News
News
వీడియోలు ఆటలు
X

Sai Dharam Tej: అందుకే లుంగీతో వెళ్తున్నా, అమ్మాయిలు అంటే భయం: సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత ఈ ‘విరూపాక్ష’ సినిమాలో నటించారు.  అందుకే ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొంటున్నారు. ఆయన ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో తన లుంగీ కాన్సెప్ట్ గురించి చెప్పుకొచ్చారు.

FOLLOW US: 
Share:

Sai Dharam Tej: టాలీవుడ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సబంధించిన ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంది. ఏప్రిల్ 21 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. 

అందుకే లుంగీతో తిరుగుతున్నా: సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత ఈ ‘విరూపాక్ష’ సినిమాలో నటించారు.  ఈ మూవీపై ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అందుకే ప్రమోషన్స్ ను బాగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో తన లుంగీ కాన్సెప్ట్ గురించి చెప్పుకొచ్చారు. ఈ మధ్య ‘విరూపాక్ష’ ప్రమోషన్స్ లో ఎక్కువగా ఎప్పుడూ లుంగీలో కనిపిస్తున్నారు ఎందుకు అని నటి సోనియా సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తమ సినిమా ‘విరూపాక్ష’ ను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నామని, అందుకే తెలుగు నేటివిటీని అందరికీ తెలియజేసేలా లుంగీను ధరిస్తున్నానని అన్నారు. తెలుగుతనానికి లుంగీ సింబాలిక్ గా ఉంటుంది కాబట్టి, అందులోనూ సమ్మర్ సమయాల్లో ఈ లుంగీ చాలా కంపర్ట్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు సాయి ధరమ్ తేజ్. 

అమ్మాయిలంటే కొంచెం భయం

సాయి ధరమ్ తేజ్ మొదటి నుంచీ చాలా సరదాగా ఉంటారు. సినిమా ఫంక్షన్లు లేదా బయట ప్రయివేట్ పార్టీలలో చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంటారు. అయితే సాయి ధరమ్ తేజ్ కు అమ్మాయిలంటే భయమట. ఆయన స్కూల్ లో చదువుకునే రోజుల్లో అమ్మాయిల పక్కనే కూర్చోవాల్సి వచ్చేదని, అల్లరి చేస్తే తనపై కంప్లైంట్ లు చేసేవారని, అందుకే అమ్మాయిలంటే అంతగా పడేది కాదని నవ్వుతూ చెప్పుకొచ్చారు. కాలేజీలో కూడా తాను ఫ్రెండ్స్ తో కలసి చాలా అల్లరి చేసే వాడినని ఇండస్ట్రీకు వచ్చిన తర్వాతే కాస్త ఇంట్రోవర్ట్ గా మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

కొత్త సౌండ్స్ వస్తే కారెక్కి వెళ్లిపోతా అని చెప్పాను

‘విరూపాక్ష’ సినిమా అంతా ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఊరినే తయారు చేశారట మేకర్స్. హారర్ థ్రిల్లర్ మూవీ కావడంతో ఎక్కువగా చీకట్లోనే షూటింగ్ జరిగేదని చెప్పుకొచ్చారు సాయి ధరమ్ తేజ్. షూటింగ్ లో ‘సార్ మీరు భయపడొద్దు.. మీరు చాలా ధైర్య వంతులు ధైర్యంగా ఉండండి’ అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లు చెప్పేవారని అన్నారు. కానీ తాను చీకట్లో షూట్ చేయాల్సి వచ్చినపుడు కొంచెం కష్టంగానే ఉండేదని, ప్రీ ప్లాన్ గా వచ్చే సౌండ్స్ వస్తే పర్లేదు కొత్త సౌండ్స్ వస్తే కార్ ఎక్కి వెళ్లిపోతాను అని డైరెక్టర్ కార్తీక్ తో చెప్పేవాడినని అన్నారు సాయి ధరమ్ తేజ్. సినిమా అంతా చాలా బాగా వచ్చిందని, విజువల్స్ మెప్పిస్తాయని, మూవీ మిస్టరీని అందరూ ఎంజాయ్ చేస్తారని అన్నారు. 

Read Also: సెన్సార్ రిపోర్ట్: ‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్ - సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట!

Published at : 19 Apr 2023 05:06 PM (IST) Tags: Sai Dharam Tej Samyuktha Menon sai dharam tej movies Virupaksha

సంబంధిత కథనాలు

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్