Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ నుండి ఫ్రెండ్‌షిప్ డేకు స్పెషల్ అప్డేట్
కిరణ్ అబ్బవరం అప్‌కమింగ్ మూవీ ‘రూల్స్ రంజన్’ నుండి ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఒకప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అవ్వాలంటే చాలా కష్టం అని అంటుండేవారు. అది పూర్తిగా నిజం కాదు అని ప్రూవ్ చేసినవారు కూడా ఉన్నారు. కానీ రోజులు మారిపోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. హీరో ఎవరు, దర్శకుడికి ఉన్న అనుభవం ఎంత అని ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. అందుకే చిన్న బడ్జెట్ చిత్రాలు, డెబ్యూ డైరెక్టర్స్ తెరకెక్కించిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అంతే కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు కూడా చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కొందరు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. తాజాగా కిరణ్ అబ్బవరం అప్‌కమింగ్ మూవీ ‘రూల్స్ రంజన్’ నుంచి ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమాలు చేసే స్పీడ్ చూసి ఇతర యంగ్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మూడు నెలలకు ఒక సినిమా విడుదల చేస్తూ ఈ సినిమా రిజల్ట్ గురించి సంబంధం లేకుండా ఇంకా ఇంకా చిత్రాలను ఒప్పుకుంటూ ముందుకెళ్తున్నాడు. యూత్‌కు నచ్చే స్టోరీలను ఎంచుకుంటూ యూత్ హీరో అయిపోయాడు. ఇప్పటికే 2023లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అబ్బవరం.. ‘రూల్స్ రంజన్’తో ఈ ఏడాది ముచ్చటగా మూడో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ‘రూల్స్ రంజన్’ చిత్రంపై ప్రేక్షకుల్లో తగినంత ఆసక్తిని నింపారు మేకర్స్. తాజాగా ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్‌గా ఒక సాంగ్ విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
‘ఎందుకు రా బాబు’ అంటూ..
ఈరోజుల్లో ఏ పండగలకు అయినా సినిమాలకు సంబంధించి స్పెషల్ పోస్టర్లు విడుదల చేయడం లేదా పాటలు, ప్రోమో లాంటివి విడుదల చేయడం చాలా కామన్‌గా మారిపోయింది. ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్‌గా కిరణ్ అబ్బవరం నటించిన ‘రూల్స్ రంజన్’ నుంచి థర్డ్ సింగిల్ విడుదలకు సిద్ధమయ్యింది. ఎందుకు రా బాబు అని సాగే ఈ పాట అబ్బాయిలు, కాంప్రమైజ్ అంటూ క్రేజీ డైలాగులతో ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఫుల్ సాంగ్ మాత్రం ఆగస్ట్ 6న విడుదల కానుంది. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన రత్నం కృష్ణ‘రూల్స్ రంజన్’ను కూడా డైరెక్ట్ చేశాడు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమురి చిత్రాన్ని నిర్మించారు.
ఊపేస్తున్న ‘సమ్మోహనుడా’..
‘రూల్స్ రంజన్’కు అమ్రిష్ అందించిన సంగీతం పెద్ద ప్లస్‌గా మారింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా లూప్ మోడ్‌లో ఉన్నాయి. ముందుగా ‘రూల్స్ రంజన్’ నుంచి ‘నాలో నేనే లేను’ అనే పాట విడుదలయ్యింది. సోషల్ మీడియా ఫుల్‌గా ఈ సాంగే వినిపించింది. ఆ తర్వాత తాజాగా ‘సమ్మోహనుడా’ పాట బయటికి వచ్చింది. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు నేహా శెట్టి వేసిన స్టెప్పులు హాట్‌గా అందరినీ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఈ పాటకు నేహా శెట్టి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పబ్లిసిటీ చేయడంతో సమ్మోహనుడా అనేది చాలా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ రెండు పాటల తరహాలోనే మూడో పాట కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
View this post on Instagram
Also Read: పెళ్లి పుకార్లపై తరుణ్ స్పందన - మెగా ఇంటి అల్లుడు పుకార్లకు చెక్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial