Ram Charan: మళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!
Ram Charan Tag: 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ తర్వాత 'రామ్ చరణ్'ను గ్లోబల్ స్టార్ అనడం మొదలుపెట్టారు. ఆయనకు కొత్త ట్యాగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అది తీసేసి మళ్ళీ 'మెగా పవర్ స్టార్' ట్యాగ్‌కు వచ్చేశారు.

రామ్ చరణ్ ట్యాగ్ మరోసారి మారింది. కొత్త ట్యాగ్ 'గ్లోబల్ స్టార్' అనేది వదిలేసి... మళ్ళీ పాత ట్యాగ్ 'మెగా పవర్ స్టార్'కు వెళ్లారు. బహుశా... రీసెంట్ ఫ్లాప్, అలాగే హిట్ సెంటిమెంట్ ప్రకారం మార్పు జరిగిందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళితే...
తండ్రి, బాబాయ్ ట్యాగ్స్ గుర్తు చేసేలా!
''తండ్రి (చిరంజీవి) మెగాస్టార్, బాబాయ్ (పవన్ కళ్యాణ్) పవర్ స్టార్... మనోడు మెగా పవర్ స్టార్'' - కొన్నేళ్ల క్రితం జరిగిన 'ధృవ' ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ (Ram Charan) గురించి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చెప్పిన మాట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ట్యాగ్స్ ఇవ్వడం కామన్. అందులోనూ వారసులుగా వచ్చిన హీరోలకు అయితే తండ్రి, తాతయ్యల ట్యాగ్స్ కలిసి వచ్చేలా కొత్త ట్యాగ్ క్రియేట్ చేస్తారు. అలాగే, రామ్ చరణ్‌కు 'మెగా పవర్ స్టార్' అని ఇచ్చారు ఫ్యాన్స్ & ఇండస్ట్రీ సెలబ్రిటీలు.
చిరంజీవి మెగాస్టార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కావడంతో... కొణిదెల ఫ్యామిలీలో తండ్రి, బాబాయ్ వారసత్వం కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన అబ్బాయి (రామ్ చరణ్)కు మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఇచ్చారు.
'ఆర్ఆర్ఆర్' సక్సెస్ తర్వాత గ్లోబల్ స్టార్!
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' వరకు రామ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మెగా పవర్ స్టార్ అని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు చెప్పేవారు. అయితే 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ తర్వాత చరణ్ ట్యాగ్ మారింది. గ్లోబల్ స్టార్ అనడం మొదలు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు వచ్చిన గుర్తింపు నేపథ్యంలో కొత్త ట్యాగ్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ట్యాగ్ వదిలేసి 'మెగా పవర్ స్టార్'కు వచ్చారు రామ్ చరణ్.
ఇండస్ట్రీలోకి రామ్ చరణ్ ప్రవేశించి 18 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో 'పెద్ది' టీమ్ తమ హీరోకి శుభాకాంక్షలు చెబుతూ ఓ స్టిల్ రిలీజ్ చేసింది. అందులో 'మెగా పవర్ స్టార్ రామ్ చరణ్' అని పేర్కొన్నారు. సో... గ్లోబల్ స్టార్ వదిలేసినట్టే అనుకోవాలి. 'గేమ్ ఛేంజర్' పోస్టర్లకు, 'పెద్ది' స్టార్టింగ్ పోస్టర్ & లేటెస్ట్ పోస్టర్ మీద ఆ డిఫరెన్స్ చూడొచ్చు.

'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ ఎఫెక్ట్ చూపించిందా?
రామ్ చరణ్ ట్యాగ్ మారడం వెనుక, గ్లోబల్ స్టార్ నుంచి మళ్ళీ 'మెగా పవర్ స్టార్'కు రావడం వెనుక 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ ఎఫెక్ట్ ఉన్నట్టు ఇండస్ట్రీ గుసగుస. ఆ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. విజయం సాధించలేదు. ఆ సినిమాపై విమర్శలు ఎక్కువ వచ్చాయి. ఫలితం పక్కన పెడితే సెంటిమెంట్ ప్రకారం మళ్ళీ 'మెగా పవర్ స్టార్'కు ఓటు వేశారట. సో... ఫ్యాన్స్ కూడా 'గ్లోబల్ స్టార్' కంటే 'మెగా పవర్ స్టార్' బావుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారట.
Also Read: 'హోమ్ బౌండ్' రివ్యూ: ఆస్కార్ 2026కు ఇండియా అఫీషియల్ ఎంట్రీ... జాన్వీ కపూర్ సినిమా ఎలా ఉందంటే?





















