Venkatesh Iyer & Priyanka Jawalkar: ఆ క్రికెటర్, హీరోయిన్ మధ్య ఏం జరుగుతోంది?
Venkatesh Iyer Comments On Priyanka Jawalkar Photo: టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్, క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ మధ్య ఏం జరుగుతోంది? ఇటు ఫిల్మ్, అటు క్రికెట్ సర్కిళ్లలో ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్.
'టాక్సీవాలా' సినిమాతో తెలుగులో విజయం అందుకున్న కథానాయిక ప్రియాంకా జవాల్కర్ (Priyanka Jawalkar). ఆమెకు, టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) కు మధ్య ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇదే ఇటు టాలీవుడ్, అటు క్రికెట్ సర్కిళ్లలో హాట్ డిస్కషన్. దీనికి కారణం వెంకటేష్ అయ్యర్ అనే చెప్పాలి. అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
Cricketer Venkatesh Iyer compliments telugu movie heroine Priyanka Jawalkar: ఉగాది రోజున ప్రియాంకా జవాల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. దాని కింద వెంకటేష్ అయ్యర్ కామెంట్ చేశారు. 'క్యూట్' అంటూ ప్రియాంక అందాన్ని మెచ్చుకున్నారు. అతడి కాంప్లిమెంట్ చూసిన ప్రియాంకా జవాల్కర్ స్పందించారు. 'ఎవరు? నువ్వా?' అని సరదాగా స్పందించారు. దాంతో సోషల్ మీడియాలో చర్చ షురూ అయ్యింది.
ప్రియాంకా జవాల్కర్ మీద వెంకటేష్ అయ్యర్ మనసు పారేసుకున్నారని, ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని కొంత మంది కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ తరహాలో పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు, క్రికెటర్లు ఉన్నారు. దాంతో చర్చ ఎక్కడికో వెళ్ళింది. అయితే... గతంలోనూ వెంకటేష్ అయ్యర్ ఫోటోలకు ప్రియాంకా జవాల్కర్, ఆమె ఫోటోలకు అతడు కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని టాలీవుడ్ టాక్.
Also Read: 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పెషల్ పార్టీ
వెంకటేష్ అయ్యర్‌ది మధ్యప్రదేశ్. ప్రియాంకా జవాల్కర్ అంతఃపురంలో పెరిగిన అమ్మాయి అయినప్పటికీ... ఆమెదీ మధ్యప్రదేశే. మరాఠీ అమ్మాయి. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఉండవచ్చు. అయితే... వెంకటేష్ అయ్యర్ కామెంట్ చేసిన తర్వాత సేమ్ డ్రస్‌లో దిగిన ఫొటోలను ప్రియాంకా జవాల్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంకటేష్ అయ్యర్ కోసమే ఈ ఫొటోలు పోస్ట్ చేస్తున్నావా? అని నెటిజన్స్ కామెంట్స్ చేయడం గమనార్హం.
Also Read: డ్రగ్స్ కేసుపై మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా రియాక్షన్ ఇదే
వెంకటేష్ అయ్యర్ 'క్యూట్' అని కామెంట్ చేసిన ప్రియాంకా జవాల్కర్ ఫొటో ఇదే
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.