంఘం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే మన్సూర్ అలీ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఐపిసి 509B, ఇతర సెక్షన్స్ కింద కేసులు వేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

Also Read : 'ధృవ నక్షత్రం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget