IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

'ఆర్ఆర్ఆర్' మూడు సార్లు చూశా! తెలుగులో నా ఫేవరేట్ హీరో ఎవరంటే? - సయీ మంజ్రేకర్ ఇంటర్వ్యూ

Sai Manjrekar exclusive interview - Ghani movie: 'గని'తో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా ABP Desam తో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు.

FOLLOW US: 

Sai Manjrekar Interview: వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన సినిమా 'గని'. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ శుక్రవారం... ఏప్రిల్ 8న 'గని' విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక సయీ మంజ్రేకర్ ABP Desam తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగులో ఆమెకు 'గని' తొలి సినిమా. కథానాయికగా అయితే రెండో సినిమా. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'దబాంగ్ 3'తో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. నటిగా సయీ మంజ్రేకర్‌కు సినిమాలు కొత్త ఏమో కానీ... సినీ ప్రపంచానికి ఆమె కొత్త కాదు. నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె కావడంతో చిన్నతనం నుంచి సినిమా వాతావరణం అలవాటే. తెలుగులో తన తొలి సినిమా, తన ఫేవరెట్ హీరో, తండ్రి గురించి సయీ మంజ్రేకర్ చెప్పిన విశేషాలు... 

హాయ్ సయీ మంజ్రేకర్... వెల్కమ్ టు టాలీవుడ్!
థాంక్యూ! 

నటీనటులకు భాషాబేధం లేదు. పాన్ ఇండియా సినిమాలు వస్తున్న రోజులు ఇవి. అయితే... మీ మాతృభాష కాని భాషలో సినిమా చేయడం ఎలా ఉంది?
చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. 'గని'లో నా పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నాను. సినిమా చేసేటప్పుడు నా నటనతో పాటు డైలాగులపై ఎక్కువ వర్క్ చేశా. నేను పర్ఫెక్షనిస్ట్. డైలాగులు కరెక్టుగా చెప్పాలని... 'ఊ', 'ఆ', 'ఈ' వంటి అక్షరాలు స్పష్టంగా పలకాలని వర్క్ చేశా. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడలేక పోవచ్చు. కానీ, డైలాగుల విషయంలో నేను ఎక్కువ వర్క్ చేశా. ఆ డైలాగ్ మీనింగ్ ఏంటో తెలుసుకున్నా. 

డైలాగుల విషయంలో కావచ్చు, మీ పాత్ర విషయంలో కావచ్చు. షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు ఏమైనా ప్రిపేర్ అయ్యారా?
నిజం చెప్పాలంటే... ప్రిపేర్ కాలేదు. యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూశా... తెలుగు యాస ఎలా ఉంటుంది? ఎలా పలకాలి? అని! ఇంగ్లీష్, మరాఠీ మాట్లాడుతూ పెరగడం వల్ల... నేను హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ యాసలో ఉంటుంది. హిందీ మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్ యాస రాకుండా చూసుకుంటాను. నేను 'అందరికీ నమస్కారం' అంటే ఇంగ్లీష్ లో చెప్పినట్టే ఉంటుంది. యాస విషయంలో ఎక్కువ వర్క్ చేశా. నా కోసం ముంబై నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను రప్పించారు. హిందీ, తెలుగు... రెండు భాషలు అతనికి తెలియడంతో నాకు డైలాగులను హిందీలో వివరించేవారు.

సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3'తో మీరు కథానాయికగా పరిచయమయ్యారు. ఆ సినిమా చేసేటప్పుడు, ఆ తర్వాత తెలుగు సినిమా చేస్తానని ఊహించారా?
తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దదని నాకు తెలుసు. ఇప్పుడు ఓటీటీల్లో ఇతర భాషల సినిమాలు చూస్తున్నాం. నా చిన్నప్పుడు అలా ఉండేది కాదు. హిందీలో డబ్బింగ్ అయిన చాలా తెలుగు సినిమాలు చూసేదాన్ని. అయితే... 'బాహుబలి'తో మొత్తం పరిస్థితి మారింది. అటువంటి సినిమా చేయాలని నాకూ అనిపించింది. 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమాలకు అభిమానిగా మారాను. 'ఆర్య', 'మగధీర', 'ఈగ'తో పాటు చాలా సినిమాలు చూశా. అప్పుడే తెలుగు సినిమా చేయాలనుకున్నాను. ఇతర భాషల్లో ప్రేక్షకులు కూడా నన్ను ప్రేమిస్తారు కదా!

