Kannappa Director: అసలు ఎవరీ ముకేష్ కుమార్ సింగ్ - బాలీవుడ్ To టాలీవుడ్.. 'కన్నప్ప' డైరెక్టర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Mukesh Kumar Singh: 'కన్నప్ప' డైరెక్టర్ ఎవరని ఎవరైనా అడిగితే సడన్‌గా ఎవరూ చెప్పలేరు. అసలు ఎవరీ ముకేష్ కుమార్ సింగ్? ఈయన బ్యాగ్రౌండ్ ఏంటి? అనేది ఓసారి చూస్తే..

Kannappa Director Mukesh Kumar Singh Background: 'కన్నప్ప'... ప్రస్తుతం ఈ పేరు ట్రెండింగ్‌గా మారింది. విష్ణు మంచు హీరోగా నటించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రారంభం నాటి నుంచి ప్రమోషన్స్ వరకూ విష్ణు అన్నీ తానై నడిపించారు. పలు ఇంటర్వ్యూల్లోనూ 'కన్నప్ప' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అయితే.. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్ అంటే డైరెక్టర్ హడావిడి మామూలుగా ఉండదు. కానీ, 'కన్నప్ప' విషయంలో ఇంతకు ముందు ఈవెంట్స్‌లో డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ అంతగా కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం కనిపించి చిత్ర విశేషాలను పంచుకున్నారు. 'కన్నప్ప' ప్రమోషన్లలో విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్ పేర్లు తప్ప డైరెక్టర్ ముకేష్ పేరు వినిపించలేదు. అసలు.. ఎవరీ ముకేష్ కుమార్ సింగ్? దర్శకుడిగా ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ కాగా... ఆయనకు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? అనేది ఓసారి చూస్తే..
సీరియల్స్ To మూవీస్
ముకేష్ కుమార్ సింగ్ బాలీవుడ్ హిందీ సీరియల్స్ డైరెక్టర్. ఇప్పటివరకూ సీరియల్స్ అవి కూడా హై బడ్జెట్ ప్రాజెక్టులే తీశారు. 2012లో వచ్చిన 'రామాయణ్', 2013లో వచ్చిన 'మహాభారత్' సీరియల్స్‌లో కొన్ని ఎపిసోడ్స్‌కు ఆయన దర్శకత్వం వహించారు. 2008 నుంచి టీవి ఇండస్ట్రీలో ఉన్నా.. కేవలం సీరియల్స్ మాత్రమే డైరెక్ట్ చేయడంతో ఈయన పేరు అంతగా ఎవరికీ తెలియలేదు. తెనాలి రామ, మేరే సాయి వంటి భక్తి రస సీరియల్స్ కూడా తీశారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇంగ్లిష్ చిత్రాలు నిర్మించారు.
మోహన్ బాబు రిఫరెన్స్‌తో
నిజానికి 'మహాభారత్' సీరియల్ చూసిన మోహన్ బాబు.. విష్ణుకు ముకేష్ కుమార్ సింగ్ పేరు రిఫర్ చేశారట. విష్ణు ఓసారి కాల్ చేయగా.. వచ్చి మోహన్ బాబుతో చర్చలు జరిపారు. 'కన్నప్ప' స్టోరీ విన్న తర్వాత మహా భక్తుడి గురించి రీసెర్చ్ చేశారు. పీరియాడికల్స్, భక్తి రస సీరియల్స్, హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ తీయగల అపార అనుభవం సొంతం కావడంతో ఆయన్ను మంచు విష్ణు ఫైనల్ చేశారు.
'కన్నప్ప' కోసం మూవీ టీం పడిన శ్రమ, వీఎఫ్ఎక్స్ పనితనం అన్నీ ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. ఒక్కో రోల్ పవర్ ఫుల్‌గా.. అందరి పాత్రలను పరిచయం చేస్తూ.. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ వర్క్‌తో చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తిన్నడిగా విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు అదరగొట్టారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలకు మూవీ చూపించగా అదిరిపోయిందంటూ రివ్యూ ఇచ్చారు. ముకేష్ కుమార్ పనితనం కూడా ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది.
గ్రేట్ ఎక్స్‌పీరియన్స్
'కన్నప్ప' కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారని... మోహన్ బాబు, ప్రభాస్, విష్ణు, మోహన్ లాల్, బ్రహ్మానందం ఇలా అందరితో పని చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని ముకేష్ కుమార్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు. చివరి గంట అద్భుతంగా ఉంటుందని... విష్ణు వంద శాతం న్యాయం చేశారని ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ రోల్ పవర్ ఫుల్‌గా ఉంటుందన్నారు.
'కన్నప్ప' మూవీని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించగా.. మంచు విష్ణు తిన్నడిగా నటించారు. ఆయన సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















