Fauzi Prequel : రెండు పార్టులుగా ప్రభాస్ 'ఫౌజీ' - సీక్వెల్ కాదు ప్రీక్వెల్... అసలు రీజన్ ఏంటంటే?
Fauzi Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' మూవీపై మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీని రెండు పార్టులుగా రూపొందించనున్నట్లు డైరెక్టర్ హను రాఘవపూడి తెలిపారు.

Prabhas Fauzi Movie Planned To Release In Two Parts : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేం హను రాఘవపూడి కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ పీరియాడికల్ డ్రామా 'ఫౌజీ'. రీసెంట్‌గా డార్లింగ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... లేటెస్ట్ అప్డేట్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా రానున్నట్లు డైరెక్టర్ హను తెలిపారు.
ప్రీక్వెల్ ప్లాన్... అసలు రీజన్
ఏ మూవీ అయినా రెండు పార్టులంటే వెంటనే సీక్వెల్ అనే గుర్తొస్తుంది. అయితే, 'ఫౌజీ' మూవీకి మాత్రం ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు డైరెక్టర్ హను. ఫస్ట్ పార్ట్ కంటే డిఫరెంట్ కోణాన్ని అన్వేషించేలా ప్రీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. 'ఫౌజీతో ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాం. భారతదేశ వలస రాజ్యాల చరిత్రను ఈ స్టోరీ అన్వేషిస్తుంది. కొన్ని విషాదకరంగా ముగిసినా మరో కథలో అద్భుత కథలుగా ఉండే అనేక విషయాలు ఉన్నాయి.
పర్సనల్‌గా నాకు ఇన్‌స్పిరేషన్ కలిగించిన కొన్ని రియల్ లైఫ్ ఘటనలను ఇందులో చూపించనున్నాం. ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ రోల్ ఒక కోణంలో సాగితే ప్రీక్వెల్‌లో ఆయన రోల్ పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది. స్వాతంత్ర్య యోధుల కథలను, రియల్ ఇన్సిడెంట్స్‌ను విషాదంగా కంటే ఆకాంక్షాత్మక చిత్రాలుగా రూపొందించడం ముఖ్యం. ' అని చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌లో మరింత ఇంట్రెస్ట్ నెలకొంది.
స్వాతంత్ర్యం ముందు 1930 టైంలో జరిగిన ఘటనల ఆధారంగా 'ఫౌజీ' మూవీ తెరకెక్కనుంది. ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడిగా... పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌లో మూవీ స్టోరీపై హింట్ ఇచ్చారు డైరెక్టర్ హను. 'పద్మవ్యూహ విజేత పార్థ, పాండవపక్షే సంస్థ కర్ణ, గుర్విరహిత ఏకలవ్య, జన్మనేవ చ యోధా ఏషః'... అంటూ హీరో ఎలివేషన్ హైలెట్ అవుతోంది. పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, మహాభారతంలో కౌరవుల పక్షాన నిలబడ్డ కర్ణుడు, ఆ తర్వాత ధైర్య సాహసాలతో గొప్ప విలువిద్య నేర్చుకున్న ఏకలవ్యుడిని గుర్తు చేసేలా... ధర్మం వైపు నిలబడ్డ చరిత్రలో ఓ యోధుడి కథను చూపించనున్నట్లు అర్థమవుతోంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... ఫస్ట్ లుక్, దానిపై సంస్కృత శ్లోకంతోనే ఆ హైప్ పదింతలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో స్వాతంత్ర్య సమర యోధుల చరిత్రను చూపించనున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే అనుపమ్ ఖేర్, భానుచందర్, జయప్రద, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తుండగా... విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 14న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















