Gadadhari Hanuman Teaser: 'హనుమాన్' స్థాయిలో 'గదాధారి హనుమాన్' - టీజర్ అదుర్స్... క్లైమాక్స్ చాలా పవర్ ఫుల్
Gadadhari Hanuman: హనుమాన్ మూవీలానే 'గదాధారి హనుమాన్' బిగ్ హిట్ అవుతుందని ప్రముఖ ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ తెలిపారు. మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Gadadhari Hanuman Teaser Released: రవి కిరణ్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ 'గదాధారి హనుమాన్'. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించగా... విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా సినిమాను నిర్మించారు. రవికిరణ్ సరసన హర్షిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ ప్రొడ్యూసర్ సి.కల్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
టీజర్ అదుర్స్
దుష్ట శక్తుల నుంచి కాపాడే హనుమాన్, ఆయన ఆయుథం గదను పవర్ ఫుల్‌గా చూపించారు మేకర్స్. టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. పేరుకు తగ్గట్టుగానే హారర్, థ్రిల్లర్, డివోషనల్ అన్నీ అంశాలు కలగలిపి మూవీ ఉండనుందని అర్థమవుతోంది.
హనుమాన్‌లానే బిగ్ హిట్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు తనతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉందని... ఆ సినిమాను తానే ప్రారంభించానని ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ తెలిపారు. 'ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో... ఈ 'గదాధారి హనుమాన్' కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హనుమాన్‌ను నమ్ముకున్న వారంతా విజయం సాధిస్తారు. టీజర్ అద్భుతంగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.
'గదాధారి హనుమాన్' టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉందని... క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతోందని రాజ్ కందుకూరి అన్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఆడియన్స్ చాలా ఆదరిస్తారని... ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చెప్పారు. ఈ మూవీతో రవికిరణ్ సూపర్ స్టార్ అవుతారని అన్నారు.
Also Read: 'పెద్ది'లో గౌర్నాయుడిగా శివరాజ్ కుమార్ - ఫస్ట్ లుక్ వచ్చేసింది... గ్రామపెద్దగానా లేక కోచ్‌గానా...
భారీ స్థాయిలో...
హనుమాన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ మూవీని ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగినట్లు హీరో రవికిరణ్ తెలిపారు. 'క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మా చిత్రంలో మ్యూజిక్, బీజీఎం, విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నా. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. తారకాసుర చిత్రానికి కన్నడ, తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు కూడా ఈ సినిమాను అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే ఈ మూవీని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది.' అని అన్నారు.
చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో మూవీ అనుకున్నా... ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో 'గదాధారి హనుమాన్' తెరకెక్కించినట్లు డైరెక్టర్ రోహిత్ కొల్లి తెలిపారు. 'రవి కిరణ్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా పండించారు. హర్షిత చక్కగా నటించారు. రేణుకా ప్రసాద్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ ఫుల్ అన్న దానిపై ఓ సీక్వెన్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా కోసం వచ్చిన రాజ్ కందుకూరి గారికి, సి. కళ్యాణ్ గారికి, సముద్ర గారికి థాంక్స్. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.





















