Hi Nanna Trailer : 'హాయ్ నాన్న' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రన్ టైం విషయంలో జాగ్రత్త పడిన నాని
Nani, Mrunal Thakur movie Hi Nanna updates in Telugu: నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'హాయ్ నాన్న'. ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేశారు.
Hi Nanna Movie Trailer Release Date : నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన తాజా సినిమా 'హాయ్ నాన్నా'. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా తెరకెక్కిన చిత్రమిది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 7న సినిమా థియేటర్లలోకి రానుంది. మరి, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు?
నవంబర్ 24న 'హాయ్ నాన్న' ట్రైలర్
Hi Nanna Movie Run Time : నవంబర్ 24న... అంటే ఈ శుక్రవారం సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. రెండున్నర గంటల సినిమా నుంచి రెండున్నర నిమిషాలు ప్రేక్షకులకు చూపించబోతున్నామని నాని ట్వీట్ చేశారు.
నాని పోస్టును బట్టి... సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలు అని అర్థం అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ నిడివి రెండున్నర నిమిషాలు అన్నమాట. ప్రేమ, కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఇటీవల ఎక్కువ రున్ టైమ్ ఉన్న సినిమాలకు నిడివి ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సో... నాని ముందు జాగ్రత్తలు తీసుకున్నారని ఊహించవచ్చు.
Also Read : మన్సూర్‌ది వక్రబుద్ధి... త్రిషకు అండగా మెగాస్టార్ చిరంజీవి
Two and half minutes from the two and half hours :)#HiNanna
— Nani (@NameisNani) November 21, 2023
TRAILER ON 24th ♥️ pic.twitter.com/OK8r8YYtWK
రాజకీయ నేతగా నాని హంగామా!
ఎన్నికల నేపథ్యంలో నాని రాజకీయ నాయకుడిగా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్... ఇద్దరినీ నాని అనుకరిస్తూ చేసిన వీడియోలకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : త్రిషకు ఆ తమిళ స్టార్ హీరో లాంటి భర్త కావాలట - పెళ్లి గురించి ఏమంటున్నారో తెలుసా?
ఊరికే
— Nani (@NameisNani) November 20, 2023
Press meet పెట్టా 😬#HiNanna #HiNannaOnDec7th pic.twitter.com/bZIQroHN5P
'హాయ్ నాన్న'... నానికి పాతిక కోట్లు?
'హాయ్ నాన్న' డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డీల్స్ విషయాల్లో హీరో నాని కూడా ఇన్వాల్వ్ అయ్యారని టాలీవుడ్ టాక్. దీని వెనుక ఆయన రెమ్యూనరేషన్ ప్రధాన కారణమని వినబడుతుంది. ఈ సినిమాకు ఆయన 25 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. డిసెంబర్ తొలి వారంలో ఈ సినిమాతో పాటు మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. థియేటర్లలో భారీ పోటీ నెలకొనడంతో ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రావడం లేదట. దాంతో నాని రంగంలోకి దిగుతున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.
బేబీ కియారా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహకుడు. నానితో ఆయనకు మూడో చిత్రమిది. 'జెర్సీ', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలకూ ఆయన పని చేశారు. ఆ రెండు చిత్రాల్లో సినిమాటోగ్రఫీ వర్క్ బావుందని పేరు వచ్చింది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు, పాటల్లో కూడా సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం బావుంది. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ ఈవీవీ.