'గని'లో మీకు అవకాశం రావడానికి 'దబాంగ్ 3'లోని ఓ పాట కారణం అని తెలుసా?
హా... తెలుసు! 'దబాంగ్ 3' విడుదలకు కొన్ని రోజుల ముందు అందులోని ఓ పాట విడుదలైంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఆ పాట చూసి నన్ను సంప్రదించారు. ముంబై వచ్చి కథ చెప్పారు. హీరోయిన్ మాయ పాత్ర నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా.

కథ విన్నప్పటికి... హీరో వరుణ్ తేజ్ గురించి మీకు తెలుసా?
తెలుసు! నేను 'గద్దలకొండ గణేష్' చూశా. వరుణ్ తేజ్ నటనకు అభిమాని అయ్యా. వరుణ్ రియల్లీ గుడ్ యాక్టర్. అతను హీరో అనడంతో హ్యాపీగా అనిపించింది.

సెట్స్‌లో వరుణ్ తేజ్ ఎలా ఉండేవారు?
వరుణ్ తేజ్ ఈజ్ స్వీట్ హార్ట్! మోస్ట్ జెన్యూన్, స్వీట్, నైస్ పర్సన్. ఒక్కసారి యాక్షన్ అని చెబితే... పాత్రలోకి వెళ్ళిపోతారు.

సినిమాలో మీ క్యారెక్టర్ మాయ ఎలా ఉంటుంది?
నా రియల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌కు మాయ చాలా దగ్గరగా ఉంటుంది. నేను కొంచెం షై పర్సన్. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతాను. కానీ, బయట ఎక్కువ మాట్లాడలేను. మాయ కూడా అటువంటి పాత్రే. సెట్స్‌లో చాలా మంది ఉంటారు కదా! వాళ్ళ ముందు బబ్లీగా, హుషారుగా చేయడం ఛాలెంజ్ అనిపించింది.

సినిమా చూశారా?
ఇంకా లేదు! మూడేళ్ళ నుంచి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. విడుదల రోజున థియేటర్లలో ప్రేక్షకుల మధ్య చూడాలనుకుంటున్నాను.  సినిమా చూసి నా తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ ఏమంటారో అని ఎగ్జైటెడ్ గా ఉన్నాను. 

'గని'తో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు బాబీ నిర్మాతగా పరిచయం అవుతున్నారు! సిద్ధు ముద్దుతో కలిసి నిర్మించారు. నిర్మాతల గురించి...
వాళ్ళు వెరీ ప్రొఫెషనల్. కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. అనుకున్న సమయానికి విడుదల చేయడం కుదరలేదు. వాయిదా పడుతూ వచ్చింది. అయినా సరే... ఓటీటీకి ఇవ్వకుండా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకని, వాళ్ళకు థాంక్స్ చెప్పాలి. 

Also Read: ప్రేక్షకులకు గుడ్ న్యూస్, వరుణ్ తేజ్ ‘గని’ టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

మీ ఫాదర్ మహేష్ మంజ్రేకర్ తెలుగు సినిమాల్లో నటించారు. మీరు ఆ సినిమాలు చూశారా?
(ప్రశ్న మధ్యలో ఉండగా...) ఎన్టీఆర్ 'అదుర్స్'లో నటించారు కదా! ఆ సినిమాతో పాటు 'ఒక్కడున్నాడు', మిగతా సినిమాలు కూడా చూశా. నేను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. వెరీ వెరీ బిగ్ ఫ్యాన్.

ఎన్టీఆర్‌ను కలిశారా?
ప్చ్... ఇంకా లేదు! 'అదుర్స్' విడుదలైనప్పుడు నేను చిన్నదాన్ని. అప్పట్లో ఇంగ్లీష్ బాగా వస్తుందని చిన్న పిల్లలను ఇంగ్లీష్ కార్టూన్స్, సీరియల్స్ చూడమని చెప్పేవారు. నేను హిందీలో చూసేదాన్ని. సబ్ టైటిల్స్ లేకపోయినా... నాన్న నటించారని 'అదుర్స్' చూశా! అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని అయిపోయా.

