అన్వేషించండి

Hridayapoorvam Review Telugu - 'హృదయపూర్వం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో మోహన్ లాల్ - The Raja Saab హీరోయిన్ మాళవిక సినిమా

OTT Review - Hridayapoorvam On JioHotstar: మోహన్ లాల్ 'హృదయపూర్వం' జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్ ప్రధాన తారాగణం. ఈ సినిమా ఎలా ఉందంటే

సినిమా రివ్యూ: 'హృదయపూర్వం'
నటీనటులు: మోహన్ లాల్, మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్, సిద్ధిఖీ, లాలూ అలెక్స్ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో బసిల్ జోసెఫ్, మీరా జాస్మిన్, ఆంటోనీ పెరంబూర్. 
సినిమాటోగ్రఫీ: అను మూతెదత్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
నిర్మాత: ఆంటోనీ పెరంబూర్
దర్శకత్వం: సత్యన్ అంతికాద్
ఓటీటీ వేదిక: జియో హాట్‌స్టార్

Mohanlal's Hridayapoorvam Review In Telugu: మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళ సినిమా 'హృదయపూర్వం'. ప్రభాస్ 'ది రాజా సాబ్' హీరోయిన్ మాళవికా మోహనన్ నటించారు. 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్ ఇతర ప్రధాన తారాగణం. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సెప్టెంబర్‌ 26 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

కథ (Hridayapoorvam Story): కొచ్చిలోని సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్)కు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరుగుతుంది. ఆ గుండె పూణేలోని యాక్సిడెంట్‌కు గురైన కల్నల్ రవీంద్రది. తన నిశ్చితార్థానికి రావాల్సిందిగా కల్నల్ కూతురు హరిత (మాళవికా మోహనన్) నుంచి సందీప్ బాలకృష్ణన్‌కు ఫోన్ వస్తుంది. తొలుత పూణే వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసినప్పటికీ... చివరకు వెళతాడు.

నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు దాన్ని హరిత క్యాన్సిల్ చేసుకోవడంతో జరిగిన గొడవలో సందీప్ బాలకృష్ణన్ వెన్నెముకకు గాయం అవుతోంది. దాంతో రెండు వారాలు పూణేలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు కల్నల్ కూతురు హరిత, కల్నల్ భార్య దేవిక (సంగీత మాధవన్ నాయర్), సందీప్ బాలకృష్ణన్ మధ్య ఏం జరిగింది? ఎవరెవరి మధ్య ఎటువంటి అనుబంధం చిగురించింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (Hridayapoorvam Telugu Review): ప్రేమకు వయసుతో సంబంధం లేదు - ఈ పాయింట్ బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చాయి. ఇటీవల నారా రోహిత్ 'సుందరకాండ' వచ్చింది. అందులో తన కంటే వయసులో చిన్నదైన అమ్మాయితో ప్రేమలో పడతాడు హీరో. కట్ చేస్తే... గతంలో తల్లిని ప్రేమించి ఉంటాడు. చివరకు ఎవరిని ప్రేమను గెలిచాడు? అనేది కథ. 'హృదయపూర్వం'లో ఆ ఛాయలు కాస్త కనపడతాయి. హీరో (మోహన్ లాల్)పై కుమార్తె (మాళవికా మోహనన్)తో పాటు తల్లి (సంగీత మాధవన్ నాయర్) కూడా ప్రేమిస్తుందా? అనే సందేహం కలిగేలా కథను నడిపాడు దర్శకుడు. అయితే... 'సుందరకాండ' కంటే 'హృదయపూర్వం'లో కింగ్ అక్కినేని నాగార్జున, శ్రీకాంత్, సౌందర్యల 'నిన్నే ప్రేమిస్తా' ఎక్కువ గుర్తుకు వస్తుంది.

'నిన్నే ప్రేమిస్తా'లో నాగార్జున ఆర్మీ ఆఫీసర్. ప్రమాదంలో మరణించిన అతని కళ్ళు దానం చేయడం ద్వారా చూపు కోల్పోయిన శ్రీకాంత్‌కు చూపు వచ్చేలా చేస్తారు. ఆ కళ్ళు చూసి నాగార్జునను పెళ్లి చేసుకోవాల్సిన సౌందర్య మురిసిపోతే ప్రేమ అని ఫీల్ అవుతారు శ్రీకాంత్. అక్కడ కళ్ళు అయితే... 'హృదయపూర్వం'లో గుండె. ఇక మిగతా కథంతా సేమ్ టు సేమ్ అన్నట్టు... తండ్రి గుండె అమర్చిన వ్యక్తిని చూసి కుమార్తె, భర్త గుండె అమర్చిన మనిషిని చూసి భార్య అభిమానం, అనురాగం చూపిస్తారు. తెలుగు ప్రేక్షకులకు 'హృదయపూర్వం' కథ తెలిసినట్టే ఉంటుంది.

