అన్వేషించండి

Viraatapalem Web Series - జీ5 ఓటీటీలో 'విరాటపాలెం' వెబ్ సిరీస్: టోటల్ ఎపిసోడ్స్, రన్‌టైమ్ నుంచి స్టోరీ కాన్సెప్ట్‌, ఆర్టిస్టులు వరకు - ఈ డీటెయిల్స్‌ తెలుసా?

Viraatapalem Web Series Streaming: 'జీ5' ఓటీటీలోకి గురువారం మిడ్ నైట్ (జూన్ 27వ తేదీ) నుంచి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'. ఇందులో ఎపిసోడ్స్ ఎన్ని? రన్ టైమ్ ఎంత?

Abhignya Vuthaluru and Charan Lakkaraju's'Viraatapalem PC Meena Reporting' web series streaming on Zee5 OTT: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులర్ అయిన అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'. జీ5 ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ ఇది. ఇందులో చరణ్ లక్కరాజు హీరో. గురువారం మిడ్ నైట్ 12 గంటలు (జూన్ 27వ తేదీ) నుంచి స్ట్రీమింగ్ కానుంది. అభిజ్ఞ, చరణ్ కాకుండా ఇందులో నటించిన ఆర్టిస్టులు ఎవరు? టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? రన్ టైమ్ ఎంత? అనేది చూస్తే...
 
'విరాటపాలెం'లో ఏడు ఎపిసోడ్స్!
How Many Episodes In Viraatapalem Web Series?: 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ రన్ టైమ్ 30 నిమిషాల కంటే తక్కువ. సో, టోటల్ రన్ టైమ్ మూడు గంటల లోపే ఉంటుంది. థియేటర్లకు వెళ్లి సినిమా చూసి వచ్చే సమయం కంటే ఇంట్లో కూర్చుని 'జీ5' ఓపెన్ చేసి 'విరాటపాలెం' వెబ్ సిరీస్ చూసే టైమ్ తక్కువ.

'విరాటపాలెం' కథ - కాన్సెప్ట్ ఏమిటి?
What is the story of Viraatapalem series?: 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్' ఓ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. కథ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో, 80లలో ఒక మారుమూల పల్లె విరాటపాలెంలో ప్రజలు తమ గ్రామానికి శాపం ఉందని చాలా బలంగా నమ్ముతారు. ఎవరు పెళ్లి చేసుకున్నా సరే... మరుసటి రోజు పెళ్లి కుమార్తె రక్తం కక్కుకుని మరణిస్తుంది. దాంతో పదేళ్ల పాటు ఆ ఊరిలో పెళ్లి అనేది జరగదు. అటువంటి ఊరికి లేడీ కానిస్టేబుల్‌ మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది. విరాటపాలెం గ్రామంలో ప్రజల మూఢ నమ్మకాలు తప్పని నిరూపించడానికి, ఆ ఊరిలో రహస్యాలను వెలికి తీయడానికి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పటివరకు సంభవించిన పెళ్లి కుమార్తెల మరణాల వెనుక ఎవరు ఉన్నారు? చివరకు ఏమైంది? అనేది సిరీస్.

Also Read: పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో

'విరాటపాలెం'లో ఎవరెవరు నటించారు?
ఈ సిరీస్ తీసిన దర్శక నిర్మాతలు ఎవరు?
'జీ5'లో స్ట్రీమింగ్ అవుతున్న 'రెక్కీ' వెబ్ సిరీస్ చూశారా? అది తీసిన పోలూరు కృష్ణ ఈ 'విరాటపాలెం' వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఆ సిరీస్ ప్రొడక్షన్ హౌస్ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ పతాకం మీద శ్రీరామ్ ఈ సిరీస్‌ను కూడా నిర్మించారు. 

Zee5 Web Seires Viraatapalem Cast And Crew: అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు మెయిన్ లీడ్ రోల్స్ చేసిన 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'లో లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్  ఇతర ప్రధాన తారాగణం. ఈ సిరీస్‌కు కథ: దివ్య తేజస్వి పెరా, స్క్రీన్‌ ప్లే: విక్రమ్ కుమార్ కండిమల్ల, కెమెరా: మహేష్ కె స్వరూప్, ఎడిటింగ్: ఫరూఖ్ హుండేకర్, నేపథ్య సంగీతం: రోహిత్ కుమార్.

Also Readఎవరీ ప్రీతి ముకుందన్? 'కన్నప్ప'లో విష్ణు మంచు జంటగా నటించిన హీరోయిన్ బ్యాగ్రౌండ్, కెరీర్ తెల్సా?

Input By : https://telugu.abplive.com/entertainment/cinema/kannappa-first-review-how-is-vishnu-manchu-mohan-lal-akshay-kumar-kajal-aggarwal-movie-211784
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
High Blood Sugar : రక్తంలో షుగర్ ఎక్కువగా ఉందా? 7 రోజుల్లో ఇలా కంట్రోల్ చేయండి
రక్తంలో షుగర్ ఎక్కువగా ఉందా? 7 రోజుల్లో ఇలా కంట్రోల్ చేయండి

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
High Blood Sugar : రక్తంలో షుగర్ ఎక్కువగా ఉందా? 7 రోజుల్లో ఇలా కంట్రోల్ చేయండి
రక్తంలో షుగర్ ఎక్కువగా ఉందా? 7 రోజుల్లో ఇలా కంట్రోల్ చేయండి
The Raja Saab Ticket Rates : తెలంగాణలో 'ది రాజా సాబ్' టికెట్ బుకింగ్స్ షురూ - రేట్స్ ఎంతో తెలుసా?
తెలంగాణలో 'ది రాజా సాబ్' టికెట్ బుకింగ్స్ షురూ - రేట్స్ ఎంతో తెలుసా?
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Embed widget