By: ABP Desam | Updated at : 04 Mar 2022 03:06 PM (IST)
రానా, సూర్య
తెలుగు సినిమా ప్రేక్షకుల్లో సూర్యకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిలో హీరోలు కూడా ఉన్నారు. ఆ హీరోల్లో పాన్ ఇండియా యాక్టర్ రానా దగ్గుబాటి ఒకరు. సూర్య నటించిన తాజా సినిమా 'ఇటి' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అతిథిగా విచ్చేసిన రానా ఈ విషయం చెప్పారు.
'పితామహగన్' సినిమా చూసినప్పటి తనకు సూర్య పేరు కూడా తెలియదని, అప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్ అని రానా దగ్గుబాటి తెలిపారు. అయితే... ఆయనకు సూర్య ఎందుకు క్లాస్ పీకారు? అంటే, ప్రేమతోనే అని చెప్పాలి. 'పితామహగన్' విడుదలైన ఎన్నో సంవత్సరాల తర్వాత సూర్యకు పరిచయం అయ్యానని, తామిద్దరం కలిశానని రానా చెప్పుకొచ్చారు. సూర్య తనకు వెరీ క్లోజ్ అని తెలిపారు.
"సూర్య గారు నాకు ఎంత క్లోజ్ అంటే... పదేళ్ళ క్రితం అనుకుంట! నా సినిమా ఒకటి ఎడిటింగ్ రూమ్ లో చూశారు. నన్ను ఒక కారులో ఎక్కించుకుని, మూడు నాలుగు గంటలు హైదరాబాద్ మొత్తం తిప్పి 'ఒరేయ్! నువ్ చేసేది యాక్టింగ్ కాదు. ఏదో సర్దేస్తున్నావ్' అని చెప్పారు. ఆ నాలుగు గంటలు సూర్య పీకిన క్లాస్ నన్ను భల్లాలదేవుడిని చేసింది. డేనియల్ శేఖర్ చేసింది. ఆయన మాటలు ఎప్పుడూ విలువైనవి" అని రానా తెలిపారు. రానాను చూస్తే తనకు గర్వంగా ఉందని సూర్య తెలిపారు.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?
'ఇటి' ఒక యాక్షన్ థ్రిల్లర్. ఎవరికీ తలవంచడు... అనేది కాప్షన్. పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రై.లి. విడుదల చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read: 'సెబాస్టియన్ పీసీ 524' రివ్యూ: సెబాగా కిరణ్ అబ్బవరం కామెడీ బావుంది కానీ
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