అన్వేషించండి

Virupaksha Movie: సెన్సార్ రిపోర్ట్: ‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్ - సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట!

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్డ్ బోర్డు ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది.

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఏలూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది.

‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్

తాజాగా ‘విరూపాక్ష’ చిత్రం సెన్సార్ ఫార్మాలీటీస్  కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్‌ టైమ్ 2 గంటల 20 నిమిషాలుగా లాక్ చేయబడింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ తోనే మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీ ట్రైలర్ తోఅంచనాలను పెంచేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మూవీలో సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట. అయితే, ‘ఎ’ సర్టిఫికెట్ జారీ వెనుక కారణాలు తెలియరాలేదు. హింసాత్మక సన్నివేశాలు, మూఢనమ్మకాలు, చేతబడి తదితర సీన్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.

అంచనాలు పెంచేసిన ట్రైలర్

ట్రైలర్ లో రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథలా కనిపిస్తుంది. చాలా వివరాలను చెప్పకుండానే ట్రైలర్ ను చాలా ఇంట్రస్టింగ్ గా మలిచారు మేకర్స్. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది ట్రైలర్. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ గ్రామంలో ఆకస్మికంగా జరిగే మరణాలు వెనుక గల కారణాన్ని కనుగొనే అన్వేషణలో ఉన్నట్లు కనిపిస్తోంది. స్థానికుల మరణాలకు కారణాలు ఏంటి? దీని వెనక ఎవరు ఉన్నారు? వాటిని హీరో ఎలా కనుగొన్నారు? అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈసారి సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఏప్రిల్ 21న ‘విరూపాక్ష’ విడుదల

‘విరూపాక్ష’ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో సాయి ధరమ్ తేజ్  ఈ చిత్రంపై చాలా హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీలో సునీల్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ‘సుప్రీం’, ‘విన్నర్’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వల్ల వెనుకబడినట్లు కనిపించినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. యాక్సిడెంట్ సమయంలోనే ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదల అయ్యింది. ప్రస్తుతం ‘విరూపాక్ష‘లో నటించారు.   

Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today November 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం రాజును ట్రాప్‌ చేసిన ఇందు, నందు – మరో ప్లాన్‌ చేసిన రేఖ
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం రాజును ట్రాప్‌ చేసిన ఇందు, నందు – మరో ప్లాన్‌ చేసిన రేఖ
Pawan Kalyan Anna Konidela : పవన్ కల్యాణ్ అనా విడాకులు - అసలు రీజన్ ఏంటి?... గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషనల్
పవన్ కల్యాణ్ అనా విడాకులు - అసలు రీజన్ ఏంటి?... గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషనల్
Karthika Deepam 2 Serial Today November 10th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మీద సూరజ్ ఫైర్! నోరు తెరవకుండా తప్పు చేశానని తలదించుకున్న జ్యోత్స్న!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మీద సూరజ్ ఫైర్! నోరు తెరవకుండా తప్పు చేశానని తలదించుకున్న జ్యోత్స్న!
Nindu Noorella Saavasam Serial Today November 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన మనోహరి – వెనకాలే ఫాలో అయిన రాథోడ్‌, అమర్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన మనోహరి – వెనకాలే ఫాలో అయిన రాథోడ్‌, అమర్‌  

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget