అన్వేషించండి

Puri Jagannadh: ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు

Azaz Khan On Puri Jagannadh: హీరోయిన్ నుంచి నిర్మాతగా మారిన ఛార్మి కౌర్ కంట్రోల్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ ఉన్నాయని, ఆవిడ వల్ల ఆయన కెరీర్ అంతా నాశనమైందని అజాజ్ ఖాన్ పేర్కొన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పూరి కెరీర్ పతనానికి ఛార్మి కౌర్ కారణమని నటుడు అజాజ్ ఖాన్ అన్నారు.
  • భార్యాబిడ్డలను వదిలేయడం దక్షిణాది ప్రేక్షకులకు నచ్చదని అజాజ్ ఖాన్ తెలిపారు.
  • ఛార్మి కౌర్ పూరిని నియంత్రించి, అతని సన్నిహితులను దూరం చేసిందని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌కు 'బద్రి', మహేష్ బాబుకు 'పోకిరి' & 'బిజినెస్‌మ్యాన్', అల్లు అర్జున్‌కు 'దేశముదురు' & 'ఇద్దరమ్మాయిలతో', రవితేజకు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' & 'ఇడియట్', ఎన్టీఆర్‌కు 'టెంపర్'... చెబుతూ వెళితే బోలెడు సినిమాలు. హీరోలు అందరికీ దర్శకుడు పూరి జగన్నాథ్ హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. పూరి తీసిన హిట్స్‌లో మాత్రమే కాదు... ఫ్లాప్స్‌లోనూ హీరోలకు రాసిన క్యారెక్టర్లు ప్రత్యేకంగా ఉంటాయి. అటువంటి పూరి సరైన హిట్ చూసి చాలా రోజులైంది. ఆయన కెరీర్ డౌన్ ఫాల్ వెనుక ఉన్నది ఛార్మి కౌర్ అంటున్నారు నటుడు అజాజ్ ఖాన్ (Azaz Khan).

పెళ్ళాం పిల్లల్ని వదిలేస్తే సౌత్ జనాలకు నచ్చదు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'రక్త చరిత్ర'లో అజాజ్ ఖాన్ నటించారు. అతడి తొలి తెలుగు చిత్రమది. ఆ తర్వాత 'దూకుడు' చేశారు. నితిన్ 'హార్ట్ ఎటాక్'తో పూరి జగన్నాథ్ కాంపౌండ్‌లో అడుగు పెట్టారు. 'టెంపర్', 'రోగ్' సినిమాలు చేశారు. రీసెంట్‌గా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఛార్మి కౌర్ మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ కెరీర్ నాశనం కావడానికి కారణం ఆయన దగ్గరకు ఛార్మి కౌర్ రావడమే అని అజాజ్ ఖాన్ కామెంట్ చేశారు.

''రామ్ గోపాల్ వర్మను పూరి జగన్నాథ్ ఫాలో అయ్యాడని తెలుగు ప్రేక్షకులు భావించారు. ఆయన్ను ఎలా చూశారంటే... రామ్ గోపాల్ వర్మ నాశనానికి కారణం ఏమిటి? భార్యా బిడ్డలను వదిలేశాడు. పూరి జగన్నాథ్ కూడా పెళ్ళాన్ని వదిలేశారు. పిల్లలను వదిలేశారు. సౌత్ జనాల (ప్రేక్షకుల) దృష్టిలో విలన్ అయ్యాడు. దక్షిణాది ప్రజలకు పెళ్ళాం పిల్లలు వదిలేసిన మనుషులు అంటే నచ్చదు. హీరోలు రెస్పెక్ట్ ఇవ్వడం అనేశారు'' అని అజాజ్ ఖాన్ తెలిపారు.

Also ReadOG 2 Update - పవన్ ఫుల్ హ్యాపీ... 'ఓజీ 2'కు అంతా రెడీ... సుజీత్ క్లూస్ ఇచ్చారా?

ఛార్మి కౌర్ కంట్రోల్‌లో పూరి... అంతా నాశనం!
పూరి జగన్నాథ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన నాశనం కావడానికి కారణం ఛార్మి కౌర్ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు అజాజ్ ఖాన్. ''నాకు నాలుగు సినిమాల్లో పూరి జగన్నాథ్ అవకాశాలు ఇచ్చారు. ఆయన ప్రయాణాన్ని దగ్గర నుంచి చూశా. నాకు ఆయన చాలా క్లోజ్. సినిమా షూటింగ్స్ లేని సమయాల్లో కూడా గోవాకు రమ్మని చెప్పేవారు. నా తర్వాతే ఆయన దగ్గరకు ఛార్మి వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత ఆయనకు దగ్గరైన వాళ్ళంతా దూరమయ్యారు. పూరిని ఛార్మి కంట్రోల్ చేసింది. తన చెప్పు చేతల్లో ఉంచుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ పతనం మొదలైంది. ఆయన కంపెనీ పడిపోయింది. కుటుంబం నాశనం అయ్యింది'' అని పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అజాజ్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.

Also ReadSamantha Announces Maternity Leave - మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajaz Khan (@imajazkhan)

చిరంజీవి నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు అందరూ పూరిని 'సార్ సార్' అని పిలిచేవారని... అటువంటి వ్యక్తి పతనం వెనుక ఉన్నది ఛార్మి అని అజాజ్ ఖాన్ ఒకటికి రెండుసార్లు చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. తాను వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేయాలని అనుకోవడం లేదని, అలాగే ఒకరిని ఇన్సల్ట్ చేయడం కూడా తన ఆలోచన కాదని అజాజ్ ఖాన్ అన్నారు. తాను దగ్గర నుంచి చూసినది చెప్పానని, ఒకవేళ తన అభిప్రాయంతో ఎవరైనా విభేదిస్తే అది వాళ్ళ ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also ReadNBK112 Launch - నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ

Frequently Asked Questions

పూరి జగన్నాథ్ కెరీర్ పతనం గురించి అజాజ్ ఖాన్ ఏమన్నారు?

దర్శకుడు పూరి జగన్నాథ్ సరైన హిట్ చూడలేదని అజాజ్ ఖాన్ అన్నారు. ఆయన కెరీర్ నాశనానికి ఛార్మి కౌర్ కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఛార్మి కౌర్ రాక పూరి జగన్నాథ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందని అజాజ్ ఖాన్ వివరించారు?

ఛార్మి వచ్చిన తర్వాత పూరికి దగ్గరైన వారంతా దూరమయ్యారని అజాజ్ ఖాన్ అన్నారు. ఛార్మి పూరిని నియంత్రించిందని, అది ఆయన పతనానికి దారితీసిందని పేర్కొన్నారు.

పూరి జగన్నాథ్ పట్ల దక్షిణాది ప్రజల అభిప్రాయం గురించి అజాజ్ ఖాన్ ఏమన్నారు?

భార్యాబిడ్డలను వదిలేసిన మనుషులంటే దక్షిణాది ప్రజలకు నచ్చదని అజాజ్ ఖాన్ తెలిపారు. పూరి తన కుటుంబాన్ని విడిచిపెట్టడంతో ప్రజల దృష్టిలో విలన్ అయ్యాడని ఆయన వ్యాఖ్యానించారు.

అజాజ్ ఖాన్ పూరి జగన్నాథ్‌తో కలిసి ఏ సినిమాలలో పనిచేశారు?

అజాజ్ ఖాన్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ 'హార్ట్ ఎటాక్', 'టెంపర్', 'రోగ్' చిత్రాలలో నటించారు. ఈ సినిమాల ద్వారా ఆయన పూరి కాంపౌండ్‌లో అడుగుపెట్టారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget