Ajith Kumar vs Selvamani: హైదరాబాద్‌లో షూటింగ్స్ వద్దు, హీరో అజీత్‌పై రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో షూటింగ్స్ నిర్వహిస్తున్న అగ్ర హీరోలపై ఆర్కే సెల్వామణి మండిపడ్డారు. చెన్నైలో షూటింగ్స్ పెట్టుకుని సినీ కార్మికుల కడుపు నింపాలని కోరారు.
తమిళ అగ్ర హీరోలు చెన్నైలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నంలో షూటింగ్స్‌లో పాల్గొవడంపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భర్త, ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు ఆర్కే సెల్వామణి మణి మండిపడ్డారు. ఫిల్మ్ ఎంప్లాయస్ ఫేడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (Film Employees Federation of South India - FEFSI) అధ్యక్షుడిగా ఉన్న ఆర్కే సెల్వామణి మంగళవారం చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘నటుడు అజిత్ కుమార్ తన సినిమా షూటింగ్ మరో రాష్ట్రంలోని హైదరాబాద్ తదితర నగరాల్లో చేస్తున్నారు. దానివల్ల తమిళనాడులోని సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి, అజిత్ కుమార్ తమిళనాడులో షూట్ చేయాలన్నది మా డిమాండ్. అజీత్‌తోపాటు దర్శకుడు వినోద్, నిర్మాత బోనీ కపూర్‌లకు కూడా ఇదే మా విన్నపం’’ అని తెలిపారు.
‘‘ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌కు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని గతంలో నటుడు విజయ్‌కి విన్నవించగా, ఆయన మా అభ్యర్థనను అంగీకరించారు’’ అని తెలిపారు. ఇటీవల నటుడు విజయ్ నటిస్తున్న ‘సేనాపతి 66’ సినిమాలోని ఎక్కువ భాగం హైదరాబాద్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే FEFSI అభ్యర్థన మేరకు హీరో విజయ్ చెన్నైలో చిత్రీకరించాలని కోరినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. అయితే, అజీత్ మాత్రం FEFSI అభ్యర్థనపై ఇంకా స్పందించలేదు. ఇప్పటికే ఆయన షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైపోవడంతో ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
Also Read: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ గొడవపై ఆర్జీవీ ట్వీట్, ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటీ?
అజీత్ ఇంకా హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగించడాన్ని ఆర్కే సెల్వమణి ఖండించారు. ‘‘మీ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేయడం వల్ల చెన్నైలోని చాలామంది కార్మికులపై ప్రభావం పడుతోంది. అజీత్‌కు ఇదే మా విన్నపం’’ అని అన్నారు. మరి, అజీత్ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. రజనీకాంత్ కూడా తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే మార్గంలో మరికొందరు తమిళ అగ్రనటులు చెన్నైలోనే షూటింగ్‌లు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏమిటి? విశ్వక్ సేన్ మీద కంప్లైంట్ చేసిన లాయర్