అన్వేషించండి

Rashmika Mandanna: వామ్మో... రష్మిక భయపెట్టేసిందిగా - పాన్ ఇండియా మూవీ 'మైసా'... నేషనల్ క్రష్ లుక్ అదుర్స్

Mysaa Movie: నేషనల్ క్రష్ రష్మిక తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ లుక్‌తోనే భయపెట్టేశారు. ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా వారియర్‌గా ఆమె కనిపించనున్నారు.

Rashmika Mandanna Look Unveiled From Mysaa Movie: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన నెక్స్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం పోస్టర్ రిలీజ్ చేయగా సోలో వారియర్ లుక్‌లో ఆమె ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

నేషనల్ క్రష్... నెవర్ బిఫోర్...

ఈ మూవీకి 'మైసా' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేయగా... ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కొత్త లు‌క్‌లో రష్మిక భయపెట్టేశారు. చేతిలో కత్తితో భయంకరమైన అవతారంలో ఆమెను చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ముక్కు పుడక, ట్రెడిషనల్ శారీతో పాటు రక్తంతో కూడిన ముఖం ఆమె పవర్ ఫుల్‌గా కనిపించారు. 'ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు ఏమాత్రం కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు. భయపెట్టేందుకు...' అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తుండగా... రవీంద్ర పూలే దర్శకత్వం వహించనున్నారు. వుమెన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో సోలో వారియర్‌గా రష్మిక కనిపించనున్నారని ఫస్ట్ లుక్‌ను బట్టి అర్థమవుతోంది. దీంతో ఆమె రోల్ ఏమై ఉంటుందా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్‌తో నెవర్ బిఫోర్ అనేలా రష్మిక భయపెడుతుండగా ఆమె రోల్ ఏంటి? అనే దానిపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీతో హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పూలే దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. 

Also Read: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ ఎంట్రీకి అరుపులే... సర్‌ప్రైజ్ చేసిన విష్ణు మంచు... సోషల్ మీడియాలో సినిమా టాకేంటి?

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో...

గత రెండేళ్లుగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు రష్మిక. ఇటీవలే 'కుబేర'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె... ఇప్పుడు వుమెన్ ఓరియెంటెడ్ మూవీతో డిఫరెంట్‌గా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గోండు తెగలకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'మైసా'ను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ స్టోరీపై రెండేళ్లు వర్క్ చేసినట్లు తెలిపారు.

లైనప్ మార్చేశారుగా...

అప్పటి 'పుష్ప' నుంచి మొన్నటి 'కుబేర' వరకూ తన యాక్టింగ్‌తో మెప్పించారు నేషనల్ క్రష్. 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆమె నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు తాజాగా తన లైనప్ మార్చి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు. 'ది గర్ల్ ఫ్రెండ్', బాలీవుడ్ మూవీ 'థామా'తో రాబోతున్నారు. తాజాగా... 'మైసా' అనౌన్స్ చేశారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sara Khan On EID: బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
Peddi Massa Massa Song : ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్
ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్
Kattalan Review - 'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?
'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?
Ram Charan : పెద్ది గురించి అడిగిన ప్రధాని - మోదీ చెప్పిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీకి లింక్ ఏంటో చెప్పిన రామ్ చరణ్
పెద్ది గురించి అడిగిన ప్రధాని - మోదీ చెప్పిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీకి లింక్ ఏంటో చెప్పిన రామ్ చరణ్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
NTR Bharat Ratna resolution Mahanadu 2026: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
Sara Khan On EID: బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
Hyderabad land auction Rayadurgam 2026: హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
Jagan PA KNR liquor scam investigation: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?
ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?
Why Hot Water Freezes Faster:వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
Tips To Happy Marriage : మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
Anasuya: షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ
షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ
Embed widget