Rashmika Mandanna : దేవరకొండ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళిన రష్మిక... కోడలిగా ఫిక్స్ అయిపోయారా?
Rashmika Mandanna with Deverakonda family: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా దేవరకొండ ఫ్యామిలీతో కలిసి 'పుష్ప 2' సినిమాకు వెళ్ళింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మధ్య రిలేషన్షిప్ నడుస్తోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరూ కలిసి చేసే పనులు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక మందన్న కలిసి సినిమాకు వెళ్లడం, అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న దేవరకొండ ఫ్యామిలీతో కలిసి 'పుష్ప 2' సినిమాను వీక్షించింది. హైదరాబాద్లోని ఏఎంబి మాల్ లో విజయ్ దేవరకొండ తల్లి, సోదరుడు ఆనంద్ దేవరకొండ తో పాటు రష్మిక మందన్న కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోని చూశాక దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక బాండింగ్ మరింతగా బలపడుతున్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి చాలాకాలంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న... దేవరకొండ ఫ్యామిలీతో కలిసి గత రెండేళ్ల నుంచి దీపావళి సెలబ్రేషన్స్ ను వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటుంది.
అంతేకాకుండా రీసెంట్ గా 'పుష్ప 2' ఈవెంట్లో తన రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చేసింది రష్మిక. 'మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతను ఇండస్ట్రీకి చెందిన వాడేనా ?' అని యాంకర్ ప్రశ్నించగా, 'అతను ఎవరో అందరికీ తెలుసు' అంటూ తెగ సిగ్గు పడిపోయింది. దీంతో రష్మిక మందన్న 'ప్రస్తుతం రౌడీ బాయ్ తో రిలేషన్షిప్ లో ఉన్నాను' అంటూ ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేసినట్టేనని ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఆమె థియేటర్లో ప్రత్యక్షమవడం చూస్తుంటే త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతోందని, రానున్న రోజుల్లో రష్మిక మందన్న దేవరకొండ ఫ్యామిలీ కోడలుగా మారడం దాదాపు ఖరారు అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా 'డేటింగ్ లో ఉన్నాను' అంటూ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా నిజంగానే విజయ్, రష్మిక డేటింగ్ లో ఉంటే, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఆ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటించబోతున్నారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు 'పుష్ప 2' సినిమాలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది. కేవలం యాక్టింగ్ పరంగానే కాదు డ్యాన్స్ పరంగా కూడా దుమ్మురేపింది.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?