Raakaasaa Glimpse : హారర్ To కామెడీ... 'రాకాస' ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది - సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ వేరే లెవల్
Raakaasaa Movie Glimpse : సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ 'రాకాస'. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

Sangeeth Sobhan's Raakaasaa Movie First Glimpse Out : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఫస్ట్ టైం సోలో హీరోగా నటిస్తోన్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ 'రాకాస'. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఇంట్రెస్టింగ్‌గా గ్లింప్స్
'యుగ యుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు. ఆ వీరుడు ఎవరో తెలిసే లోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు. ఈ కథలో ఆ వీరుడు నేనే' అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ గ్లింప్స్ సాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా కామెడీ, సెటైరికల్ టర్న్ ఇస్తూ ఇంట్రెస్టింగ్‌గా మారింది. చుట్టూ వలల్లో పుర్రెలు మధ్యలో వలలో మన హీరో... 'ఇప్పుడే వచ్చాను కదరా... అప్పుడు పైకి లేపేశారేంట్రా' అంటూ సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్ డైలాగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పూయించనున్నట్లు గ్లింప్స్‌తోనే చెప్పకనే చెప్పేశారు. ఏప్రిల్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'కమిటీ కుర్రోళ్లు' మూవీని నిర్మించి జాతీయ స్థాయిలో నిర్మాతగా పాపులర్ అయిన మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మిస్తున్నారు. 'రాకాస'తో ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త కథతోనే మరో ప్రయోగం చేస్తున్నట్టుగా ఈ గ్లింప్స్ చెబుతోంది. ఇందులో సంగీత్ శోభన్ తనలోని మరో కోణాన్ని చూపించేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కామెడీనే ప్రధాన బలం కాగా... దీంతో పాటుగా ఓ కొత్త పాయింట్‌ను, కొత్త దనాన్ని చూపించేలా కనిపిస్తోంది. అనుదీప్ దేవ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read : థియేటర్లలో ఇవాళే రిలీజ్... మరి ఓటీటీలో ఎప్పుడు? సన్నీ డియోల్ 'బోర్డర్ 2' స్ట్రీమింగ్ ఎందులోనంటే?
'రాకాస' నటీనటులు - సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ అమ్మ, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (బజర్దస్త్), రోహన్ (నైంటీస్) తదితరులు;
టెక్నికల్ టీం - బ్యానర్స్ : జీ స్టూడియోస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ l నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ l కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : మానస శర్మ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మన్యం రమేష్ l ఆడిషన్ స్క్రీన్ ప్లే : మహేష్ ఉప్పాల l సంగీతం : అనుదీప్ దేవ్ l సినిమాటోగ్రాఫర్ : రాజు ఎదురోలు l యాక్షన్ కొరియోగ్రాఫర్ : విజయ్ l ఎడిటర్ : అన్వర్ అలీ l ప్రొడక్షన్ డిజైనర్ : రామాంజనేయులు l ఆర్ట్ డైరెక్టర్ : పుల్ల విష్ణు వర్ధన్ l కాస్ట్యూమ్ డిజైనర్ : సంధ్య సబ్బవరపు l పి.ఆర్.ఒ : ఎస్.కె.నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌నర్: యు వుయ్ మీడియా l మార్కెటింగ్ : టికెట్ ఫ్యాక్టరీ.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















