అవును, 'ఓజీ' విడుదల తర్వాత 'ఓజీ యూనివర్స్'లో 'ఓజీ 2' తప్పకుండా ఉంటుందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఆనందం వ్యక్తం చేశారు.
OG 2 Update: పవన్ ఫుల్ హ్యాపీ... 'ఓజీ 2'కు అంతా రెడీ... సుజీత్ క్లూస్ ఇచ్చారా?
Pawan Kalyan Sujeeth New Movie: పవన్ కళ్యాణ్, ఆయన వీరాభిమాని సుజీత్ కలయికలో వచ్చిన 'ఓజీ' బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు 'ఓజీ 2' కోసం వాళ్ళిద్దరూ రెడీ అవుతున్నారు.

- ఓజీ విజయవంతం కాగా, ఓజీ-2 చిత్రం ఖాయమైంది.
- గంభీరా తెలియని గత కథను ఓజీ-2లో చూపించనున్నారు.
- జపాన్‌లో సుభాష్ బోస్‌తో సంబంధాలు కథలో ఉండవచ్చు.
- పవన్ పుట్టినరోజున సెప్టెంబర్ 2న చిత్రం ప్రారంభం కావచ్చు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు విపరీతంగా నచ్చిన సినిమా 'ఓజీ' (They Call Him OG). రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న, బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసిన చిత్రమిది. ముఖ్యంగా అభిమాని దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో మరోసారి చూపించిన చిత్రమిది. ఇప్పుడు 'ఓజీ యూనివర్స్' (OG Universe)లో మరో సినిమా రాబోతోంది. 'ఓజీ 2' గురించి మరో అప్డేట్ వచ్చింది.
'ఓజీ 2'... ఇది గంభీరా కథ!
'అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే' - ఈ ఒక్క మాట, 'ఓజీ' టీజర్‌లో సుజీత్ చూపించిన విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచడమే కాదు... అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ముంబైలో మాఫియా ప్రపంచాన్ని వణికించిన ఓజాస్ గంభీర, కోనేళ్ళు ముంబైను వదిలి వెళతాడు. మళ్ళీ తిరిగి వస్తాడు. మధ్యలో ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? అనేది 'ఓజీ 2'లో చూపించే అవకాశం ఉంది.
'ఓజీ' విడుదల తర్వాత 'ఓజీ యూనివర్స్' అనౌన్స్ చేశారు. 'ఓజీ 2' తప్పకుండా ఉంటుందని చెప్పారు. అయితే... ప్రీక్వెలా? లేదంటే సీక్వెలా? అనేది మాత్రం చెప్పలేదు. అందువల్ల, 'ఓజీ 2'లో ఏ కథ చెబుతారు? అనే ఆసక్తి నెలకొంది. 'ఓజీ 2' అనౌన్స్ చేశాక... పవన్, సుజీత్ మధ్య డిస్కషన్స్ జరిగాయి. ఆ చర్చల్లో కొంత వీడియో రూపంలో విడుదల చేశారు. 'The untold story of Gambheera is ready to unfold' అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే... ప్రేక్షకులకు చూపించని గంభీరా కథను చెప్పబోతున్నారు అన్నమాట.
Also Read: NBK112 Launch - నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ!
'ఓజీ' విడుదల తర్వాత ఓ కామిక్ బుక్ తీసుకు వచ్చారు. అది పవన్‌కు ఇచ్చారు సుజీత్. అందులో కామిక్ విజువల్స్ చూసి పవన్ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఆ వీడియో గమనిస్తే... జపాన్ వెళ్ళిన ఓజీ, అక్కడ సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఏం చేశాడు? అనేది కూడా 'ఓజీ 2'లో చెప్పే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటంలో ఓజీ పాత్రను, పోరాటాన్ని చెప్పవచ్చు. ఒక్కటి మాత్రం నిజం... పవన్ కళ్యాణ్ అయితే ఫుల్ హ్యాపీ. 'ఓజీ 2' చేయడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నారని ఆయన స్మైల్ చూస్తే అర్థం అవుతోంది. 'నా వైపు నుంచి నేను రెడీ' అని చెప్పారు.
Before the storm arrives... there's a moment of silence.
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 25, 2026
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋#OG2 pic.twitter.com/pDzTwHJ6zH
పవన్ కళ్యాణ్, సుజీత్ వీడియో చూస్తే... కథపై కొన్ని క్లూస్ ఇచ్చారని అర్థం అవుతోంది. అతన్ని అందరూ 'అవుట్ సైడర్' అంటారని సుజీత్ చెప్పారు. ఆ అవుట్ సైడర్ ఎవరు? 'ఓజీ'లో పవన్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించగా... వాళ్ళకు ఓ పాప ఉన్నట్టు చూపించారు. ఇప్పుడు ఆ పాప పాత్ర సైతం 'ఓజీ 2'లో ఉంటుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'ఓజీ'ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై పవన్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ చిత్రానికి కూడా తమన్ సంగీతం అందిస్తారు. 'ఓజీ'కి ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది.
Also Read: Mahesh Babu - వారణాసికి సూపర్ స్టార్ స్మాల్ బ్రేక్... ఫ్రాన్స్‌లో ఫ్యామిలీతో మహేష్ బాబు
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Frequently Asked Questions
'ఓజీ 2' సినిమా వస్తుందా?
'ఓజీ 2' కథ దేని గురించి ఉంటుంది?
'గంభీరా'కు సంబంధించిన చెప్పని కథను 'ఓజీ 2'లో చూపించే అవకాశం ఉంది. ముంబై వదిలి గంభీరా ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు వంటి విషయాలు ఉండవచ్చు.
'ఓజీ 2' ఎప్పుడు ప్రారంభం కావచ్చు, ఎవరు నిర్మిస్తున్నారు?
పవన్ కళ్యాణ్ పుట్టినరోజున, సెప్టెంబర్ 2న 'ఓజీ 2' లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ నిర్మించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















