Razor Trailer: చిన్నారి కోసం రవిబాబు రక్తపాతం... యాక్షన్ ప్యాక్డ్ 'రేజర్' ట్రైలర్ రిలీజ్
Razor Trailer Review: రవి బాబు ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రేజర్' ట్రైలర్ విడుదలైంది. రక్తపాతంతో కూడిన అది ఎలా ఉందో చూడండి.

తెలుగు దర్శకుల్లో రవి బాబు (Ravi Babu)ది విభిన్న పంథా. నటుడిగా ఆయన కమర్షియల్ సినిమాలు చేశారు. కానీ, దర్శకుడిగా ఫార్ములా కథలకు దూరంగా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలతో సినిమాలు చేశారు. ఆయన తాజా సినిమా 'రేజర్' ట్రైలర్ చూస్తే మరోసారి మాంచి ప్రయోగాత్మక సినిమాతో వస్తున్నారని అర్థం అవుతోంది.
చిన్నారి కోసం రవిబాబు రక్తపాతం
రవి బాబు ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా 'రేజర్'. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. మే 8న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలకు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
'రేజర్' ట్రైలర్ చూస్తే... చిన్నారి చుట్టూ కథ తిరుగుతుందని అర్థం అవుతోంది. ఓ పాపను కాపాడటం కోసం రవి బాబు రక్తపాతం సృష్టించారని అర్థం అవుతోంది. 'అవసరంలో ఉన్నవారికి రక్షకుడిగా దేవదూతను దేవుడు పంపుతాడని అంటారు. కానీ, మరణం వెంబడిస్తూ ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది' అని డైలాగ్ వచ్చింది. ఆ మాటలకూ తగ్గట్టు రవి బాబు రక్తపాతం సాగింది.
Also Read: వేరే దేశంలో అయితేనా? శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు, రామాయణం కాంట్రవర్సీపై నాగబాబు రియాక్షన్
'కరుణ మాయం అయితే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం... అన్నీ కలిసి 'రేజర్'గా మారుతుంది'' అని తర్వాత డైలాగులు వచ్చాయి. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషన్ అయితే చూపించింది.
'రేజర్' ట్రైలర్‌లో తనీష్, నటుడు బెనర్జీ తదితరులు కనిపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని, నేపథ్య సంగీతం: ఎస్‌ఎస్ రాజేష్, యాక్షన్ కొరియోగ్రఫీ: సతీష్ పొలుజు.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు






