'ఆర్ఆర్ఆర్' చూశారా?
మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ నటన గురించి...మూడు సార్లు చూశా! నేను సింగిల్ స్క్రీన్ లో సినిమా చూడాలనుకున్నా. కానీ, నా ఫ్రెండ్స్ మల్టీప్లెక్స్ అన్నారు. ముంబైలో పోష్ మల్టీప్లెక్స్‌కు వెళ్లాం. సాధారణంగా ముంబైలో ఆడియన్స్ అంత ఎక్స్‌ప్రెస్సివ్ కాదు. కానీ, 'ఆర్ఆర్ఆర్' థియేటర్లో ఈలలు వేస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు. విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' ఒక మాస్టర్ పీస్. మల్టీప్లెక్స్ ఆడియన్స్ రియాక్షన్ చూసిన తర్వాత  రెండోసారి సింగిల్ స్క్రీన్‌కు వెళ్లాను. అక్కడ కూడా సేమ్ రియాక్షన్. మూడోసారి తెలుగు వెర్షన్ సబ్ టైటిల్స్‌తో చూడాలని వెళ్లాను. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఓ అలవాటు ఉంది. తనకు ఏదైనా సినిమా నచ్చితే విపరీతంగా చూస్తుంది. లాస్ట్ టైమ్ ఒక సినిమాను ఆరుసార్లు చూసింది. 'ఆర్ఆర్ఆర్'ను ఏడుసార్లు చూస్తానని చెప్పింది.

Also Read: 'నాటు నాటు' పాటకు రాజమౌళి స్టెప్పేస్తే? ఎన్టీఆర్‌కు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటే?

ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వస్తే?
ఎన్టీఆర్‌తో పాటు తెలుగులో నా అభిమాన హీరోల లిస్ట్ చాలా ఉంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్... చెబుతూ వెళితే బోలెడు మంది ఉన్నారు. తెలుగులో నా అభిమాన హీరోలు అందరితో సినిమాలు చేయాలని ఉంది. తెలుగు సినిమాల్లో ఒక స్వాగ్, మాస్ అప్పీల్ ఉంటుంది.

తెలుగులో 'గని', 'మేజర్' సినిమాలకు ఓకే చెప్పే ముందు మీ నాన్నగారికి చెప్పారా? ఆయన ఏం అన్నారు? ఏం సలహాలు ఇచ్చారు?
'తెలుగు లైన్స్ నేర్చుకో' అని చెప్పారు. నేను అది ఫాలో అయ్యాను. స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా నటించమని చెప్పారు. ఒకవేళ డైలాగ్ సరిగా చెప్పలేకపోతే ఇంకో టేక్ చేయొచ్చు. అందువల్ల, టెన్షన్ తీసుకోవద్దన్నారు. టెన్షన్ తీసుకుంటే అది నటనలో కనిపిస్తుందని చెప్పారు.

మీ ఫాదర్ డైరెక్టర్ కూడా! ఆయనతో ఎప్పుడైనా 'నాన్నా! నాతో ఎప్పుడు సినిమా చేస్తారు!?' అని అడిగారా?
అడిగాను! అయితే... అదే సమయంలో నటనలో నాకు ఇంకొంచెం అనుభవం కావాలని అనిపించింది. సెట్స్‌లో నా నటనతో నాన్నను ఇంప్రెస్ చేయాలని ఉంది. అందుకని, నాన్నతో సినిమా చేయడానికి ఆలోచిస్తున్నాను. నాకు కాన్ఫిడెన్స్ రావాలి. 

మీరు చేయబోయే సినిమా కథలు మీ నాన్నతో డిస్కస్ చేస్తారా?
ఆయన కథలు మీతో డిస్కస్ చేస్తారా?నా విన్న, చేస్తున్న ప్రతి కథ గురించి నాన్నకు చెబుతా. అయితే... నటించాలా? వద్దా? అనే డెసిషన్ నేనే తీసుకుంటా. నాన్న దర్శకత్వం వహించే సినిమా కథలు, ఆయన రాసే కథలు నాకు చెబుతారు. వింటూ ఉంటాను.

మహేష్ మంజ్రేకర్ కుమార్తెగా మీపై ఒత్తిడి ఏమైనా ఉందా?
ఆయన కుమార్తె కావడం బాధ్యతగా ఫీలవుతున్నా. ఒత్తిడి ఏమీ లేదూ!

ఆల్ ద బెస్ట్ సయూ మంజ్రేకర్! చివరగా, తెలుగు ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఏప్రిల్ 8న 'గని' విడుదలవుతోంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూడండి. తెలుగులో నా తొలి చిత్రమిది. నేను తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఫ్యాన్. సినిమా చూశాక... నన్ను మీరు అభిమానిస్తారని ఆశిస్తున్నాను. 

Published at : 05 Apr 2022 02:12 PM (IST) Tags: Ghani Movie Sai Manjrekar Sai Manjrekar On RRR Sai Manjrekar Interview Sai Manjrekar On Telugu Movies Sai About Ghani Movie Sai About His Father Mahesh Manjrekar

సంబంధిత కథనాలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?

Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?

1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది

1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి