అన్వేషించండి

Naga Babu Konidela: రామాయణం కాంట్రవర్సీ... వేరే దేశంలో అయితేనా? ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్

Naga Babu On Prakash Raj: రామునిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందువులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇప్పుడు ఆయన మాటలపై నాగబాబు కొణిదెల స్పందించారు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసే వ్యాఖ్యలు, వేసే ట్వీట్లు ఎంతటి వివాదాలకు దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. తాను నాస్తికుడిని అని చెబుతూ హిందూ మతం మీద, రామాయణం మీద ఆయన చేసిన కామెంట్స్ పట్ల ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. రాముడిది నార్త్, రావణుడిది సౌత్.... రాముడు పండ్లను దొంగతనం చేయడం వల్లే ఘర్షణ మొదలైంది అంటూ ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రకాష్ రాజ్ మీద వ్యతిరేకజ్వాలలు మొదలయ్యాయి. చాలా చోట్ల కేసులు కూడా నమోదు చేశారు.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్!
ప్రకాష్ రాజ్ వ్యవహరం, వివాదం మీద జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ, నటుడు నాగబాబు స్పందించారు. ఇటీవల జరిగిన ప్రకాష్ రాజ్ తల్లి అంత్యక్రియలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు దారి తీసిన సంగతి తెలిసిందే. వాటిని సైతం మెగా బ్రదర్ ప్రస్తావించారు. 
''ప్రకాష్ రాజ్ గారూ... మిమ్మల్ని మీరు క్రైస్తవ నాస్తికుడని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియలు జరిగినప్పుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించారు. ఒక కొడుకుగా అది మీ కర్తవ్యం. దాన్ని మేం గౌరవిస్తాం. అదే స్ఫూర్తితో మీరు కోట్లాది మంది ప్రజల నమ్మకాలను గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్ళను గానీ, దేవుని పట్ల విశ్వాసం ఉన్న వారిని గానీ అపహాస్యం చేయడం కాదు. అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానం. తన సిద్ధాంతాల ద్వారా నాస్తిక తత్వాన్ని కూడా స్వీకరించిన ఏకైక మతం హిందూమతం మాత్రమే. అటువంటి సంప్రదాయాన్ని తోసిపుచ్చడం హేతుబద్ధం కాదు, అది అగౌరవం'' అని నాగబాబు పేర్కొన్నారు.

Also ReadBad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

ఇతర దేశాలలో అయితే ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రకాష్ రాజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''భవిష్యత్తులో మీలాంటి గౌరవహీనమైన వ్యక్తులతో నేను ఎప్పటికీ వాదించను. విభిన్న విశ్వాస వ్యవస్థలను గౌరవించడమే హేతుబద్ధతకు, బాధ్యతకు నిజమైన నిదర్శనం'' అని రియాక్ట్ అయ్యారు.

Also ReadPapam Prathap: అయ్యో పాపం... రాశి అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

పవన్ కళ్యాణ్, నాగబాబు మీద ప్రకాష్ రాజ్ ఎలాంటి సెటైరికల్ కామెంట్స్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. మరి నాగబాబు ఇచ్చిన ఈ కౌంటర్ల మీద ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక దేశ వ్యాప్తంగా ప్రకాష్ రాజ్ మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాన్ ప్రకాష్ రాజ్ అంటూ ట్వీట్లు వేస్తున్నారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరి ఈ కాంట్రవర్సీకి ప్రకాష్ రాజ్ ఏ విధంగా పుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Also ReadPapam Prathap Movie Review - పాపం ప్రతాప్ రివ్యూ: థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు చూసి పాపం అనుకోవాలా?... తిరువీర్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget