By: ABP Desam | Updated at : 05 Apr 2022 08:54 AM (IST)
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్
ఎప్పుడు? ఆలియా భట్ పెళ్లి (Alia Bhatt marriage date) ఎప్పుడు? రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తో ఏడడుగులు వేసేది ఎప్పుడు? - ఎప్పటి నుంచో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని హిందీ సినిమా ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. RRR సినిమాతో ఆలియా భట్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. దాంతో ఇక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తికి తెర పడింది. ఈ నెలలో రణ్‌బీర్, ఆలియా ఏడడుగులు వేయనున్నారు.
Ranbir Kapoor and Alia Bhatt to get hitched on April 17: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఈ నెల 17న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. మనవరాలి పెళ్లి చూడాలని ఉందని ఆలియా తాతయ్య (తల్లి సోనీ రజ్ దాన్) ఎన్. రజ్‌దాన్ కోరారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో త్వరగా పెళ్లి చేయాలని నిర్ణయించారట.
రణ్‌బీర్, ఆలియా పెళ్ళికి కపూర్ ఫ్యామిలీకి చెందిన ఆర్కే స్టూడియోస్ వేదిక కానుందని తెలుస్తోంది. పెళ్ళికి ఇరువురి కుటుంబ సభ్యులు... అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారట. ఎక్కువ మందిని ఆహ్వానించడం లేదట. సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల కోసం తర్వాత రిసెప్షన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.
Also Read: ఆ క్రికెటర్, హీరోయిన్ మధ్య ఏం జరుగుతోంది?
గతంలో రణ్‌బీర్ కపూర్ ప్రేమాయణాలు పెళ్లి పీటల (Ranbir Kapoor Marriage) వరకూ వెళ్ళలేదు. దాంతో ఆలియాతో ఏడడుగులు వేస్తారా? లేదా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ వాళ్ళిద్దరికీ పెళ్ళైందని కొందరు కామెంట్ చేశారు. ఊహాగానాలకు తెర దించుతూ... త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రణ్‌బీర్, ఆలియా రెడీ (Ranbir Kapoor Alia Bhatt marriage) అవుతున్నారు.
Also Read: డ్రగ్స్ కేసుపై మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా రియాక్షన్ ఇదే
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
Breaking News Live Updates: జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం : సీఎం కేసీఆర్
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
YSRCP Bus Yatra : బస్సుల్లోనే మంత్రులు - యాత్రలో కిందకు దిగేందుకు నిరాసక్తత !
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!