Hridayapoorvam Review Telugu - 'హృదయపూర్వం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో మోహన్ లాల్ - The Raja Saab హీరోయిన్ మాళవిక సినిమా

ఓ సాధారణ కథకు మోహన్ లాల్ స్క్రీన్ ప్రజెన్స్ యాడ్ కావడంతో మన కళ్ళకు కాస్త కొత్తగా కనిపిస్తుంది 'హృదయపూర్వం'. మోహన్ లాల్ - మాళవిక, మోహన్ లాల్ - సంగీత మాధవన్ నాయర్ మధ్య సన్నివేశాల్లో దర్శక రచయితలు గీత దాటలేదు. ప్రతి సన్నివేశాన్ని హుందాగా రాశారు. అయితే సరైన ముగింపు ఇవ్వడంలో సక్సెస్ కాలేదు. ఎండింగ్ వచ్చేసరికి భావోద్వేగాలను లోతుగా ఆవిష్కరించకుండా పైపైన తేల్చేశారు. నిదానంగా సాగిన సినిమాలో వినోదం రిలీఫ్ ఇచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ నీట్‌గా, క్లాసీగా ఉంది. కెమెరా వర్క్, మ్యూజిక్ ఒక ప్లజెంట్ ఫీల్ ఇచ్చాయి. మరీ నిదానంగా సాగిన కథ, కథనాలు బోర్ కొట్టిస్తాయి.

Also Read: 'హోమ్ బౌండ్' రివ్యూ: ఆస్కార్ 2026కు ఇండియా అఫీషియల్ ఎంట్రీ... జాన్వీ కపూర్ సినిమా ఎలా ఉందంటే?

సందీప్ బాలకృష్ణన్ పాత్రలో మోహన్ లాల్ రిలాక్స్డ్‌గా నటించారు. ఆయన పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. సింపుల్ రోల్‌లో చక్కగా వినోదం పండించారు. ఈ కథలో మాళవికా మోహనన్‌ది హీరోయిన్ రోల్ అని చెప్పలేం. అలాగని కాదని కూడా అనలేం. కొత్త తరహా కథలో కూల్‌గా కనిపించారు. మోడ్రన్ అమ్మాయిగా డ్రస్సింగ్ బావుంది. మోహన్ లాల్ పక్కన మరీ యంగ్‌గా కనిపించకూడదని మేకప్ పరంగా కాస్త పెద్దగా కనిపించే ప్రయత్నం చేశారు. ఆమె తల్లిగా సంగీత మాధవన్ నాయర్ నటన బావుంది. మోహన్ లాల్ సహాయకుడిగా నర్స్ పాత్రలో సంగీత్ ప్రతాప్ కొంత నవ్వించారు. ఓ సన్నివేశంలో బసిల్ జోసెఫ్ నవ్వించారు. చివరిలో మీరా జాస్మిన్ తళుక్కున మెరిశారు. మిగతా నటీనటులు ఓకే.

'హృదయపూర్వం' మిగతా సినిమాలకు భిన్నంగా ఉంటుంది. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే కథ, కథనాలకు భిన్నంగా సాగుతుంది. నాగార్జున 'నిన్నే ప్రేమిస్తా', నారా రోహిత్ రీసెంట్ సినిమా 'సుందరకాండ' ఛాయలు కనిపిస్తాయి. అందువల్ల తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే అవకాశాలు తక్కువ. రొటీన్‌గా సాగే మోహన్ లాల్, మాళవికా మోహనన్, సంగీత మాధవన్ నాయర్, సంగీత్ ప్రతాప్ పెర్ఫార్మన్స్‌ - వినోదం కాస్త రిలీఫ్ ఇచ్చాయి. మోహన్‌ లాల్ అభిమానులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా స్ట్రీమింగ్ చేస్తే... ఓటీటీ కాబట్టి నిదానంగా ఫార్వర్డ్‌ చేసుకుంటూ చూడొచ్చు. లేదంటే బోర్ కొడుతుంది.  

Also Readదక్ష రివ్యూ: సన్నాఫ్ ఇండియా దర్శకుడి కథతో... మోహన్ బాబు - లక్ష్మీ మంచు సినిమా... మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons OTT : టాప్ ట్రెండింగ్‌లో విశ్వనాథ్ అండ్ సన్స్ - సూర్య కొత్త మూవీ ఎందులో చూడొచ్చంటే?
టాప్ ట్రెండింగ్‌లో విశ్వనాథ్ అండ్ సన్స్ - సూర్య కొత్త మూవీ ఎందులో చూడొచ్చంటే?
Hanuman Ansh Telugu Release Date : సాధారణ బాలుడి ప్రయాణం... మదర్ To గాడ్ - అసలేంటీ హనుమాన్ అంశ్ స్టోరీ?... త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో...
సాధారణ బాలుడి ప్రయాణం... మదర్ To గాడ్ - అసలేంటీ హనుమాన్ అంశ్ స్టోరీ?... త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో...
Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Rithu Chowdary: తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Shobha Shetty: రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
Rithu Chowdary: తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Embed widget