News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా తిరుపతిలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈవెంట్ లో ప్రభాస్ తన స్పీచ్ తో అదరగొట్టేసారు.

FOLLOW US: 
Share:

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' మూవీకి సంబంధించి తాజాగా తిరుపతిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ప్రభాస్ తన స్పీచ్ తో అదరగొట్టేశారు. ఇక ఈ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ.. "జైశ్రీరామ్, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? అని అడగగానే అభిమానుల నుంచి.. అరుపులు కేకలతో రెస్పాన్స్ చ్చింది. దీంతో ప్రభాస్ ‘‘ఓహో అయితే అదిరిపోయింది అన్నమాట. అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినట్టే. సరిగ్గా ఏడు నెలల క్రితం మొదటిసారి 'ఆదిపురుష్' 3D టీజర్ ని నా ఫ్యాన్స్ కోసం వేయమని ఓమ్ రౌత్ ని అడిగాను. ఒకసారి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూడమని అన్నాను. సో అలా ఫస్ట్ టైం 3డీలో మీరు టీజర్ చూశారు. చూసి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మొత్తం టీం ని ఇక్కడదాకా నడిపించింది. ఇక ట్రైలర్ రిలీజ్ సమయంలో ఓం ఈ ట్రైలర్‌ను ఫ్యాన్స్ చూడాలని పట్టుబట్టాడు. వాళ్లు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్లే మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ తో మూవీ టీమ్ అంతా ఒక యుద్ధమే చేశారు. సుమారు 8 నెలలు నిద్రపోకుండా కేవలం గంట, రెండు గంటలు మాత్రమే పడుకుని ఒక్కొక్కరు సినిమా కోసం పది రెట్లు పని చేశారు’’ అని ప్రభాస్ తెలిపారు.

‘‘ఇక ‘ఆదిపురుష్’ లాంటి సినిమా చేయడం మా అదృష్టం. ఒకసారి చిరంజీవి గారు అన్నారు. ఏంటి రామాయణం చేస్తున్నావా అని అన్నారు. అప్పుడు అవును సార్ అని అన్నాను. అది అదృష్టం. అలాంటి అదృష్టం అందరికి దొరకదు. నీకు దొరికింది అని చెప్పారు. నేను కూడా అంతే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చేయాలంటే అది మామూలు విషయం కాదు. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలా సినిమా మొదట్లో మాకు చాలా కష్టాలు వచ్చాయి. వాటన్నిటినీ అధిగమించి ఈరోజు సినిమా పూర్తి చేసాం. హ్యాట్సాఫ్ టు ద టీం అండ్ డైరెక్టర్ ఓం రౌత్. ఈ సినిమా కోసం ఓం చేసిన ఫైట్ మామూలు ఫైట్ కాదు. నా 20 ఏళ్ల కెరియర్లో ఎవరిని అలా చూడలేదు. సినిమా కోసం ఏడు నెలల నుంచి అసలు నిద్రపోలేదు’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. 

తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా: ప్రభాస్

ప్రసంగం మధ్యలో ఫ్యాన్స్ అంతా పెళ్లి గురించి ప్రభాస్ ని అడిగారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి రిప్లై ఇస్తూ.. ‘‘పెళ్లి ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటా ఎప్పుడైనా’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత హీరోయిన్ కృతి సనన్ గురించి మాట్లాడుతూ.. మా జానకి గురించి చెప్పాలంటే ఒకసారి పోస్టర్లో ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ కళ్ళల్లో నీళ్లు వస్తూ వచ్చింది. అప్పుడు నేను కృతితో ఏం ఎక్స్‌ప్రెషన్ అమ్మా ఇది అని అన్నాను. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అందరూ సీతమ్మ, జానకమ్మా అన్నారు’’ అని ప్రభాస్ తెలిపారు.

‘‘సినిమాలో సీత క్యారెక్టర్ ని పెట్టడానికి చాలా టైం తీసుకున్నారు. ఏ హీరోయిన్ కైతే మంచి పేరు ఉందో, మంచి అమ్మాయో ఆ అమ్మాయిని సీతగా పెట్టాలి అనుకున్నారు. ఆమెనే కృతి సనన్.  ఇక దేవ్ జి మన హనుమంతుడు మరాఠీలో చాలా పెద్ద యాక్టర్. నేను ఆయనతో సీన్స్ చేసినప్పుడు తెలియని కొత్త ఎమోషన్ ఫీల్ అయ్యాను. నేను ఆయనే నిజమైన హనుమంతుడని ఫీలయ్యాను. అలాంటి ఓ కొత్త ఎమోషన్ నా లైఫ్ లో ఎప్పుడూ కలగలేదు. అలా దేవిజితో చేసిన పర్ఫామెన్స్ లో ఒక కొత్త ఎమోషన్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ సినిమాలో గ్రేటెస్ట్ ఎమోషన్ ఇచ్చారు’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. 

ఇక చివరగా ఫ్యాన్స్ అందరికీ లవ్ యు చెప్తూ ‘‘నేను మామూలుగా కంటే ఎక్కువ మాట్లాడేశాను. మామూలుగా కంటే ఎక్కువ సినిమాలు కూడా చేస్తున్నాను కదా! అయినా ఎక్కువ మాట్లాడాలంటే ఎలా? సంవత్సరానికి రెండు సినిమాలు. ఎన్నిసార్లు మాట్లాడాలి. కొంచెం మాట్లాడి సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తా. అదే బెటర్. అది నాకు ఈజీ. మీకు ఓకే కదా. సంవత్సరానికి మూడు కూడా రావచ్చు. లేట్ అయితే నాకు సంబంధం లేదు. సో స్టేజ్ మీద తక్కువగా మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. ఇక ‘ఆదిపురుష్’ జస్ట్ సినిమా మాత్రం కాదు. అదొక అదృష్టం. అని చెప్తూ థాంక్యూ డార్లింగ్ ఐ లవ్ యు" అంటూ స్పీచ్ ముగించారు. ఇంతకు ముందు ఓం రౌత్ మాట్లాడుతూ.. ప్రతి సినిమా హాల్‌లో హనుమంతుడి కోసం ఒక సీట్ ఖాళీగా వదిలాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఆ విషయాన్ని ప్రేక్షకులకు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఏడ్చేశారు.

Also Read: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Published at : 06 Jun 2023 11:56 PM (IST) Tags: Adipurush Chinna Jeeyar Swamy Prabhas Speech Adipurush Pre Release Omraut

ఇవి కూడా చూడండి

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?

Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?

టాప్ స్టోరీస్

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు