Sukumar: బన్నీ కోసం ఏమైనా చేస్తా... మరో మూడేళ్లు ఇస్తే Pushpa 3 తీయడానికి రెడీ - సుకుమార్ ఎమోషనల్ స్పీచ్
‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో ఒక్కటి తగ్గింది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్ ఈవెంట్‌లో ఆ ఒక్కటీ అల్లు అర్జున్‌ని ఏడిపించేసింది. సుక్కు తన స్పీచ్‌తో బన్నీని ఏడిపించేశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2) సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను ఖాతాలో వేసుకుంటూ... హిస్టరీ క్రియేట్ చేసే దిశగా నడుస్తోంది. మరో వైపు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో నిర్వహిస్తూ వస్తున్నారు. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై... ఇలా వరుస ఈవెంట్స్‌తో సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లే పనిలో ఉన్న టీమ్.. సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. అయితే హైదరాబాద్ మినహా.. అన్ని చోట్ల ఈ ఈవెంట్స్‌లో ఒక్కటి తగ్గుతూ వస్తుంది. ఏంటది అనుకుంటున్నారా? ఈ చిత్ర డైరెక్టర్ స్పీచ్. కానీ హైదరాబాద్ ఈవెంట్‌లో మాత్రం ఆ ఒక్కటి కూడా తగ్గకుండా చూసుకున్నారు. అసలీ సినిమా గురించి సుకుమార్ ఏం చెబుతాడో అని ప్రమోషన్స్ మొదలైనప్పటి నుండి అంతా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరి కోసం హైదరాబాద్ ఈవెంట్‌లో సుకుమార్ సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ..
‘‘బన్నీని ‘ఆర్య’ సినిమా దగ్గర నుండి.. తను ఎలా ఎదుగుతున్నాడనేది చూస్తూ వస్తున్నాను. తనని వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా చాలా దగ్గరుండి చూస్తూ వచ్చాను. బన్నీ గురించి స్పెషల్‌గా చెప్పాలంటే.. ఈ పుష్ప పార్ట్ 1, పార్ట్2 సినిమాలు ఇలా వచ్చాయంటే.. ఇది కేవలం బన్నీ మీద ఉన్న ప్రేమ మాత్రమే. మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉంటుందీ అంటే ఎక్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అన్నట్లుగా ఉంటుంది. సీన్ కోసమో, ఫైట్ కోసమో కాదు.. ఒక ఎక్స్‌ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఒక ఐ బాల్ లేపాలనో, ఒక లిప్ మూవ్ చేయాలనో.. ఇలా ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్ కోసం తను పడే తపన చూస్తే.. నాకు ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేస్తుంది. బన్నీ డార్లింగ్.. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం నీ మీద ప్రేమ తప్ప వేరే ఏమీ లేదు. నిజం చెప్పాలంటే.. నీతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర కథ లేదు. పుష్ప గురించి చెప్పినప్పుడు జస్ట్ రెండు మూడు సీన్లు చెప్పాను అంతే. నా దగ్గర ఆ టైమ్‌కి పూర్తి కథ లేదు. కానీ నువ్వు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేయడం, సీన్ కోసం నువ్వు పడే తపన, ఇచ్చిన ఎనర్జీ చూస్తే.. ఈ మనిషి కోసం ఏమైనా చేసేయవచ్చనిపించింది. సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే.. ప్రతి ఒక్కడికీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాకు పనిచేసే ప్రతి ఒక్కరికీ ఒక హైట్‌లో పెద్ద ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాడు తను. అందరం ఆ హైట్‌లోకి ఎక్కే వర్క్ చేయాలి. అలా వర్క్ చేయించడం వల్ల వచ్చిన సినిమాలే ‘పుష్ప 1’, ‘పుష్ప 2’. మొన్న టీజర్‌లోని సీన్‌తో ప్రేక్షకులను కూడా అంతే హైట్‌లో పెట్టేశాడు. లవ్ యు బన్నీ. నీ మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమతో వచ్చిన పదాలివి.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
ఇంతలో ఆడియెన్స్ ‘పుష్ప 3’ అని అరవడంతో దానిపై స్పందిస్తూ... ‘‘పుష్ప 3.. ఆల్మోస్ట్ మీ హీరోని 3 ఇయర్స్ కష్టపెట్టాను. ఒక వ్యక్తి లైఫ్‌లో నుండి 3 సంవత్సరాలు తీసేసుకున్నానంటే.. మీరు మీ హీరోని అడగండి.. తర్వాత నేను నా ఫ్రెండ్‌ని అడుగుతా. నా కోసం ఇంకో 3 ఇయర్స్ ఇవ్వగలవా? అని. సారీ బన్నీ.. నీ ప్రైమ్ టైమ్ అంతా లాగేసుకున్నందుకు. మైత్రీ నిర్మాతలు వెళుతున్న తీరు చాలా బాగుంది. మేము మ్యాచ్ ఆడేందుకు వాళ్లు ఎలాంటి గ్రౌండ్‌ని అయినా సెట్ చేస్తున్నారు. చెర్రీ వల్లే ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదలవుతుంది. శ్రీవల్లి రష్మిక విషయానికి వస్తే.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూస్తూ అలా ఉండిపోయేవాడిని. చాలా మంచి ఎక్స్‌ప్రెషన్స్. ఆమె నటించిన ‘ద గర్ల్ ఫ్రెండ్’ టీజర్ కూడా చూశా. అందులో మొత్తం రష్మిక క్లోజప్ షాట్సే రాహుల్ తీసుకున్నాడు. ఆ టీజర్ కూడా చాలా బాగుంది. శ్రీలీలని చూస్తే ముచ్చటేస్తుంది. ఈ కాలంలో కూడా తెలుగు ఇంత చక్కగా మాట్లాడే అమ్మాయిలు ఉన్నారా? అని ఆశ్చర్యమేస్తుంది. మెసేజెస్ కూడా చక్కగా తెలుగులోనే పెడుతుంది. శ్రీలీలకు మంచి ఫ్యూచర్ ఉంది. దేవిశ్రీ.. మా బంధం అలా కొనసాగుతుంది. నన్ను ప్రేమించే వారితోనే నేను ఎక్కువగా పనిచేయగలను. దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. థ్యాంక్యూ దేవి. డిఓపీ, ఎడిటర్, ప్రొడక్షన్ మ్యానేజర్.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వారందరికీ థ్యాంక్యూ సో మచ్. అందరి గురించి మరో వేడుకలో మాట్లాడతాను’’ అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?