Dhruva Natchathiram first review : 'ధృవ నక్షత్రం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?
Lingusamy reviews Dhruva Natchathiram movie : చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ధృవ నక్షత్రం' సినిమాను మరో దర్శకుడు లింగుస్వామి చూశారు.
Dhruva Natchathiram movie review: విలక్షణ కథానాయకుడు 'చియాన్' విక్రమ్ నటించిన పాన్ ఇండియా సినిమా 'ధృవ నక్షత్రం'. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
'ధృవ నక్షత్రం' మొదటి భాగం 'యుద్ధ కాండం' ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే... ఆల్రెడీ ఈ సినిమాను ఒకరు చూశారు.
'ధృవ నక్షత్రం' సినిమాకు లింగుస్వామి రివ్యూ
Dhruva Natchathiram X twitter review : ముంబైలో 'ధృవ నక్షత్రం' చూసినట్లు తమిళ దర్శకుడు లింగుస్వామి ట్వీట్ చేశారు. ఫెంటాస్టిక్ సినిమా అంటూ ఆయన కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంకా లింగుస్వామి మాట్లాడుతూ ''చియాన్ విక్రమ్ కూల్ గా ఉన్నారు. వినాయకన్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. సినిమాలో భారీ తారాగణం ఉంది. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. హ్యారిస్ జయరాజ్ మరోసారి అద్భుతమైన సంగీతం అందించారు. భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ సినిమా అంత కంటే పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా'' అని ట్వీట్ చేశారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు కంగ్రాట్స్ చెప్పారు.
Also Read : పూనమ్ టార్గెట్ మెగాస్టారేనా? - త్రిష, మన్సూర్ గొడవలో చిరు మద్దతుపై విమర్శలు?
Happened to see the final cut of #DhruvaNatchathiram in mumbai & it was just fantastic. well made, visuals on par with the best.@chiyaan was so cool & #vinayakan stole everything in the movie. huge cast & everyone were brilliant. @menongautham congrats brother, u along with…
— Lingusamy (@dirlingusamy) November 21, 2023
'ధృవ నక్షత్రం' కథ ఏమిటి?
'ధృవ నక్షత్రం' కథ విషయానికి వస్తే... ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ బట్టి... ముంబై మహానగరం మీద తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్జీ బృందంలో ఉన్న ఓ ఉన్నతాధికారి తమ వృత్తిలోని సవాళ్లను గురించి మరో వ్యక్తికి చెబుతుంటాడు. చట్టంలోని నియమ నిబంధనలు ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో తమకు అడ్డుగా మారుతున్నాయని, అందుకే చట్టంతో పనిలేని కోవర్ట్ టీమ్ రెడీ చేసినట్లు చెబుతారు. క్రికెట్ జట్టు తరహాలో 11 మంది ఉండే ఆ బృందంలోకి ప్రత్యేక అధికారిగా జాన్ (విక్రమ్) వస్తాడు. తీవ్రవాదులతో అతను ఎటువంటి పోరాటం చేశాడు? అనేది సినిమా. ఇందులో దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఓ పాత్ర చేశారు. ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ సంస్థలపై ఆయన సినిమా నిర్మించారు.
Also Read: 'హాయ్ నాన్న' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రన్ టైం విషయంలో జాగ్రత్త పడిన నాని
'చియాన్' విక్రమ్ సరసన హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ కథానాయికగా నటించిన 'ధృవ నక్షత్రం' సినిమాలో ఆర్. పార్తీబన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్, దివ్య దర్శిని, మున్నా సైమన్, వంశీ కృష్ణ, సలీమ్ బేగ్, సతీష్ కృష్ణన్, మాయ ఎస్ కృష్ణన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు (ఎడిటర్): ఆంటోనీ, కళా దర్శకుడు: కుమార్ గంగప్పన్, యాక్షన్: యానిక్ బెన్, సాహిత్యం (తెలుగులో): రాకేందు మౌళి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, సంగీతం: హ్యారిస్ జయరాజ్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస - ఎస్ఆర్ కతీర్ - విష్ణు దేవ్, సహ నిర్మాత: ప్రీతి శ్రీవిజయన్, నిర్మాణం - రచన & దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్.